Begin typing your search above and press return to search.

ఒక‌టి చేయ‌మంటే మ‌రొక‌టి: ఎమ్మెల్యేలు మారాలి.. !

ఎమ్మెల్యేలు మారాలి. వారి ప‌నితీరు కూడా మార్చుకోవాలి. ఇదీ.. తాజాగా మ‌రోసారి సీఎం చంద్ర‌బాబు చెప్పిన మాట‌. నిజానికి ఆయ‌న ఎప్ప‌టి నుంచో ఈ మాట చెబుతున్నారు.

By:  Garuda Media   |   20 Oct 2025 10:06 AM IST
ఒక‌టి చేయ‌మంటే మ‌రొక‌టి: ఎమ్మెల్యేలు మారాలి.. !
X

ఎమ్మెల్యేలు మారాలి. వారి ప‌నితీరు కూడా మార్చుకోవాలి. ఇదీ.. తాజాగా మ‌రోసారి సీఎం చంద్ర‌బాబు చెప్పిన మాట‌. నిజానికి ఆయ‌న ఎప్ప‌టి నుంచో ఈ మాట చెబుతున్నారు. అయితే.. ఇప్పుడు మ‌రోసారి కూడా ఆయ‌న ఇదే మాట చెప్పారు. శ‌నివారం సాయంత్రం సుదీర్ఘంగా నిర్వ‌హించిన ఎంపీలు, ఎమ్మెల్యేల స‌మావేశంలో అనేక అంశాల‌ను సీఎం చంద్ర‌బాబు ప్ర‌స్తావించిన‌ట్టు తెలిసింది. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతు న్న ప‌రిణామాల‌పై చంద్ర‌బాబు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు పార్టీ నాయ‌కులు తెలిపారు.

ప్ర‌ధానంగా వ‌చ్చే ఏడాది మేలో జ‌రిగే మ‌హానాడులో పార్టీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ముందుగానే సంస్థాగ‌త ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించి.. నాయ‌కుల‌ను ఎంపిక చేయాలి. ఈ క్ర‌మం లోనే పార్టీని బ‌లోపేతం చేసేందుకు కొన్నాళ్ల కింద‌టే నాయ‌కుల‌కు బాధ్య‌త అప్ప‌గించారు. సంస్థాగ‌త ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు కూడా క‌మిటీల‌ను నియ‌మించారు. కానీ, ఈ క‌మిటీలు కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమితం అయ్యాయి. ప‌నులు చేయ‌డం లేదన్న‌ది సీఎం చంద్ర‌బాబు చెప్పిన‌మాట‌.

త‌ద్వారా వ‌చ్చే మేలో నిర్వ‌హించే మ‌హానాడు నాటికి ఇబ్బందులు వ‌స్తాయ‌ని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలు త‌మ క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేసేవారిని ఎంపిక చేయాల‌ని ఒత్తిడి తెస్తున్నార‌ని.. పార్టీకి సంస్థాగ‌తంగా ప‌నిచేస్తున్నవారు.. జెండాలు మోస్తున్న‌వారిని ప‌క్క‌న పెడుతున్నార‌న్న వాద‌న‌, వివాదాలు కూడా కొన‌సాగుతున్నా యి. ఈ వ్య‌వ‌హారంపైనే సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యారు. పార్టీలో ఎవ‌రు ప‌నిచేస్తున్నారో.. పార్టీ జెండాను ఎవ‌రు మోస్తున్నారో.. వారికే ప‌దవులు ఇవ్వాల‌ని.. సంస్థాగ‌తంగా కూడా వార‌నే ఎంపిక చేయాల‌ని ఆయ‌న ఆదేశించారు. ఈ విష‌యంలో ఎమ్మెల్యేల జోక్యాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు.

అంతేకాదు.. ఎమ్మెల్యేలు ఈ విష‌యంలో పార్టీ లైన్‌కు భిన్నంగా వెళ్తే సీరియ‌స్‌గా స్పందించాల్సి ఉం టుందని వ్యాఖ్యానించారు. ప్ర‌తి విష‌యం త‌న‌కు తెలుసున‌ని వ్యాఖ్యానించిన సీఎం చంద్ర‌బాబు.. సంస్థా గ‌త ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టి.. వ‌చ్చే ప‌ది రోజుల్లో ఫ‌లితం చూపించాల‌ని సూచించారు. దీనిపై నియ‌మించి న సీనియ‌ర్ నేత‌ల క‌మిటీలు ఇంకా ప‌నిచేయ‌క‌పోవ‌డం.. ఎమ్మెల్యేల కార‌ణంగానే తాము ప‌నిచేయ‌లేకపో తున్నామ‌ని చెప్ప‌డం ప‌ట్ల కూడా ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఏదేమైనా.. ఎమ్మెల్యేలు మారాల‌ని మ‌రోసారి చెప్ప‌డం గ‌మ‌నార్హం.