Begin typing your search above and press return to search.

కిక్ కోసం ఏకంగా మహిళ రక్తం తీసిన యువకుడు.. క్రైమ్ స్టోరీని తలపిస్తూ!

ఎవరైనా దొంగతనానికి ఎందుకు వస్తారు.. ఇంట్లో ఉన్న ఖరీదైన బంగారాన్ని లేదా.. వెండిని, డబ్బులను దొంగలించడానికి వస్తారు.

By:  Madhu Reddy   |   29 Aug 2025 5:00 AM IST
కిక్ కోసం ఏకంగా మహిళ రక్తం తీసిన యువకుడు.. క్రైమ్ స్టోరీని తలపిస్తూ!
X

ఎవరైనా దొంగతనానికి ఎందుకు వస్తారు.. ఇంట్లో ఉన్న ఖరీదైన బంగారాన్ని లేదా.. వెండిని, డబ్బులను దొంగలించడానికి వస్తారు. ఇక మరికొంత మందేమో ఖరీదైన వస్తువులను దొంగలిస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం వెరైటీగా దొంగతనానికి వచ్చి ఓ మహిళ రక్తాన్ని దొంగతనం చేశారు. వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ మీరు వినేది నిజమే. ఏదో టైం పాస్ కి వినే ఫేక్ వార్త అయితే కాదు. నిజంగానే జరిగింది. మరి దొంగతనానికి వచ్చిన వ్యక్తి విలువైన వస్తువులు, ఆభరణాలు వదిలేసి రక్తాన్ని ఎందుకు దొంగలించాడు. అసలు ఈ వెరైటీ దొంగతనం ఎక్కడ జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంట్లో దొంగతనం జరిగితే ఎవరైనా సరే ఇంట్లో ఖరీదైన వస్తువులు, ఆభరణాలు,డబ్బులు పోయాయి అని చెబుతారు. కానీ ఒక వ్యక్తి మాత్రం మీడియా ముందుకు వచ్చి నా భార్య రక్తాన్ని లాగేసారు అంటూ షాకింగ్ విషయం చెప్పారు. ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగింది అనేది చూస్తే.. సౌత్ చైనాలో యాంగ్జా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సౌత్ చైనాలో ఉండే ఓ వ్యక్తి న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి పని కోసం బయటికి వెళ్లారట. అయితే ఇంట్లో ఆయన భార్య ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉన్న మహిళని గమనించిన లీ అనే దొంగ వెంటనే ఆ ఇంట్లోకి దొంగచాటుగా వెళ్లి.. ఆ మహిళకు వెనుక నుండి మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారట. ఆ మహిళ మత్తులోకి జారుకొని స్పృహ కోల్పోవడంతో తన దగ్గర ఉన్న కొన్ని రక్తాన్ని తీసే హాస్పిటల్ పరికరాలను ఉపయోగించి ఆ మహిళ నుండి రక్తాన్ని తీయడం స్టార్ట్ చేశారట.

అయితే అలా రక్తం తీసిన సమయంలో పని మీద బయటకు వెళ్లిన ఆ మహిళ భర్త ఇంట్లోకి రావడం చూసిన లీ... వెంటనే ఆ మహిళను అక్కడే వదిలేసి పారిపోయాడట. అయితే ఏం జరుగుతోందో తెలియక అయోమయ స్థితిలో పడిపోయిన ఆ మహిళ భర్త బెడ్డు పక్కనే ఉన్న రక్తం సేకరించే పరికరాలు చూసి ఆశ్చర్యపోయి.. ఆ దొంగ తన భార్య ఒంట్లో నుండి రక్తం లాగేసాడు అని షాక్ అయిపోయాడు. ఇదే విషయాన్ని మీడియా ముందు కూడా చెప్పారు. అయితే లీను పోలీసులు పట్టుకొని విచారించగా.. ఆ విచారణలో లీ ఆశ్చర్యపోయే నిజాలు బయటపెట్టాడు. " నాకు ఇతరుల ఇంట్లోకి చొరబడి వాళ్ల రక్తాన్ని సేకరించడం అంటే చాలా థ్రిల్.. థ్రిల్ కోసమే ఇలా చేశాను.. నేను చాలా సార్లు ఇతరుల ఇళ్లలోకి చొరబడి ఎంజాయ్ చేశాను.. ఇలా చేస్తే నాలో ఉన్న ఒత్తిడి పోయి చాలా థ్రిల్ ఫీల్ అవుతాను"అంటూ పోలీసులు సైతం ఆశ్చర్యపోయే ఆన్సర్ ఇచ్చాడు లీ..

అయితే పోలీసులు దొంగతనం చేసిన లీ గురించి విచారణ చేయగా.. ఆయన మీద ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయని దొంగతనం,అత్యాచారం కేసుల్లో చాలాసార్లు పట్టుబడి జైలు జీవితం గడపాడనే విషయం బయటపడింది. తాజాగా జరిగిన విషయానికి సంబంధించి పోలీసులు విచారణ చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం ఈయనకు రెండేళ్ల జైలు శిక్షని ఖరారు చేసింది. అయితే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అక్కడ ప్రజలంతా షాక్ అయిపోతున్నారు.ఇక మరికొంతమందేమో వీడేం దొంగ రా బాబు.. దొంగలు ఎవరైనా ఇళ్లలోకి చొరబడి విలువైన వస్తువులు కాజేస్తారు.కానీ వీడు మాత్రం మనుషుల రక్తాన్నే లాగేస్తున్నాడు.. థ్రిల్ కోసం ఇలా కూడా చేస్తారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.