పాడు బుద్ధి చూపిన చైనాకు సరైన గడ్డి పెట్టిన భారత్
చైనా వాడి బుద్ధి అంతే. పైకి మిత్రుడిగా మాటలు చెప్పటం.. వెనుక పక్క తాను చేయాల్సిన పని చేయటం లాంటివి తెలిసిందే.
By: Garuda Media | 26 Nov 2025 3:44 PM ISTచైనా వాడి బుద్ధి అంతే. పైకి మిత్రుడిగా మాటలు చెప్పటం.. వెనుక పక్క తాను చేయాల్సిన పని చేయటం లాంటివి తెలిసిందే. తాజాగా అలాంటి తీరును ప్రదర్శించటం ద్వారా చైనా ఎప్పటికి భారత్ కు సరైన మిత్రుడు కాదన్న నిజాన్ని మరోసారి నిరూపించారని చెప్పాలి. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన మహిళ తన ప్రయాణంలో భాగంగా చైనాలోని షాంఘై ఎయిర్ పోర్టులో దిగి.. తాను వెళ్లాల్సిన విమానంలోకి చైనా అధికారులు అంగీకరించకపోవటమే కాదు.. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో అంతర్భాగంగా చెప్పటం.. ఆమెను చైనా పాస్ పోర్టు కోసం అప్లై చేసుకోవాల్సిందిగా హేళన చేయటం తెలిసిందే.
తనకు ఎదురైన అవమానం గురించి సోషల్ మీడియాలో ఆమె పోస్టు వైరల్ గా మారటమే కాదు.. చైనా గడ్డ మీద ఆమెకు ఎదురైన అవమానంపై భారత్ గట్టిగానే స్పందించింది. విమానాశ్రయంలో ఆమెను ఇబ్బంది పెడుతున్న చైనా అధికారులకు గట్టిగా చెప్పటమే కాదు.. చైనా తీరును నిరసిస్తూ భారత్ అధికారులు ఢిల్లీలోని ఆ దేశ అధికారుల ఎదుట నిరసన వ్యక్తం చేయటం తెలిసిందే.
ఈ ఉదంతంపై చైనా స్పందించింది. ఎప్పటిలానే తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నించింది. సదరు మహిళకు ఎలాంటి వేధింపులు.. నిర్బంధ చర్యలు ఎదురుకాలేదని చైనా విదేశాంగ ప్రతినిధి పేర్కొన్నారు. సదరు ప్రయాణికురాలికి ఎయిర్ లైన్ సంస్థ ఫుడ్ ఇచ్చినట్లుగా చెప్పింది. అయితే.. బాధితురాలి వాదన విన్నప్పుడు చైనా అధికారుల తొండి మాటలు ఇట్టే అర్థమవుతాయి. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన పెమా వాంగ్జోమ్ థాంగ్ డోక్ నవంబరు 21న లండన్ నుంచి జపాన్ కు వెళ్లే విమానం ఎక్కారు. ట్రాన్సిట్ హాల్ట్ కోసం సదరు విమానం చైనాలోని షాంఘైలో ఆగింది.
ఈ సందర్భంగా సదరు మహిళకు చెందిన పాస్ పోర్టును తనిఖీ చేసిన అధికారులు.. ఆమె పుట్టిన ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ అని ఉండటంతో ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను 18 గంటల పాటు నిర్బంధించారు. ఆ పాస పోర్టు చెల్లదని.. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమని.. తమ దేశం పాస్ పోర్టుకు అప్లై చేసుకోవాలని హేళన చేయటాన్ని థాంగ్ డోక్ సోసల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. షాంఘై ఎయిర్ పోర్టులోచిక్కుకుపోయిన వేళలో.. లండన్ లోని తన స్నేహితుల ద్వారా భారత ఎంబసీని సంప్రదించటం.. ఆ వెంటనే భారత అధికారుల జోక్యంతో ఆమె తన ప్రయాణాన్ని కంటిన్యూ చేశారు.
దీనిపై భారత అధికారులుతమ నిరసనను వ్యక్తం చేశారు. అరుణచల్ ప్రదేశ్ ఎప్పటికి భారత్ లోనే అంతర్భాగంగా స్పష్టం చేశారు. దీనికి చైనా స్పందిస్తూ..తొండి వాదనను వినిపించింది. ప్రయాణికురాలి హక్కులకు ఎలాంటి భంగం కలిగించలేదంటూ జాంగ్నాన్ (అరుణచల్ ప్రదేశ్ నుచైనాలో ఇలా పిలుస్తారు) ఎల్లప్పుడు తమ భూభాగమేనని నోరు పారేసుకున్నారు. దీనిపై భారత్ మరోసారి తీవ్రంగా స్పందించింది. చైనా చర్యలు అంతర్జాతీయ నిబంధనలు.. భారత సౌర్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లుగా పేర్కొంది.
చైనా విదేశాంగ మంత్రి చేసిన ప్రకటనను చూశామని.. ఆమె చెల్లుబాటు అయ్యే పాస్ పోర్టు కలిగి ఉందని.. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగం.. దాన్ని విడదీయలేరని స్పష్టం చేశారు. ‘‘ఈ విషయాన్ని చైనా తిరస్కరించినా ఇదే వాస్తవం. అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు సంబంధించిన అనేక ఒప్పందాలను ఉల్లంఘించటంపై చైనా అధికారులు ఇప్పటికీ తమ వివరణ ఇవ్వలేదు. అన్ని దేశాల పౌరులకు 24 గంటల వీసా రహిత రవాణా అనుమతించే సొంత నిబంధనను సైతం చైనా అధికారుల చర్యలు ఉల్లంఘించాయి’ అంటూ భారత విదేశాంగ అధికార ప్రతినిది రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఏమైనా.. డ్రాగన్ దేశం తన దొంగ బుద్ధిని మరోసారి ప్రదర్శించిందని చెప్పక తప్పదు.
