Begin typing your search above and press return to search.

కాక్రోచ్ సౌండ్ కంటిన్యూ...ప్లాన్ బీ కోసం ?

కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టి ఉద్యమించారు. సోషల్ మీడియా నుంచి నేరుగా గ్రౌండ్ లోకి వచ్చి పడ్డారు.

By:  Satya P   |   1 Aug 2026 9:24 AM IST
కాక్రోచ్ సౌండ్ కంటిన్యూ...ప్లాన్ బీ కోసం ?
X

కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టి ఉద్యమించారు. సోషల్ మీడియా నుంచి నేరుగా గ్రౌండ్ లోకి వచ్చి పడ్డారు. జంతర్ మంతర్ వద్ద రాజకీయ పోరాటానికి దిగారు. కేంద్ర పాలకులను కూడా దిగి వచ్చేలా చేశారు. చివరికి అనుకున్నది సాధించారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా అన్నది జరిగిపోయింది. విద్యార్థుల డిమాండ్లు అయితే నెరవేరాయి. దాంతో కాక్రోచ్ ఆందోళన కూడా ముగిసింది. కానీ కాక్రోచ్ అయితే ఇంకా సౌండ్ చేస్తూనే ఉంది. మరి ఆ సౌండ్ వెనక వ్యూహం ఏంటో అన్నది మాత్రం అర్థం కావడం లేదని అంటున్నారు.

బూతులు మాట్లాడితే కేసులా :

బూతులు మాట్లాడితే కేసులు పెడతారా అంటూ కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ప్రశ్నిస్తున్నారు. కేవలం బూతులు మాట్లాడినంత మాత్రాన వెంటనే క్రిమినల్ కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు పెట్టడం సరికాదని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. ఎవరైనా బూతులు మాట్లాడితే నేరుగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ లేదా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం కంటే తొలి దశలో కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. చట్టం అందరికీ సమానం అని ఆయన హితవు చెబుతున్నారు. కేవలం సోషల్ మీడియాలో లేదా నిరసనలలో బూతులు మాట్లాడారనే కారణంతో కొందరిపై మాత్రమే ఎఫ్‌ఐఆర్‌లు వేయడాన్ని తప్పుబట్టారు. రాజకీయ పార్టీలకతీతంగా బీజేపీ ఐటీ సెల్ సహా అందరిపై ఇలాంటి నిబంధనలను ఒకేలా అమలు చేయాలని అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. దీంతో ఆయన తన పోరాటానికి కామా మాత్రమే పెట్టారు తప్ప ఫుల్ స్టాప్ పెట్టలేదని అంటున్నారు.

మోడీ ఆవేదన :

విద్యార్ధుల బూతుల మీద ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఆందోళనలలో తనపైన మాత్రమే కాదు దివంగతురాలు అయిన తన తల్లిపై సైతం దూషణలకు పాల్పడటం పట్ల నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. బూతులు దూషణలు ఏ సమస్యను పరిష్కరించలేవని పేర్కొంటూనే తప్పుదారి పట్టిన ఆ యువతను క్షమిస్తున్నట్లు ఆయన తెలిపారు. జంతర్ మంతర్ నిరసనల్లో కొందరు నాగరిక సమాజం హర్షించని రీతిలో తనను తన తల్లిని దూషించారని ప్రధాని మోదీ సోషల్ మీడియా వీడియోలో తాజాగా ఎత్తి చూపడం విశేషం. ఇలాంటి బూతుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అయితే మార్పు రావాలని కోరుకునే యువతను శిక్షించడం కంటే సరైన మార్గంలో పెట్టాలని పిలుపునిచ్చారు. పేపర్ లీక్ కేసులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

అజెండా కోసమేనా :

అయితే దాదాపుగా మీడియాతో ప్రతీ రోజూ సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే అందుబాటులో ఉంటున్నారు. ఆయన ఒక రోజు బీజేపీలో తనను చేరమంటున్నారు అని కామెంట్స్ చేసి సంచలనం రేపారు. తాజాగా విద్యార్ధుల బూతుల విషయంలో కేసులు పెడితే బీజేపీ నేతల మీద పెట్టాలంటూ రివర్స్ ఎటాక్ చేశారు. ఇంకో వైపు చూస్తే విద్యార్దులను కేసుల పేరుతో వేధిస్తే తాను మళ్ళీ ఉద్యమిస్తాను అని కూడా భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిని బట్టి చూస్తే సరైన అజెండా కోసం సీజేపీ ఫౌండర్ చూస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఏదో రూపంలో తొందరలోనే ఆయన మళ్ళీ జనంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఎందుచేతనంటే అభిజిత్ దీప్కే తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీమానా కోరుతూ డిమాండ్ చేశారు. ఇవన్నీ రాజకీయ స్వరాలే అని అంటున్నారు. చూడాలి మరి కాక్రోచ్ ఎపుడు రీసౌండ్ చేస్తుంది అన్నది.