ఆర్ఎస్ఎస్ తో చైనా కమ్యూనిస్టుల అరుదైన భేటీ
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ప్రతినిధుల వినతి మేరకే ఈ భేటీ జరిగింది అని ఆర్ఎస్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
By: Satya P | 14 Jan 2026 2:31 AM ISTఇది నిజంగా విచిత్రమే. కానీ అలాంటివి జరగడం కూడా సహజమే. కమ్యూనిస్టు పార్టీకి ఆర్ఎస్ఎస్ కి సిద్ధాంత భేదాలు ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలుసు. దేశంలో వామపక్షాలు ఆర్ఎస్ఎస్ ఆవిర్భావం ఒకేసారి 1925లో జరిగాయి. వందేళ్ళ ప్రస్థానంలో ఉత్తర దక్షిణ ముఖంగానే ఈ రెండూ సాగాయి. సిద్ధాంతాలే అన్నింటి కంటే ముఖ్యం అనుకునే తీరుతోనే ప్రయాణం సాగించాయి. అలాంటిది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ప్రతినిధుల బృందం భారత దేశం వచ్చి మరీ ఆర్ఎస్ఎస్ ని కలవడం అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.
భేటీలో మ్యాటర్ :
ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రేరణ బ్లాక్‌లోని ఆర్ఎస్ఎస్ సభ్యులతో చైనాకు చెందిన కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు సమావేశం అయి అనేక విషయాలను చర్చించినట్లుగా చెబుతున్నారు. అయితే ఇది పూర్తిగా మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని చైనా బృందం పేర్కొంది. మరో వైపు చూస్తే ఆర్ఎస్ఎస్ చీఫ్ అయిన మోహన్ భాగవత్ పర్యటనలో ఉన్నందున ఈ భేటీకి హాజరు కాలేదని ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు చెప్పుకొచ్చారు.
వారి విజ్ఞప్తి మేరకే :
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ప్రతినిధుల వినతి మేరకే ఈ భేటీ జరిగింది అని ఆర్ఎస్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ భేటీలో చైనా ప్రతినిధి బృందం ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలేను కలిసి అనేక అంశాల మీద చర్చించింది. ఇక ఈ భేటీ పూర్తిగా మర్యాదపూర్వకమైనదే అని ఆర్ఎస్ఎస్ కూడా చెప్పడం విశేషం. అయితే ఈ భేటీ ఏకంగా గంటసేపు సాగినట్లుగా ఆర్ఎస్ఎస్ వర్గాలు చెప్పడం గమనార్హం. అయితే ఈ భేటీకి ఒక అజెండా అంటొ లేదని ఆర్ఎస్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఆర్ఎస్ఎస్ ఏర్పడి వందేళ్ళు పూర్తి అయినందువల్ల గత ఏడాది ఆగస్టులో ఆర్ ఎస్ ఎస్ వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులను ఆహ్వానించింది. చిత్రమేంటి అంటే అందులో పాకిస్థాన్, టర్కీ చైనా దే-శాల ప్రతినిధులు లేరు. అంటే ఆర్ఎస్ఎస్ స్ కి చైనా ప్రతినిధులతో భేటీ కావడం ఇష్టం లేదా అన్నది మరో చర్చ. అయితే ఈ భేటీ మాత్రం జరిగిపోయింది. మరో విశేషం ఏమిటి అంటే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ప్రతినిధులు బీజేపీ నేతలను కూడా కలుసుకుని చర్చించారు. అయితే బీజేపీ అధికారంలో ఉన్నందున ఆ భేటీ వేరు, ప్రత్యేకించి ఆర్ఎస్ఎస్ తో భేటీ అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.
కాంగ్రెస్ అభ్యంతరం :
అయితే బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ చైనా ప్రతినిధులతో భేటీ కావడం మీద కాంగ్రెస్ తప్పు పట్టింది. అంతే కాదు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వైపు చూస్తే షక్సాగామ్ లోయ విషయంలో చైనా, భారత్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది అని గుర్తు చేసింది. ఈ నేపధ్యంలో జాతీయ పరమైన భద్రతాపరమైన అంశాలు ముందు ఉంచుకుని చైనా ప్రతినిధులతో ఈ తరహా చర్చలు ఏమిటి అని ప్రశ్నిస్తోంది. మొత్తానికి ఆర్ఎస్ఎస్ తో భారత దేశ కమ్యూనిస్టులే ఎపుడూ భేటీ కారు, కానీ చైనా కమ్యూనిస్టులు వచ్చి గంట పాటు చర్చించారు అంటే మ్యాటర్ ఆలోచించాల్సిందే అని అంటున్నారు.
