Begin typing your search above and press return to search.

స్పెషల్ స్టోరీ... బంగారు నక్క తోక తొక్కిన చైనా!

ఇందులో భాగంగా... చైనా తూర్పు లియానింగ్ ప్రావిన్స్ లో దేశ చరిత్రలోనే అతిపెద్ద బంగారు గని కనుగొనబడింది.

By:  Raja Ch   |   24 Nov 2025 6:00 PM IST
స్పెషల్ స్టోరీ... బంగారు నక్క తోక తొక్కిన చైనా!
X

అన్ని రంగాల్లోనూ తనదైన శైలిలో దూసుకుపోతూ, అమెరికాకున్న అగ్రరాజ్యం అనే టైటిల్ కు ఎప్పుదు చెక్ పెట్టేద్దామా అన్నట్లుగా ఎదురు చూస్తోన్న డ్రాగన్ కంట్రీ చైనాకు ప్రకృతి ఓ గుడ్ న్యూస్ చెప్పింది! ఇందులో భాగంగా... చైనా తూర్పు లియానింగ్ ప్రావిన్స్ లో దేశ చరిత్రలోనే అతిపెద్ద బంగారు గని కనుగొనబడింది. దీంతో.. చైనా బంగారు నక్క తోక తొక్కిందా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... 1949 తర్వాత చైనాలో తాజాగా ఓ అతిపెద్ద బంగారు నిక్షేపం కనుగొనబడింది. గత ఏడాది భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు కనుగొన్న గని కంటే ఇది చాలా పెద్దది. అది సుమారు 83 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దాచిపెట్టగా.. తాజా గనిలో సుమారు 1440 టన్నుల బంగారం నిల్వలున్నాయని.. దీని మొత్తం విలువ సుమారు 192 బిలియన్ డాలర్లు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అంటే... భారత కరెన్సీలో సుమారు 17,08,000 కోట్ల రూపాయలు అన్నమాట! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్స్, అత్యాధునిక టెక్నాలజీతో ఈ గనిని గుర్తించారు. దీనికి సంబంధించిన ప్రాజెక్టులో సుమారు వెయ్యి మంది ప్రహుత్వ ఉద్యోగులు సుమారు 15 నెలలపాటు అన్వేషించి, తవ్విన తర్వాత ఈ స్థాయిలో భారీ బంగారు గని బయటపడిందని చెబుతున్నారు.

గతంలో బంగారు గని అభివృద్ధి భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత.. చైనా నేషనల్ గోల్డ్ గ్రూప్, లియోనింగ్ మినరల్ జియాలజీ గ్రూప్, యింగ్ కౌ మునిసిపల్ ప్రభుత్వం.. తాజాగా ఓ భారీ పారిశ్రామిక సముదాయాన్ని నిర్మించడం ద్వారా స్థానిక బంగారు పరిశ్రమను ప్రోత్సహించడానికి సుమారు 2.82 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నాయి.

బహుశా ఎప్పటినుంచో వెతుకుతున్న ‘ఎల్ డోరాడో’ ఇదే కావొచ్చు!:

ఈ సందర్భంగా స్పందించిన సీపీసీ షెన్యంగ్ మున్సిపల్ పార్టీ స్కూల్ ప్రొఫెసర్ వాంగ్ యాన్.. చైనా డైలీతో మాట్లాడుతూ.. ఈ గనిలోని వెయ్యి టన్నులకు పైగా నిల్వలు జాతీయ బంగారు వ్యూహాత్మక నిల్వలను గణనీయంగా భద్రపరుస్తాయని అన్నారు. ఇది ప్రపంచ మార్కెట్ లో దాని పోటీతత్వాన్ని మరింత పెంచుతుందని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే.. బహుశా మనం ఎప్పటినుంచో వెఉతుకున్న ఎల్ డొరాడో ఇదే కావొచ్చు అనే కామెంట్లు ఇప్పుడు చైనా నుంచి వినిపిస్తున్నాయి. కాగా.. ఎల్ డొరాడో అనేది ఒక పౌరాణిక నగరం! ఇది బంగారంతో నిండి ఉందని నమ్ముతారు. దీనికి స్పెయిన్ లోని పురాణగాథల నుంచి మూలాలు ఉన్నాయి.