Begin typing your search above and press return to search.

ఎల్ఎం-10 వర్సెస్ ఆర్ఆర్-9... జెర్సీలో సీఎం రేవంత్ ప్రాక్టీస్ పిక్స్ వైరల్!

రెగ్యులర్ గా బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్ లో కనిపించే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రెడ్ & వైట్ కలర్ కాంబినేషన్ లోని ఫుట్ బాల్ జెర్సీలో కనిపించారు.

By:  Raja Ch   |   1 Dec 2025 10:04 AM IST
ఎల్ఎం-10 వర్సెస్  ఆర్ఆర్-9... జెర్సీలో సీఎం రేవంత్  ప్రాక్టీస్  పిక్స్  వైరల్!
X

రెగ్యులర్ గా బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్ లో కనిపించే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రెడ్ & వైట్ కలర్ కాంబినేషన్ లోని ఫుట్ బాల్ జెర్సీలో కనిపించారు. ఈ సందర్భంగా యువకులతో కలిసి ఆయన ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ప్రాక్టీస్ వెనుక అత్యంత కీలక, ఆసక్తికర మ్యాచ్ ఉండగా.. ఆర్ఆర్-9 టీమ్ కు రేవంత్ నాయకత్వం వహిస్తున్నారు!

అవును... ఫుట్ బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ తన రాబోయే భారత పర్యటనను ధృవీకరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఆయన డిసెంబర్ 13న హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ సమయంలో.. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోని మైదానంలో ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్నేహపూర్వక మ్యాచ్ లో తలపడనున్నారు. ఇది ఆసక్తిగా మారింది.

అందుతోన్న సమాచారం ప్రకారం.. లియోనెల్ మెస్సీ, రేవంత్ రెడ్డి వరుసగా 10, 9 నంబర్ల జెర్సీలతో మ్యాచ్ ను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ సందర్భంగా... రెండు జట్లకు ఎల్ఎం-10 వర్సెస్ ఆర్ఆర్-9 అని పేర్లు పెట్టే అవకాశం ఉందని.. ఈ రెండు జట్లలోనూ స్థానిక అకాడమీలు, సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి ఫుట్ బాల్ ఆడే యువకులు ఉంటారని అంటున్నారు.

ఈ సందర్భంగా... మెస్సీ రాక తెలంగాణ ప్రపంచవ్యాప్త గుర్తింపును పెంచుతుందని.. హైదరాబాద్ ను క్రీడా, సాంస్కృతిక, ఆర్థిక కేంద్రంగా నిలబెట్టడానికి సహాయపడుతుందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు! ఇక భారత్ బిడ్ ను గెలిస్తే 2026 ఒలింపిక్ క్రీడల్లో కొన్ని విభాగాలను హైదరాబాద్ కు ఆతిథ్యం ఇవ్వడానికి అనుమతించాలని పీఎం మోడీని ఇప్పటికే సీఎం రేవంత్ కోరారు!

ఒకప్పుడు ఫుట్ బాల్ పవర్ హౌస్ గా హైదరాబాద్!:

ఒకప్పుడు హైదరాబాద్ ను భారతదేశ ఫుట్ బాల్ పవర్ హౌస్ లలో ఒకటిగా పరిగణించేవారు. 1950 - 1970 మధ్య విక్టర్ అమల్ రాజ్, తులసీ దాస్ బలరాం, సయ్యద్ నయీముద్దీన్ వంటి ఆటగాళ్లు ఆ పేరుకు ప్రధన కారణంగా ఉండేవారు. ఇదే సమయంలో.. హైదరాబాద్ సుమారు 21 మంది అంతర్జాతీయ ఫుట్ బాల్ ఆటగాళ్లను, జాతీయ కోచ్ లను, ఫిఫా రిఫరీలను అందించింది. మళ్లీ ఆ పూర్వ వైభవం తీసుకురావాలని తెలంగాణ సర్కార్ ప్రయతిస్తుంది!