Begin typing your search above and press return to search.

అక్కడ మరో పవన్ కళ్యాణ్... సేనాని సక్సెస్ ని గుర్తు చేస్తూ

బీహార్ రాజకీయాల్లో చిరాగ్ పాశ్వాన్ ని ఎదుగుతున్న రాజకీయ యువ తేజంగా అంతా భావిస్తున్నారు.

By:  Satya P   |   17 Nov 2025 9:35 AM IST
అక్కడ మరో పవన్ కళ్యాణ్... సేనాని సక్సెస్ ని గుర్తు చేస్తూ
X

బీహార్ ఎన్నికలు చాలా ఉత్కంఠగా ఆసక్తికరంగా సాగాయి అన్నది తెలిసిందే. బీహార్ ఎన్నికలకు ఉన్న పవర్ ఏంటో విపక్షాలే గట్టిగా చెప్పాయి అక్కడ కనుక ఎన్డీయే ఓటమి పాలు అయితే అది నేషనల్ వైడ్ ప్రకంపనలు సృష్టించేవి అని కూడా బీజేపీ ప్రత్యర్ధులు జోస్యాలు చెప్పారు. కానీ అలా ఏమీ జరగకపోగా చాలా రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఎన్డీయే వాటిని సాధించింది. ఇక ఎన్డీయే మిత్రులు అయితే దూసుకుని పోయారు.

యంగ్ స్టార్ గా :

బీహార్ రాజకీయాల్లో చిరాగ్ పాశ్వాన్ ని ఎదుగుతున్న రాజకీయ యువ తేజంగా అంతా భావిస్తున్నారు. ఆయన కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు. తండ్రి జీవితాశయం అయిన సీఎం పదవిని ఏనాటికి అయినా సాధించే లక్ష్యంతో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన ఆ లక్ష్యం సాధించకపోయినా ఆశలు అయితే పెంచేలా చేశారు అని అంటున్నారు. చిరాగ్ పాశ్వాన్ పార్టీ అయిన లోక్ జనశక్తి పార్టీకి ఇచ్చిన సీట్లు 27 అయితే అందులో ఆయన సాధించినవి 19 సీట్లు. అంటే దాదాపుగా డెబ్బై శాతం దాకా స్ట్రైక్ రేత్ సాధించారు. ఇది మంచి విజయమే అని అంటున్నారు. దీని కంటే ముందు 2024 లోక్ సభ ఎన్నికల్లో కూడా అయిదు ఎంపీ సీట్లను ఇస్తే అయిదుకు అయిదూ గెలిచి వంద శాతం స్ట్రైక్ రేటుతో ముందుకు దూసుకుని వచ్చారు.

పవన్ తో పోలిక :

ఈ పోలికను రాజకీయ విశ్లేషకులు తెస్తున్నారు. ఎందుకంటే పవన్ మాదిరిగానే ఆయన గత ఎన్నికల్లో బీహార్ అసెంబ్లీకి పోటీ చేసి దెబ్బ తిన్నారు కేవలం ఒకే ఒక్క సీటునే సాధించారు. అయితే ఆ తరువాత ఎన్డీయేలో చేరి అయిదు ఎంపీ సీట్లు ఇపుడు 19 ఎమ్మెల్యే సీట్లు సాధించి స్ట్రాంగ్ లీడర్ గా నిలబడ్డారు. తన రాజకీయ నాయకత్వాన్ని రుజువు చేసుకోవడమే కాకుండా ప్రధాని మోడీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా నిలిచారు. అందుకే ఆయనను బీహార్ పవన్ కళ్యాణ్ గా పిలుస్తున్నారు.

మోడీ మళ్ళీ ప్రధాని :

నరేంద్ర మోడీ 2029 ఎన్నికల తరువాత మరోసారి దేశానికి ప్రధాని కావాలని బలంగా కోరుకుంటున్నాట్లుగా చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. తమ పార్టీ సాధించిన విజయాల పట్ల ఆయన ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదే సమయంలో నితీష్ కుమార్ నాయకత్వానికి మద్దతు ఇస్తున్నారు. ఆయన కేంద్రంలో ఫుడ్ ప్రొసెసింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన పట్ల మోడీకి కూడా ఎంతో విశ్వాసం ఉంది. మొత్తం మీద బీహార్ లో ఈ యువ నేత తాను అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు.