సీఎం అంటే సెంట్రల్ మినిస్టర్...ఆయనకు జాక్ పాట్ ?
ఇక కేంద్ర మంత్రి వర్గ విస్తరణ త్వరలో జరగబోతోంది అన్నది ఢిల్లీ వర్గాలలో జరుగుతున్న ప్రచారంగా ఉంది. ప్రధాని విదేశీ పర్యటన ముగియగానే జరుగుతుందని అంటున్నారు.
By: Satya P | 17 May 2026 9:20 AM ISTఉత్తరాంధ్రాలో బీజేపీకి ఉన్న ఏకైక ఎంపీ అనకాపల్లి లో ఉంది. అక్కడ బీజేపీ గెలుస్తుందని కలలో కూడా ఎవరూ అనుకోరు. కానీ దిగ్గజ నేతగా సీఎం రమేష్ దిగి గెలుపుని సాధించారు. బిగ్ షాట్ గా రమేష్ ఉండడంతో పాటు కూటమి ప్రభంజనం కూడా బీజేపీకి పట్టం కట్టింది. అనకాపల్లి అంతటా రూరల్ బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది. అలాంటి చోట కమలం వికసించడం అంటే మామూలు విషయం కాదు, ఆ ఫీట్ ని సీఎం రమేష్ అవలీలగా సాధించారు. అంతే కాదు గడచిన రెండేళ్ళ కాలంలో పార్టీని పటిష్టం చేశారు. కూటమి పార్టీలతో నేతలతో మంచి సంబంధాలు నెరుపుతూ వస్తున్నారు.
కీలక పదవులతో :
ఇప్పటికే సీఎం రమేష్ కేంద్ర ప్రభుత్వ పెద్దల్తో ఎంతో సాన్నిహిత్యం మెయిన్ టెయిన్ చేస్తూ ఉంటారు. ఆయన అనేక పార్లమెంటరీ కమిటీలలో కీల పదవుల్లో ఉంటారు. వీటికి అదంగంగా రైల్వే స్టాండి కమిటీ చైర్మన్ పదవిని కూడా ఆయనకు కేంద్రం ఇచ్చింది. ఏపీలో బీజేపీ బలపడాలని చూస్తోంది. దానికి సీఎం రమేష్ లాంటి నేతలు చాలా అవసరం అని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే అనూహ్యంగా రాయలసీమ నుంచి తీసుకుని వచ్చి మరీ ఆయనకు అనకాపల్లి బాధ్యతలు అప్పగించారు. తద్వరా ఉత్తరాంద్ర్హాలో బీజేపీ జెండాను మరింతగా ఎగరనీయాలన్నదే కాషాయ వ్యూహంగా ఉంది.
రెండవ మంత్రి సీటు :
ఇక కేంద్ర మంత్రి వర్గ విస్తరణ త్వరలో జరగబోతోంది అన్నది ఢిల్లీ వర్గాలలో జరుగుతున్న ప్రచారంగా ఉంది. ప్రధాని విదేశీ పర్యటన ముగియగానే జరుగుతుందని అంటున్నారు. ఇక ఏపీ నుంచి చూస్తే జనసేనకు ఒక మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. అలాగే తెలుగుదేశానికి కూడా మరో మంత్రి పదవి ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. బీజేపీకి ఇప్పటికే ఒక మంత్రి పదవి ఉంది. అది నరసరావుపేట ఎంపీ శ్రీనివాసవర్మకు ఇచ్చారు. అయిరే బీజేపీకి ముగ్గురు ఎంపీలు లోక్ సభ నుంచి ఉన్నారు.
ఈసారి గురి తప్పదు :
దాంతో ఈసారి ఉత్తరాంధ్ర నుంచి గెలిచిన సీఎం రమేష్ కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని బలంగా నిర్ణయించారు అని ప్రచారం అయితే సాగుతోంది. ఘటనాఘటన సమర్ధుడు రమేష్ కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం ద్వారా 2029 ఎన్నికల్లో ఉత్తరాంధ్రాలో బీజేపీని పూర్తి స్థాయిలో విస్తరించాలన్నది పక్కా ప్రణాళికగా కనిపిస్తోంది. నిజానికి 2024 ఎన్నికల్లోనే రమేష్ కి కేంద్ర మంత్రి పదవి దక్కాల్సి ఉంది. కానీ అది జస్ట్ మిస్ అయింది. ఈసారి మాత్రం గురి తప్పదని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఇంటి పేరు సీఎం అంటే సెంట్రల్ మినిస్టర్ అని అలా రమేష్ ని రేపటి నుంచి పిలవాల్సి ఉంటుందని అభిమానులు అనుచరులు హుషారు చేస్తున్నారు.
