బర్త్ డే వేళ అదిరిపోయే న్యూస్ తో విజయ్ ?
ఇలా ముఖ్యమంత్రి అయ్యారు, అలా తొలి పుట్టిన రోజు వస్తోంది. సీఎం కుర్చీ ఎక్కిన కేవలం నలభై రోజుల వ్యవధిలోనే విజయ్ తన తొలి బర్త్ డే జరుపుకోబోతున్నారు. ఈ నెల 22న దళపతి, సీఎం విజయ్ పుట్టిన రోజు.
By: Satya P | 13 Jun 2026 1:53 PM ISTఇలా ముఖ్యమంత్రి అయ్యారు, అలా తొలి పుట్టిన రోజు వస్తోంది. సీఎం కుర్చీ ఎక్కిన కేవలం నలభై రోజుల వ్యవధిలోనే విజయ్ తన తొలి బర్త్ డే జరుపుకోబోతున్నారు. ఈ నెల 22న దళపతి, సీఎం విజయ్ పుట్టిన రోజు. ఈసారి పుట్టిన రోజు విజయ్ కే కాదు ఆయన అభిమానులకు కూడా ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే రోజు. ప్రతీ ఏటా సినీ స్టార్ గానే ఆయన పుట్టిన రోజును అభిమానులు జరుపుకునే వారు. ఈసారి ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో మా ఆరాధ్య నాయకుడు అంటూ అపుడే దళపతి ఫ్యాన్స్ అంతా తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలను చేసుకుంటున్నారు.
అతి పెద్ద ప్రకటనతో :
అయితే పుట్టిన రోజున విజయ్ కూడా అభిమానులకు తనను ఆరాధించే వారికి గొప్ప వార్తను వినిపించబోతున్నారు అని అంటున్నారు. అదేంటి అంటే టీవీకే పార్టీకి విజయ్ కి మద్దతుగా దన్నుగా ఒక భారీ న్యూస్ చానల్ ని ప్రారంభించడం అని చెబుతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో సుదీర్ఘ కాలం కొనసాగాలని భావిస్తున్న 52 ఏళ్ళ విజయ్ అనేక ఇన్నింగ్స్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో తన రాజకీయ పార్టీకి ఫుల్ సపోర్టుగా ఒక పవర్ ఫుల్ న్యూస్ చానల్ ఉండాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. నిజానికి చూస్తే తమిళనాడులో మీడియాకూ రాజకీయానికి మధ్య అవినాభావ సంబంధం ముడి పడిపోయి ఉంది. అటు డీఎంకేకు సన్ టీవీ సపోర్ట్ ఉంటే ఇటు అన్నా డీఎంకేకి జయ టీవీ మద్దతు ఉంది. విజయ్ కి ఎన్నికల వేళ కేవలం సోషల్ మీడియా మాత్రమే సపోర్టుగా నిలిచింది. దాంతో తమ పార్టీకి కూడా ఒక సొంత చానల్ ఉండాలని ఆయన భావిస్తున్నారని అందుకే తన బర్త్ డే రోజున ప్రకటిస్తారు అని అంటున్నారు.
భారీ ఎత్తున ఆదరణ :
సినీ రంగాన దళపతిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్ న్యూస్ చానల్ కనుక పార్టీ పరంగా పెడితే అది భారీ ఆదరణతో దూసుకుని పోవడం ఖాయమని అంటున్నారు. ఎందుచేతనంటే విజయ్ కి ఉన్న ఫ్యాన్ మెయిల్ బలం అలాంటిది అని గుర్తు చేస్తున్నారు. దాంతో పాటు తమ ప్రియతమ వెండి తెర నాయకుడు రాజకీయ నాయకుడు అయ్యాక ఫ్యాన్స్ ఆయన గురించిన వార్తల కోసం ఎంతో ఎదుచూస్తున్నారు. అయితే అవి ప్రస్తుతం ఉన్న తమిళనాడు మీడియా రాజకీయ ప్రభావంతో పెద్దగా ప్రచారంలోకి నోచుకోవడం లేదని అంటున్నారు. అందుకే సొంత చానెల్ పెడితే అభిమానులందరి కోరిక తీరుతుందని దిశా నిర్దేశం చేసినట్లు అవుతుందని విజయ్ భావిస్తున్నారు అని అంటున్నారు.
చానెల్ పేరు ఇదేనా :
ఇక విజయ్ తన టీవీకే పార్టీ తరఫున అధికారికంగా ఒక చానెల్ ని ప్రారంభిస్తారు అన్న వార్తలు వ్యాపిస్తున్న నేపధ్యంలో ఆ చానెల్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆ చానెల్ పేరు వెట్రీ న్యూస్ గా ఉండబోతోంది అని అంటున్నారు. టీవీకే ఫుల్ ఫార్మ్ చూస్తే తమిళగ వెట్రి కగలం. వెట్రి అంటే విజయం అని అర్థం. విజయ్ పేరు కూడా అదే. ఇపుడు న్యూస్ చానల్ కి కూడా అదే పేరు కలపాలని చూస్తున్నారని సెంటిమెంట్ తో పాటు విజయ్ పేరు కూడా అందులో ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే వెట్రీ న్యూస్ అని పెడుతున్నారని ప్రచారం సాగుతోంది. ఇక టీవీకే అధికారిక న్యూస్ చానెల్ విషయాన్ని తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మణికందన్ భాస్కరన్ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా తెలియజేయడంతో టీవీకే వర్గాలతో పాటు వియజ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్ లో ఉన్నాయి.
వెనక ఉన్నదెవరు :
ఇక వెట్రి న్యూస్ చానెల్ ని ఎవరు స్థాపిస్తున్నారు యజమానులు ఎవరు అన్న చర్చ సాగుతోంది. అయితే విజయ్ కి అత్యంత సన్నిహితుడైన ఒక వ్యాపారవేత్త ఈ చానెల్ ని స్థాపిస్తున్నారు అని అంటున్నారు. ఇక ఇప్పటికే ఈ చానెల్ లో పనిచేసే సిబ్బంది కోసం ప్రకటనలు ఇస్తున్నారు అని అంటున్నారు. ఇలా ఇన్ని జరుగుతున్నా టీవీకే మాత్రం అధికారికంగా ప్రకటన అయితే చేయడం లేదు. మొత్తానికి సీఎం గా తొలి బర్త్ డే వేళ విజయ్ నుంచి ఈ తరహా సంచలన ప్రకటన ఉండబోతోంది అని అంతా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
