అమరావతి వాస్తు మీద పెద్దాయన జోస్యం
అమరావతి రాజధాని అన్నది పదేళ్ళుగా ఏపీలో నలుగుతోంది. ఇది రాజకీయంగా కూడా చూస్తే హాట్ టాపిక్ గానే ఎపుడూ ఉంటోంది.
By: Satya P | 3 Aug 2025 8:45 AM ISTఅమరావతి రాజధాని అన్నది పదేళ్ళుగా ఏపీలో నలుగుతోంది. ఇది రాజకీయంగా కూడా చూస్తే హాట్ టాపిక్ గానే ఎపుడూ ఉంటోంది. అమరావతిని ప్రపంచ పటంలో నిలబెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చూస్తున్నారు. ఆయన 2014 నుంచి 2019 మధ్య కాస్తా నిదానంగా అమరావతి రాజధాని విషయంలో ఆలోచించేవారు. కానీ ఈసారి మాత్రం ఆయన జోరు పెంచేశారు. అధికారంలోకి వస్తూనే అమరావతిని పట్టాలెక్కించే పనిలో పడ్డారు ఈ టెర్మ్ పూర్తి అయ్యేలోగానే క రూపునకూ షేపునకూ తీసుకుని రావాలన్నదే ఆయన ఆశయంగా పెట్టుకున్నారు.
స్థల దోషమన్న సీనియర్ నేత :
బాబు గారి కలల రాజధాని అమరావతి మీద కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి అయిన చింతా మోహన్ తాజాగా సంచలన కామెంట్స్ చేశారు బాబు తాపత్రయమే కానీ అమరావతి ఎత్తిగిల్లేది ఏదీ లేదని ఆయన అంటున్నారు. అమరావతి రాజధాని క్లిక్ అయ్యే సూచనలే లేవు అని కూడా కుండబద్ధలు కొట్టారు. అమరావతికి పెట్టుబడులు వస్తాయని తాను అయితే అనుకోవడం లేదని అన్నారు అది ఆ ప్రాంతం స్థల దోషమే అని అంటున్నారు.
ప్రత్యేక విమానాల్లో ఎగిరినా : :
ఇక చంద్రబాబు మీద ఆయన సెటైర్లు చాలానే వేశారు. ప్రత్యేక విమానాల్లో వెళ్ళి ప్రత్యేక గదులలో బస చేస్తే చేయవచ్చు కాక చంద్రబాబు ఎంత ఎగిగినా ఏమి చేసినా కూడా అమరావతి విషయంలో తనకైతే ఎలాంటి ఆశలూ లేవని అన్నారు అంతే కాదు అమరావతి రాజధానికి ఆ విధంగా అభివృద్ధి అయ్యే సూచనలూ కనిపించడం లేదని ఆయన జోస్యం లాంటిదే వదిలారు
ఏపీకి పెట్టుబడులు కష్టమే :
ఇక కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ మరో మాట కూడా అన్నారు. ఏపీకి పెట్టుబడులు రావని అది అంత ఈజీ కాదని అన్నారు. అమరావతి రాజధానిగా చూపించినా ఫలితం ఉండదని ఆయన అన్నారు. మరో వైపు అమరావతి రాజధాని అని చంద్రబాబు చేస్తున్న జపం వల్ల కర్నూల్ నుంచి మొదలుపెడితే ప్రకాశం జిల్లా దాకా ప్రజలు ఎవరూ సంతోషంగా లేరని కూడా ఆయన అంటున్నారు. బాబు అమరావతి తపన నుంచి బయటపడాలన్నది ఆయన సూచనగా ఉంది.
రాయలసీమ రాజధానిగా :
రాయలసీమలో రాజధాని ఉండే చాన్స్ పోయిందని ఆయన అంటున్నారు. ఒకపుడు కర్నూల్ రాజధానిగా ఉంటే దాన్ని హైదరాబాద్ కి మార్చారు అని ఆ తరువాత బాబు తిరిగి అమరావతి రాజధాని అంటున్నారు అని ఆయన వాపోయారు. తిరుపతి రాజధానిగా చేయమని ఆనాడు డిమాండ్లు ఉండేవని అయితే అప్పట్లో అంటే ఉమ్మడి మద్రాస్ నుంచి విడిపోయిన క్రమంలో నాటి నేతల ప్రాంతీయ విభేదాల వల్ల అది సాధ్యపడలేదని అన్నారు. ఏది ఏమైనా తాను అమరావతికి వ్యతిరేకిని కాను అని ఆయన అంటూనే రాయలసీమ మీద మక్కువ చూపిస్తున్నారులా ఉంది అని వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. మరి బాబు కలల రాజధాని అమరావతి మీద చింతా మోహన్ చేసిన కామెంట్స్ మీద ఆయన ఏమంటారో.
