Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్: బాబు స‌మ‌క్షంలో మెగా బ్ర‌ద‌ర్స్‌ మాస్టర్ క్లాసులు!

చంద్రబాబు సమక్షంలో చిరంజీవి, పవన్ కల్యాణ్ తమ ప్రసంగాలతో స్ఫూర్తినిచ్చారు. మైండ్‌సెట్ మార్చుకుంటేనే విజయం సాధ్యమని చిరంజీవి వివరించగా, వైకల్యం శరీరానికే పరిమితమని, సంకల్పానికి కాదని పవన్ అన్నారు. వ్యక్తిగత విజయంతో పాటు సమాజానికి చేసే సేవ భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026లో విజేతలను అభినందించారు.

By:  Sivaji Kontham   |   17 Nov 2026 12:41 AM IST
ట్రెండీ టాక్: బాబు స‌మ‌క్షంలో మెగా బ్ర‌ద‌ర్స్‌ మాస్టర్ క్లాసులు!
X

జీవితంలో విజయం సాధించడం ఎలా అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ వరుసగా తమ ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు. నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో అన్నయ్య చిరంజీవి `మైండ్ సెట్ షిఫ్ట్` గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. మన ఆలోచనా విధానాన్ని (మైండ్ సెట్) సరిగ్గా మార్చుకుంటేనే జీవితంలో విజయం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఒక మాస్టర్ క్లాస్ లాంటి ప్రసంగంతో అందరిలో స్ఫూర్తి నింపారు.

అన్నయ్య బాటలోనే ఇప్పుడు తమ్ముడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా తనదైన శైలిలో జీవిత పాఠాలను బోధించారు. ఈరోజు `రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్` కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పురస్కారాలు అందుకున్న విజేతలందరినీ ప్రోత్సహిస్తూ చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరినీ కదిలించింది. వైకల్యం అనేది కేవలం వ్యక్తి శరీరానికి మాత్రమే పరిమితమని.. మన సంకల్పానికి కాదని ప‌వ‌న్ అన్నారు. జీవితంలో ఎన్ని కఠిన పరిస్థితులు ఎదురై మనల్ని పరీక్షించినా.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

మనకోసం మనం సాధించేది కేవలం ఒక వ్యక్తిగత విజయం మాత్రమేనని.. కానీ సమాజం కోసం మనం చేసే సేవ భావితరాలకు స్ఫూర్తిగా నిలవడంతో పాటు వారికి సరైన దారిని చూపిస్తుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఇలా ఒకవైపు అన్నయ్య చిరంజీవి ఆలోచనా దృక్పథం గురించి.. మరోవైపు తమ్ముడు పవన్ కల్యాణ్ సంకల్ప బలం, సామాజిక బాధ్యత గురించి చేసిన ఈ మాస్టర్ క్లాస్ ప్రసంగాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

విలువ‌ల‌తో కూడిన ప్ర‌యాణం గొప్ప‌ది:

విజయవాడ వేదికగా జరిగిన `రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం 2026` కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రామోజీ గురించి స్ఫూర్తివంత‌మైన ప్ర‌సంగం చేసారు. దివంగత రామోజీరావు పట్టుదల, విలువలతో కూడిన ప్రయాణం.. ఆయన సామాజిక‌ సేవలను ఈ వేదికపై ప్రత్యేకంగా స్మరించుకున్నారు. ప‌లు రంగాల్లో ఎదురైన ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కొని.. సమాజానికి స్ఫూర్తినిచ్చిన పురస్కార గ్రహీతలను ప‌వ‌న్ అభినందించారు. వారి విజయాలు మరికొందరికి మార్గదర్శకం కావాలని ఆకాంక్షించారు. సమాజంలో మార్పు తెస్తున్న ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సత్కరిస్తున్న రామోజీ గ్రూప్ యాజమాన్యానికి.. ఛైర్మన్ సి.హెచ్. కిరణ్ - శైలజా కిరణ్‌లకు పవన్ కల్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.