Begin typing your search above and press return to search.

హైవేపై ఎమ్మెల్యే 'దురంధర్' స్టెప్పులే స్టెప్పులు.. వీడియో వైరల్!

ఇందులో భాగంగా చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ తరహా సందడి పలు వేదికలపై చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ ఎమ్మెల్యే మాత్రం హాయిగా హైవే పైనే సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది!

By:  Raja Ch   |   10 Jan 2026 12:42 AM IST
హైవేపై ఎమ్మెల్యే దురంధర్ స్టెప్పులే స్టెప్పులు.. వీడియో వైరల్!
X

నిత్యం రాజకీయలతోనూ, ప్రజాసేవలోనూ, చుట్టూ కార్యకర్తలు, సమస్యలు పరిష్కారాలతో బిజీగా గడిపే చాలా మంది రాజకీయ నాయకులు.. సరిగ్గా సమయం దొరికినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు తమలోని హిడెన్ టాలెంట్స్ ని బయటపెడుతుంటారు. ఇందులో భాగంగా చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ తరహా సందడి పలు వేదికలపై చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ ఎమ్మెల్యే మాత్రం హాయిగా హైవే పైనే సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది!

అవును.. ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్ లో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తనదైన స్టైల్ డ్యాన్స్ తో అలరించిన సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడూ చూడకో.. లేక, ఆయనలో ఈ లెవెల్ లో డ్యాన్స్ ట్యాలెంట్ ఉందనే విషయం తొలిసారి చూసో తెలియదు కానీ.. ఆయన డ్యాన్స్ కు ఫ్యాన్స్ పుట్టిన పరిస్థితి. ఈ క్రమంలో తాజగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ గ్రీన్ ఫీల్డ్ హైవేపై తనదైన శైలిలో స్టెప్పులేశారు.

ఇందులో భాగంగా... జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం సమీపంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ హైవేపై చింతలపూడి ఎమెల్యే రోషన్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి ‘దురంధర్’ మూవీలోని సాంగ్ కు స్టెప్పులు వేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవేలో ఓ చోట క్లోజ్ చేసి ఉన్న మార్గాన్ని ఓపెన్ చేసే క్రమంలో కాసేపు ఆటవిడుపు స్టెప్పులేశారు. ఈ సందర్భంగా ఆయనతో ఏమాత్రం ఉషారు తగ్గకుండా స్థానిక నాయకులు కాలు కదిపుతూ సందడి చేశారు.

ఈ సందర్భంగా స్పందించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్... బిజీ లైఫ్ లో కాసేపు రిలాక్స్ కావడానికి ఇలాంటివి కావాలని అన్నారు. ఇదే సమయంలో.. గ్రీన్ ఫీల్డ్ హైవే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే హైదరాబాదు - విశాఖకు దూరం తగ్గుతుందని ఎమ్మెల్యే తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. దీనికి సంబంధించిన కారణాన్ని వెళ్లడించారు.

ఇందులో భాగంగా... "ఈ రోజు ఉదయం జంగారెడ్డిగూడెంలో జరగబోతున్న శ్రీనివాస కళ్యాణానికి వెళ్లబోతూ గ్రీన్ ఫీల్డ్ హైవేలో క్లోజ్ చేసి ఉన్నా మార్గాన్ని ఓపెన్ చేసే క్రమంలో తంత్రుం కంట్రోల్ చేసుకోవడానికి సరదాగా టీం సభ్యులతో మరియు అక్కడికి వచ్చిన నాయకులతో రీల్ చేసి సందడి చేసిన శాసన సభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు" అని రాశారు!