భార్య కోరిక తీర్చడానికి అలాంటి పని చేసిన ఆఫీసర్.. 10 మంది మృతి..
భార్య కోరితే భర్త ఎలాంటి పనైనా చేయాలి అని కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే ఆ కోరికలు తీర్చగలిగేలా ఉంటే పర్వాలేదు కానీ ఇతరులకు నష్టాన్ని కలిగించేలా ఉంటే ఆ మూల్యం భర్త చెల్లించుకోక తప్పదు.
By: Madhu Reddy | 10 Jan 2026 4:00 PM ISTభార్య కోరితే భర్త ఎలాంటి పనైనా చేయాలి అని కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే ఆ కోరికలు తీర్చగలిగేలా ఉంటే పర్వాలేదు కానీ ఇతరులకు నష్టాన్ని కలిగించేలా ఉంటే ఆ మూల్యం భర్త చెల్లించుకోక తప్పదు. ఇకపోతే భార్య కోరిక తీర్చడానికి ఒక ఉన్నతాధికారి ఏకంగా పదిమంది మృతి చెందడానికి కారకుడయ్యి అందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా ఆమె వింత కోరికలు ఆయనను జీవిత ఖైదీ చేయడమే కాకుండా ఏకంగా జైలులోనే ఆయన ప్రాణాలు విడిచేలా చేశాయి. కర్మ ఎవరిని ఊరికే వదలదు.. చేసిన పాపానికి శిక్ష తప్పదు అంటూ ఈ విషయం తెలిసిన పలువురు నెటజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అమెరికాలో సీఐఏలో ఉన్నతాధికారిగా పనిచేసిన ఆల్ట్రిచ్ ఏమ్స్ అనే ఒక గూఢచారి.. దాదాపు పదేళ్లపాటు సోవియట్ యూనియన్ కి రహస్య సమాచారాన్ని అందించి.. భార్య ఖరీదైన అభిరుచులను తీర్చాడు. రహస్య గూఢచారిగా పనిచేసే ఈయన డబ్బు కోసం.. మరో రహస్య గూడాచారిగా మారి వందకి పైగా అమెరికా రహస్య కార్యకలాపాలను విఫలం చేశాడు. ముఖ్యంగా 10 మంది గూఢచారులు ఈయన వల్లే చనిపోయారు. విషయంలోకి వెళ్తే 1985లో సిఐఏ కోసం పనిచేస్తున్న సోవియట్ ఏజెంట్లు ఒక్కొక్కరిగా అదృశ్యం అవుతూ వచ్చారు. సోవియట్ యూనియన్ నిఘా సంస్థ కేజీబీ వారిని ఒక్కొక్కరిని బంధించి, విచారించి ఆపై చంపేసింది. అయితే ఈ హత్యలన్నీ కూడా ఆల్డ్రిచ్ అందించిన సమాచారం ఆధారంగానే వారందరినీ హతమార్చడం గమనార్హం.
సోవియట్ యూనియన్ కోసం బయటకు పనిచేస్తున్నట్టు నటిస్తూ.. మరొకవైపు పశ్చిమ దేశాలకు సమాచారం ఇస్తున్న ఏజెంట్ల వివరాలు ఏమ్స్ లీక్ చేశారు. దీంతో 1994 ఏప్రిల్ 8న ఈ డబుల్ ఏజెంట్ కి జీవిత ఖైదు శిక్ష విధించారు.ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అతడు పట్టుబడినందుకు బాధపడ్డారే తప్పా.. నిజాయితీని కోల్పోయి గూఢచర్యం చేసినందుకు ఆయనలో పశ్చాతాపం కనిపించకపోవడం అందరిని ఆగ్రహానికి గురిచేసింది.. ముఖ్యంగా ఇతడు తన భార్య ఖరీదైన అభిరుచులను నెరవేర్చడానికే ఇలా డబుల్ ఏజెంట్ మార్గాన్ని ఎంచుకున్నారట. జీవిత ఖైదు శిక్ష అనుభవించిన ఈయన 84 సంవత్సరాల వయసులో ఈ ఏడాది జనవరి 5న జైలు లోనే తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
