కాక్రోచ్ జనతా పార్టీ దెబ్బకు ఎలాన్ మస్క్ భయపడ్డారా ?
కాక్రోచ్ అంటే బొద్దింక. నిజానికి బొద్దింకను చూస్తే అంతా భయపడతారు. అది చాలా చిన్న కీటకం. కానీ ఎందుకు భయం అంటే అంతే మరి.
By: Satya P | 22 May 2026 12:31 PM ISTకాక్రోచ్ అంటే బొద్దింక. నిజానికి బొద్దింకను చూస్తే అంతా భయపడతారు. అది చాలా చిన్న కీటకం. కానీ ఎందుకు భయం అంటే అంతే మరి. దాన్ని చూసి చికాకు పడేవారు, అలాగే గగుర్పాటుకు గురి అయ్యే వారు నూరు శాతం ఉంటారు. అందుకే కాక్రోచ్ అంటే దూరం జరుగుతారు. అలాంటి కాక్రోచ్ పేరుతో ఒక పార్టీ. కానీ దానికి మోజు మాత్రం విపరీతం అయింది. ఈ కాక్రోచ్ పార్టీని చూసి కొంతమందే భయపడుతున్నారు, కలవరపడుతున్నారు, కానీ అత్యధిక శాతం మాత్రం ఎట్రాక్ట్ అవుతుంది. అక్కడే ఉంది అసలైన తమాషా. అందుకేనేమో ప్రపంచంలో బీజేపీకి ఉన్న అత్యదిక నంబర్ ఫాలోవర్స్ కంటే కార్కోచ్ పార్టీ కి ఫాలోవర్స్ రెట్టింపు అయ్యారు. ఈ నంబర్ లెక్క ఎక్కడ పీక్స్ కి చేరుతుందో అన్న కంగారూ కలవరం సహజంగానే కొందరికి ఉండవచ్చు. కానీ ఆ అభద్రతాభావం ఎలాన్ మస్క్ కి కూడా ఉందా అన్నదే సందేహం మరి.
సోషల్ మీడియా నుంచి బ్లాక్ చేశారని :
ఎలాన్ మస్క్ వరల్డ్ వైడ్ గా పరిచయం అక్కర్లేని పేరు. టెక్నాలజీ రంగంలో మస్క్‌కు గొప్ప పేరుంది. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తలలో ఒకరు. టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి కంపెనీల ద్వారా విశేషమైన పేరు సంపద ఆయనకు లభిస్తున్నాయి. అలాంటి మస్క్ ఇపుడు చేసారంటున్న ఒక పని విషయంలోనే అంతా విస్తుబోతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆయన ఏమి చేశారు అని అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఖాతాని సోషల్ మీడియా నుంచి బ్లాక్ చేశారని ప్రచారం సాగుతోంది. కొత్తగా పుట్టుకుని వచ్చిన చీజేపీ అదే కాక్రోచ్ పార్టీ ఫాలోవర్స్ ని చూసి ఏకంగా ఎక్స్ ఖాతానే బ్లాక్ చేశారు అని అంటున్నారు. మరి ఈ విధంగా ఆయన చేయడం వెనక ఏదైనా ఒత్తిడి ఉందా లేక ఎక్స్ ఖాతానే భయపడిందా అనందే ఇపుడు హాటెస్ట్ టాపిక్ గా ఉంది. నిజానికి చూస్తే సీజేపీ అంటే భారత్ లో బీజేపీ అన్న సౌండ్ కి దగ్గరగా ఉంది కదా. మరి బీజేపీ దేశాన్ని పాలిస్తోంది. ఆ పార్టీ మీద పోటీ అన్నట్లుగా పుట్టుకొచ్చిన సీజేపీకి అత్యధికంగా ఫాలోవర్స్ ఉండడంతో పాటు ఆదరణ సోషల్ మీడియాలో పెరగడం వల్లనే ఈ విధంగా చేశారా అన్న చర్చ కూడా సాగుతోంది.
కూసాలు కదులుతున్నాయా :
సహజంగానే అధికార ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది. అది ఏ స్థాయిలో అన్నది ఎవరికీ తెలియదు కానీ కచ్చితంగా యాంటీ ఇంకెంబెన్సీ అయితే నో డౌట్ ఉండి తీరుతుంది. మరి దానిని వ్యక్తం చేసే బహిరంగ వేదికలు ఇతర ఫ్లాట్ ఫారాలను సక్రమంగా వినియోగించుకోనీయకపోతే ఇదిగో ఇలాంటి సీజేపీ వ్యవస్థలే పుట్టుకుని వస్తాయని అంటున్నారు. ఇది అధికారంలో ఉన్న వారికి కచ్చితంగా వ్యతిరేకించే బలమైన గొంతుక అని కూడా రాజకీయ పరిశీలకులు కానీ విశ్లేషకులు కానీ అభివర్ణిస్తున్నారు. సీజేపీ ఎలా వచ్చిందో కానీ ఈ ఆలోచన వచ్చింది అంతే సోషల్ మీడియాను తెగ షేక్ చేసి పారేస్తోంది. దాంతో అధికార పార్టీ కూసాలు కదులుతున్నాయని కూడా పెద్ద ఎత్తున రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు.
అసహనానికి మారు పేరు :
అసహనం తీవ్ర రూపం దాలిస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని అంటున్నారు. అసహనం అన్నది బయటకు రావాలి, దాని గొంతుకను వినిపించనీయాలి. దానిని సావధానంగా వినే వ్యవస్థలు ఉండాలి. కానీ అణగదొక్కాల్ని అనుకుంటే కనుక అది తీవ్రమైన రూపమే దాలుస్తోంది. అందుకే అది కొత్త రూపాలను సంతరించుకుంటోంది. అందుకే అందులో భాగమే సీజేపీ అన్నది ఏర్పాటు అయింది అని విశ్లేషిస్తున్నారు.
జస్ట్ అయిదు రోజులు :
సీజేపీ ప్రారంభం అయి కేవలం అయిదు రోజులు మాత్రమే అయినా 14 ఏళ్ళ బీజేపీ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 8 మిలియన్ల ఫాలోవర్స్ ని దాటేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇక 16 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న మోడీ నంబర్ ని కూడా దాటేయాలన్నది సీజేపీ టార్గెట్ గా ఉంది మే 16న సీజేపీ పుట్టింది. దాని కంటే ఒక్క రోజు ముందు మే 15న సుప్రీంకోర్టు చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా సీజేపీ ఆవిర్భావానికి కారణమా అని అంటున్నారు నిరుద్యోగ యువతను ఉద్దేశించి బొద్దింకలుగా వ్యాఖ్యానించిన నేపధ్యంలోనే కేవలం 24 గంటల వ్యవధిలో సీజేపీ పుట్టుకొచ్చింది. ఇది యూత్ వాయిస్ అని అంటున్నారు.
నీట్ రద్దుతో పీక్స్ కి :
ఇదిలా ఉంటే నీట్ దీని కంటే ముందు పరీక్షను ఈ దేశంలో 22 లక్షల మంది రాశారు. ఆ నీట్ పరీక్ష పేపర్ లీక్ అయింది అన్న కారణంతో ఒక్కసారిగా రద్దు చేశారు. దాంతో యువత ఆగ్రహం కట్టలు తెంచుకుంది అని అంటున్నారు. వరసబెట్టి జరుగుతున్న ఈ పరిణామాలే సీజేపీ వెనక బలమైన అసహన భావజాలంగా మారిపోయాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మార్పు మొదలైంది అని అంటున్నారు. 2011లో యూపీఏ ప్రభుత్వం మీద ఆనాడు యువత ఢిల్లీ వీధుల్లోకి వచ్చి చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం తరహాలోనే మరో ఉద్యమం అయితే దేశంలో మొదలైందా అన్నదే ఇపుడు బిగ్ డిబేట్ గా ఉంది. జెన్ జీ సునామీ క్రియేట్ చేస్తున్న సీజేపీ వల్ల యువత మొత్తం ఊగిపోతోంది. మరి ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుంది అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.
