Begin typing your search above and press return to search.

ఆమంచి - క‌ర‌ణం.. పొలిటిక‌ల్ కుస్తీ.. !

గ‌త ఎన్నిక‌ల్లో తాను వ‌దులుకుని.. త‌న సీటును కుమారుడికి ఇచ్చారు క‌ర‌ణం. కానీ, ఫ‌లితం ద‌క్క‌లేదు.

By:  Garuda Media   |   11 Jun 2026 4:00 AM IST
ఆమంచి - క‌ర‌ణం.. పొలిటిక‌ల్ కుస్తీ.. !
X

నువ్వోస్తానంటే.. నేనొద్దంటానా? అని ఓపార్టీ, ఉన్న‌దిలే.. టైమున్న‌దిలే.. అని మ‌రో పార్టీ.. ఇలా.. ఇద్ద‌రు నాయ‌కులు పెట్టుకున్న ఆశ‌ల‌పై.. రెండు కీల‌క ప‌క్షాలు.. వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చీరాల రాజ‌కీయాల్లో ఆస‌క్తి గా మారుతున్నాయి. ఆ ఇద్ద‌రు నేత‌లూ కూడా ఫైర్ బ్రాండ్సే. ఇద్ద‌రూ మాజీ ఎమ్మెల్యేలే. వారే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌. క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి. ఇద్ద‌రూ కూడా ఇప్పుడు పొలిటిక‌ల్ సెంట‌ర్‌లో నిలిచిపోయారు. ఎటూ వారు క‌ద‌ల‌డం లేదు.

గ‌త ఎన్నిక‌ల్లో తాను వ‌దులుకుని.. త‌న సీటును కుమారుడికి ఇచ్చారు క‌ర‌ణం. కానీ, ఫ‌లితం ద‌క్క‌లేదు. పైగా.. 20 వేల‌కు పైగా ఓట్ల తేడాతో వైసీపీ నుంచి పోటీచేసిన క‌ర‌ణం వెంక‌టేష్ ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. వైసీపీకి దూర‌మ‌య్యారా? చేరువలో ఉన్నారా? అన్న‌ది పెద్ద క్వ‌శ్చ‌న్ మార్క్‌. ఇక‌, ఇప్పుడు టీడీపీలో చేరిపోయి.. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో టికెట్ ద‌క్కించుకుని తీరాల‌న్న‌ది క‌ర‌ణం వెంక‌టేష్ ప్ర‌య‌త్నం. కానీ, టీడీపీ నుంచి టైమున్న‌దిలే.. అంటూ స‌మాచారం వ‌స్తోంది.

ఇక‌, ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌.. అనుకున్న‌ది సాధించ‌లేక పోయిన విష‌యం తెలిసిందే. త‌నకు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంద‌ని ఆయ‌న భావించారు. ఇది నిజ‌మే 2014 ఎన్నిక‌ల్లో న‌వ‌భార‌త్ పార్టీ త‌ర‌ఫున పోటీచేసినా ఆయ‌న‌ను ప్ర‌జ‌లు గెలిపించారు. 2019లో వైసీపీ త‌ర‌ఫున మాత్రం ఓడించారు కానీ, స్థానికంగా ప‌ట్టుంద‌ని.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు రుజువు చేశాయి. కానీ.. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీచేసిన ఆయ‌న‌.. ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇక‌, ఇటీవ‌ల వ‌ర‌కు కాంగ్రెస్‌లోనే ఉన్నా.. ఇప్పుడు రూటు మారుస్తున్నారు.

ఈ క్ర‌మంలో నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా? అంటూ.. వైసీపీ కూని రాగాలు తీస్తున్న ప‌రిస్థితి. కానీ, ఆమంచి ఇంకా డిసైడ్ కాలేద‌ట‌. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు.. వేచి చూడాల‌న్న‌ది ఆయ‌న వ్యూహం. కాంగ్రె స్‌లో ఉంటే.. రెండు ర‌కాలుగా త‌న‌కు మంచిద‌ని ఆయ‌న అంచ‌నా వేసుకుంటున్నార‌ట‌. దీంతో ప్ర‌స్తుతం కాంగ్రెస్‌లోనే ఉండి. త‌ర్వాత‌.. ఎన్నిక‌ల నాటికి `నిర్ణ‌యం` ప్ర‌క‌టించ‌నున్నార‌న్న‌ది పొలిటిక‌ల్ టాక్‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా.. ఆమంచి-క‌ర‌ణం.. పొలిటిక‌ల్ కుస్తీ ప‌డుతున్నార‌ని చీరాల టాక్ జోరుగా న‌డుస్తుండ‌డం గ‌మ‌నార్హం.