Begin typing your search above and press return to search.

సినిమా ఇండస్ట్రీ కొంతమందిదే కాదు... చిరంజీవి కీలక వ్యాఖ్యలు!

పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో సినీపెద్దలు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తో భేటీ అయ్యారు.

By:  Raja Ch   |   17 Nov 2025 5:07 PM IST
సినిమా ఇండస్ట్రీ కొంతమందిదే  కాదు... చిరంజీవి కీలక వ్యాఖ్యలు!
X

పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో సినీపెద్దలు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులను అభినందించారు. పైరసీపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్, తదనంతర పరిణామాలపై ఈ రోజు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సజ్జనార్ తో సినీ పెద్దలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సజ్జనార్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడుతూ పైరసీ భూతం వెనుక ఉన్న ఘోరాలను వివరించారు. ఈ సందర్భంగా చిరంజీవి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... చాలా సంవత్సరాల నుంచి పైరసీ బారిన నుంచి ఎలా తప్పించుకోవాలని తామంతా చాలా ఆందోళన చెందుతూ ఉండేవాళ్లమని అన్నారు. సినిమా ఇండస్ట్రీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారని.. ఇది కేవలం స్టార్ హీరోలది, నిర్మాతలది, పెద్ద దర్శకులది మాత్రమే కాదు.. దీనిపై లైట్ బాయ్ నుంచి థియేటర్ వద్ద గేట్ కీపర్ వరకూ ఆధారపడి ఉన్నారని తెలిపారు.

ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే.. పైగా ఎదురు సవాళ్లు విసురుతుంటే అది తట్టుకోలేని పరిస్థితి అని, ఇలాంటి వాటి నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్న సమయంలో గత కమీషనర్ ఆఫ్ హైదరాబాద్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలోనూ.. తాజా కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలోనూ ఈ సమస్యకు ఓ పరిష్కారం వచ్చిందని తెలిపారు!

ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తో పాటు ఆయన టీమ్ కు చిరంజీవి అభినందనలు తెలిపారు. ఈ విషయంలో సినిమా ఇండస్ట్రీ అంతా ఏకతాటిపై ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఐబొమ్మ నిర్వాహకుడిని పట్టుకోవడం అనేది గొప్ప అచ్చీవ్ మెంట్ అని చిరంజీవి అన్నారు. గతంలో తమిల్ బ్లాస్టర్స్ అనే వ్యక్తిని పట్టుకున్నారని గుర్తు చేశారు.