మంత్రి గారి పనితీరు: మళ్లీ మారుతున్న లెక్కలు ..!
ఉమ్మడికృష్ణాజిల్లాకు చెందిన ఓ మంత్రిపై పలు ఆరోపణలు వచ్చాయి. వాటిపై గతంలోనే సీఎం చంద్ర బాబు వివరణ నివేదిక కోరారు.
By: Garuda Media | 13 Jan 2026 9:11 PM ISTమంత్రలు పనితీరుపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తున్నారు. ఎవరు బాగా పనిచేస్తు న్నారు? ఫైళ్లను ఎవరు త్వరగా క్లియర్ చేస్తున్నారు? అదేసమయంలో ప్రజల సమస్యల పరిష్కారంలో ఎవరు ముందుంటున్నారు? అనే కీలక విషయాలను పరిగణనలోకి తీసుకుని మంత్రుల పనితీరుకు మార్కులు వేస్తున్నారు. తాజాగా గత మూడుమాసాల్లో మంత్రుల పనితీరుకు సంబంధించి.. మరోసారి చంద్రబాబుకు లెక్కలు చేరాయి.
ఈ నెల 28న మంత్రి వర్గ సమావేశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మంత్రుల పనితీరుపై చంద్రబాబు వివిధ మార్గాల్లో లెక్కలు సేకరించారు. దీనిలో ప్రధానంగా టీడీపీ మంత్రుల పైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. చాలా మంది మంత్రుల పనితీరు మారినట్టు అంచనాకు వచ్చారు. ప్రజలకు మమేకం కావడంతోపాటు.. వారి సమస్యల పరిష్కారానికి కూడా ప్రయత్నిస్తున్నవారు పెరుగుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు పనితీరును మెరుగు పరుచుకోవడంలో ముందున్నారు.
ఉమ్మడికృష్ణాజిల్లాకు చెందిన ఓ మంత్రిపై పలు ఆరోపణలు వచ్చాయి. వాటిపై గతంలోనే సీఎం చంద్ర బాబు వివరణ నివేదిక కోరారు. సదరు నివేదికపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రుసు ములు చెల్లించే భూములు లీజుకు తీసుకున్న విషయం స్పష్టమైంది. దీంతో సదరు మంత్రి పనితీరుపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఇక, నెల్లూరుకు చెందిన ఇద్దరు మంత్రుల్లో ఒక్కరిపైనే చంద్రబా బు హ్యాపీగా ఉన్నారన్నది కీలక చర్చనీయాంశం.
ఇక, అనంతపురం జిల్లా మంత్రుల విషయంలో చంద్రబాబుకు మంచి ఫీడ్ బ్యాకే వచ్చినట్టు తెలిసింది. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఒకప్పుడు వెనుకబడిన మంత్రి ఇప్పుడు దూకుడుగా ముందుకు సాగుతు న్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. మహిళా మంత్రుల్లో ముగ్గురి పనితీరు గత ఆరు మాసాలతో పోలిస్తే.. ఇప్పుడు బాగుందని నివేదికలు అందాయి. మొత్తంగా.. మంత్రుల్లో ఆశించిన మేరకు గతానికి ఇప్పటికి మార్పులు కనిపించాయన్నది సీఎం చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్య.
