Begin typing your search above and press return to search.

నో ఎంట్రీ ఫీజ్... ఈ మ్యారేజ్ మార్కెట్స్ గురించి తెలుసా..!

అయితే ఈ మార్కెట్లలో పెళ్లి కాని యువతీ, యువకులు పెద్దగా కనిపించరు కానీ.. వారి తల్లితండ్రులే ఎక్కువగా వస్తారు.

By:  Raja Ch   |   9 Feb 2026 3:22 PM IST
నో ఎంట్రీ ఫీజ్... ఈ  మ్యారేజ్  మార్కెట్స్  గురించి తెలుసా..!
X

ఒకప్పుడు పెళ్లిల్లు చేయాలంటే మేనరికాలు, తెలిసినవారి పిల్లలను చేసుకునేవారు.. తర్వాత మధ్యవర్తుల ఎంట్రీతో పక్క గ్రామాలు, పక్క మండలాలకు విస్తరించింది.. ఆ తర్వాత పక్క జిల్లాల వరకూ కూడా పేరెంట్స్ సాహసించారు.. కాలక్రమంలో ప్రేమ వివాహాలు ఎంట్రి ఇచ్చాయి.. అనంతరం మ్యాట్రిమొనీ సైట్స్ ఎంట్రీ ఇవ్వడంతో వీటికి సరిహద్దులు చెరిగిపోయాయని చెప్పొచ్చు! ఇలాంటి రోజుల్లో ఇప్పటికీ సాగుతున్న మ్యారేజ్ మార్కెట్స్ అనే వింత సంప్రదాయం గురించి తెలుసుకోవాల్సిందే!

అవును... కులాలు, మతాలు, ఆర్థిక పరిస్థితుల ప్రాతిపదికన మ్యాట్రీమొనీ సైట్లు విస్తరించిన ఈ నేపథ్యంలో.. డిజిటల్ యుగం ప్రేమ వివాహాల సరిహద్దులు చెరిపేసిన ఈ తరుణంలో.. పెళ్లి కోసం పార్కుల్లో జరుగుతున్న ఓ వింత సంప్రదాయమే మ్యారేజ్ మార్కెట్లు. ఇవి చైనాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయని చెబుతారు! పెళ్లికాని యువత కోసం ఏర్పాటు చేసిన ఈ మార్కెట్లు కేవలం గ్రామాలకే పరిమితం కాలేదు.. ఆ దేశంలోని పలు నగరాల్లోనూ ఉన్నాయి!

అయితే ఈ మార్కెట్లలో పెళ్లి కాని యువతీ, యువకులు పెద్దగా కనిపించరు కానీ.. వారి తల్లితండ్రులే ఎక్కువగా వస్తారు. అందుకు కారణం యువత ఉద్యోగాలు, పనులతో బిజీగా ఉండటం మాత్రమే కాదు.. వారి వివాహ బాధ్యతలను పెద్దలకు అప్పగించే సంస్కృతినికి కూడా ప్రతిబింబిస్తుందని అంటారు! ఇక్కడ ప్రొఫైల్స్ నచ్చిన పిల్లల తల్లితండ్రులు నేరుగా మాట్లాడుకుంటారు. అన్నీ అనుకూలంగా జరిగితే వారు బంధువులు, వారి పిల్లలు దంపతులు అవుతారన్నమాట.

ఈ తరహా మార్కెట్లు కొన్ని ప్రాంతాల్లో వారానికి ఒక్కసారే జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల రోజూ జరుగుతాయని చెబుతున్నారు. వీటిలో పాల్గొనాలనే తల్లితండ్రులు.. వారి వారి పిల్లల వయసు, చదువు, ఉద్యోగం, జీతం, ఎత్తు, బరువు, ఆర్థిక పరిస్థితి మొదలైన వివరాలను పొందు పరిచిన పేపర్లు.. వారి ఫోటోలు పట్టుకుని తిరుగుతుంటారు. మరికొంతమంది అక్కడ ఉన్న స్టాల్స్ వద్ద ప్రొఫైల్స్ ను ఉంచుతారు.. మరికొంతమంది నేలపై పరుస్తారు! నచ్చిన పేరెంట్స్ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటారు!

అనంతరం పీలలిద్దరి అభిప్రాయాలను, ఇష్టాఇష్టాలను పరిగణలోకి తీసుకుని.. అన్నీ అనుకూలంగా జరిగితే.. వారి పరస్పర అంగీకరంతో వివాహం జరిపిస్తారు! అదన్నమాట చైనాలో మ్యారేజ్ మార్కెట్ల కథాకమీషు! మరి ఇలాంటి మార్కెట్లు భారత్ లోనూ ఉంటే మంచిదంటారా.. వద్దు మహాప్రభో అంటారా..?

ఇక ఈ వేదికలు, సమయాల విషయానికొస్తే... పీపుల్స్ పార్క్ వద్ద ‘షాంఘై వివాహ మార్కెట్’.. ప్రతి శని, ఆదివారాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ జరుగుతుండగా.. జోంగ్షాన్ పార్క్, టెంపుల్ ఆఫ్ హెవెన్ పార్క్ వద్ద ‘బీజింగ్ మార్కెట్లు’ ప్రతీ రోజూ ప్రధానంగా ఉదయం వేళల్లో ఉంటాయి. ఇక పీపుల్స్ పార్క్ వద్ద ‘చెంగ్డు వివాహ మార్కెట్’ ప్రతీ రోజూ, వాతావరణంపై ఆధారపడి ఉదయం నుంచి రాత్రి వరకూ ఉంటుంది!