Begin typing your search above and press return to search.

నెత్తి మీద నది బద్ధలు... కట్టలు తెంచుకుంటే !

ఈ క్లౌడ్ బరస్ట్ లకు ముందస్తుగా హెచ్చరికలు ఉండవు. ఈ రోజుకీ అతి భారీ వర్షాలుగానే వీటిని చెప్పాల్సి వస్తోంది.

By:  Satya P   |   27 Aug 2025 11:42 PM IST
నెత్తి మీద నది బద్ధలు... కట్టలు తెంచుకుంటే !
X

ఇలా అనుకోవడం ఊహకే భయంకరం. కానీ ఇదే జరుగుతోంది. చాలా కాలంగా జరుగుతోంది ఇటీవల కాలంలోనే ఇది ఎక్కువగా జరుగుతోంది. దీనిని ఇంగ్లీష్ లో క్లౌడ్ బరస్ట్ అని అంటారు. తెలుగులో మేఘాల విస్పోటనం అని పేర్కొంటారు. ఏమిటిది అంటే ఒక విధంగా జల ప్రళయమే. ఇంతకాలం భారీ వర్షాలతో పల్లపు ప్రాంతాలు నీరు అయ్యేవి. అవి అలా పారుతూ రావడానికి ఎంతో కొంత సమయం పట్టేది. ఈ లోగా తట్టా బుట్టా సర్దుకుని ఎగువకు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకునేందుకు వీలు ఉండేది. కానీ క్లౌడ్ బరస్ట్ అలా కాదు, నెత్తిన నది ఒక్కసారిగా నోరు తెరచుకుని భళ్ళున ఉన్నదంతా నేలకు విడిచేస్తూ అతి భయంకరంగా విరుచుకుపడుతుంది. దానికి ఆయా ప్రాంతం చిగురాకులా వణకడం తప్పించి మరేమీ చేయలేని నిస్సహాయ దుస్థితి ఏర్పడుతుంది.

ముందస్తు హెచ్చరికలు ఉండవా :

ఈ క్లౌడ్ బరస్ట్ లకు ముందస్తుగా హెచ్చరికలు ఉండవు. ఈ రోజుకీ అతి భారీ వర్షాలుగానే వీటిని చెప్పాల్సి వస్తోంది. అతి భారీ వర్షం అంటే ఎంత ఏమిటి అన్నది ఆ తరువాతనే తెలుస్తోంది. ఇక మామూలుగా భారీ వర్షాలు కురిసేటపుడు మేఘాలు ఉరుముల రూపంలో గర్జిస్తాయి. వాటిని బట్టి వర్ష స్వరూపం గమనించి జాగ్రత్త పడవచ్చు. కానీ మెఘాలే భారీ విస్పోటనం చెంది నది బద్ధలు అయినట్లుగా ఒకే ప్రాంతంలో ఒకే సమయంలో ధాటీగా అతి భారీ వర్షం కురుస్తుంది. దాంతో ఏ మాత్రం సమయం ఇవ్వకుండానే అంతా ముంచేస్తుంది.

ప్రకృతి వికృతిగా :

చాలా కాలంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటిని గమనిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నా పెద్దగా చేసేది ఏమీ ఉండటం లేదు. కర్బన్ ఉద్గారాలు ఎక్కువ అయిపోతున్నాయి. భూతలం విపరీతంగా వేడెక్కిపోతోంది. అలా గాలి వేడిగా మారుతోంది. సాధారణంగా గాలిలో తేమ పెరిగిన తరువాత అది ఆకాశ మార్గాన ఉన్న మేఘాలను తాకితే వానలు కురుస్తాయి. అయితే వడ కట్టినట్లుగా గాలి అధిక ఉష్ణోగ్రతలను మోసుకెళ్తూ మేఘాలను తాకినపుడు నదుల స్థాయిలో నీటిని మోసుకెళ్ళే మేఘాలు ఒక్కసారిగా పేలిపోతాయి. అంతే ఆకాశం చిల్లు పడినట్లుగా అవి ఎక్కడ పేలితే ఆ ప్రాంతమంతా అతి తక్కువ సమీపంలో అత్యంత భారీ వర్షాన్ని కురిపించేస్తున్నాయి. దాంతో ఆ ప్రాంతంలో ఏమీ మిగలనంతగా భారీ నష్టం వాటిల్లుతోంది.

క్లౌడ్ బరస్ట్ ని ఎలా కొలుస్తారు :

ఇక క్లౌడ్ బరస్ట్ ని ఎలా కొలుస్తారు అన్నది కూడా ఆసక్తికరమే ఒక ప్రాంతంలోని ముప్పయి ఘనపు కిలోమీటర్ల వైశాల్యంలో కేవలం గంట వ్యవధిలో ఏకధాటిగా అత్యంత భారీ వర్షం కురుస్తే కనుక దానిని క్లౌడ్ బరస్ట్ గా లెక్క వేస్తారు. అయితే ఈ క్లౌడ్ బరస్ట్ లను అంచనా వేయడం కష్టమని అంటున్నారు. మరి పరిష్కారం ఏమిటి అంటే అత్యధిక వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో దిగువ ప్రాంతాల వారు వీలైనత వరకూ ఖాళీ చేసి ఎగువకు వెళ్ళిపోవడమే మార్గమని అంటున్నారు.

కాశ్మీర్ టూ కన్యాకుమారి :

ఇటీవల కాలంలో క్లౌడ్ బరస్ట్ అన్నది ఎక్కువగా జరుగుతోంది అది కాశ్మీర్ టూ కన్యాకుమారి దాకా కూడా ఒకేలా ఉంటోంది. ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్ కారణంగా అతి భారీ వర్షాలు గంటల వ్యవధిలో కురిసి యాభై మంది దాకా మరణించారు అనేక మంది గల్లంతు అయ్యారు. కేవలం కాశ్మీర్ లో మాత్రమే కాదు హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ తదితర రాష్ట్రాలలో క్లౌడ్ బరస్ట్ లు ఏర్పడుతున్నాయి. కేవలం గంటల వ్యవధిలో ముప్పయి సెంటీమీటర్ల వర్షపాతం ఒకే ప్రాంతంలో నమోదు అవుతోంది. దీంతో ఊరూ వాడా ఆ భారీ వర్షాలకు కొట్టుకుపోతున్నాయి. తాజాగా కామారెడ్డి మెదక్ లలో అతి భారీ వర్హ్సాలతో క్లౌడ్ బరస్ట్ అయింది దాంతో జన జీవనం అతలాకుతలం అవుతోంది. ఇది గతంలో జరగలేదని ఇపుడు చూస్తూంటే ప్రకృతి విశ్వరూపం చూపిస్తొంది అని అంటున్నారు. ఇలాగే మేఘాలు పేలిపోయి నడి నెత్తిన నదులు పారితే మనుషులు బతికేది ఏముంటుంది అని అంటున్నారు.