రాజకీయాలు నాకు పడవు: చిరంజీవి
రాజకీయాలకు తాను దూరంగా ఉన్నట్టు మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి కొణిదల చిరంజీవి చెప్పారు.
By: Garuda Media | 6 Aug 2025 1:25 PM ISTరాజకీయాలకు తాను దూరంగా ఉన్నట్టు మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి కొణిదల చిరంజీవి చెప్పారు. రాజకీయాల్లో తనకు మిత్రులు, శత్రువులు అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరన్న ఆయన.. అనుకుంటే అంద రూ మిత్రులేనని చెప్పారు. తనకు రాజకీయాలు అంతగా పడలేదన్నారు. తాజాగా హైదరాబాద్‌లో నిర్వ హించి ఓ రక్త దాన కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తాను చిరంజీవి బ్లడ్ డొనేషన్ క్యాంపులను ఎందుకు నిర్వహించిందీ చెప్పారు. ఇదే సమయంలో రాజకీయాల గురించి కూడా మాట్లాడారు.
ఓ పత్రిక లో వచ్చిన వార్త చదివి, దానికి ప్రభావితుడనైన తాను.. పేదలకు, ప్రాణాపాయంలో ఉన్నవారికి సాయం చేసేందుకు బ్లడ్ డొనేషన్ వ్యవస్థను స్థాపించానని చిరంజీవి చెప్పారు. దీనివల్ల అనేక మందికి ప్రాణాలు నిలుపగలుగుతున్నామన్నారు. ఇదే తనకు చాలా సంతృప్తినిచ్చే అంశమని పేర్కొన్నారు. రాజకీయంగా తనపై చేసే విమర్శలకు.. తాను పెద్దగా స్పందించనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొన్నాళ్ల కిందట జరిగిన ఓ ఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. తాను చేసిన మంచే తనను కాపాడిందన్నారు.
ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను, విమర్శలను కూడా తాను ఎప్పుడూ పట్టించు కోనని చె ప్పారు. పనిచేసుకుంటూ వెళ్తే.. అంతా బాగానే ఉంటుందని నమ్ముతానని చిరు చెప్పారు. ఏదైనా విమర్శ లు వచ్చినప్పుడు మౌనంగా ఉంటే.. తర్వాత అవే సర్దుకుంటాయని వ్యాఖ్యానించారు. తాను చేపట్టిన రక్తదాన కార్యక్రమాలు ఎంతో మందికి స్ఫర్తిగా నిలిచాయని.. తన అభిమానులు ఎక్కుడున్నా.. వారంతా కూడా రక్తం దానం చేస్తూ.. తన స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తున్నారని చిరంజీవి చెప్పారు. విమర్శలకు తాను కుంగిపోనన్నారు. పనితోనే వాటికి సమాధానం చెబుతానని వ్యాఖ్యానించారు.
