Begin typing your search above and press return to search.

రీసేల్ అయ్యే టూవీలర్లకే డిమాండ్.. తాజా రిపోర్టులో ఆసక్తికర అంశాలులేదా

బైకుల్ని కొనే ముందు వాటి ధరలకు ప్రాధాన్యత ఇచ్చే వారు ఎక్కువే. తమ ఆదాయ వనరులకు లోబడి ఉంటేనే ముందుకు వెళుతున్నట్లుగా అధ్యయనంలో తేలింది.

By:  Garuda Media   |   20 Nov 2025 12:00 PM IST
రీసేల్ అయ్యే టూవీలర్లకే డిమాండ్.. తాజా రిపోర్టులో ఆసక్తికర అంశాలులేదా
X

టూవీలర్లు కొనేటోళ్ల మొదటి ఆప్షన్ ఏంటి? బైక్ కొనుగోలు చేసే యూత్.. మధ్యవయస్కుల తొలి ప్రాధాన్యత ఏమిటి? వారి వ్యవహారశైలి ఏమిటి? లాంటి అంశాలకు సంబంధించి చెన్నైలో ఒక ఆసక్తికర అధ్యయనాన్ని నిర్వహించారు. కొనుగోలుదారుల ఆలోచనా విధానాల్ని.. వారి పోకడల్ని అంచనా వేసేందుకు వీలుగా కాంచీపురం జిల్లాకు చెందిన అధ్యాపక టీం అధ్యయనాన్ని చేపట్టారు.

ఆటోమొబైల్స్ రంగంలో తమిళనాడు ముందున్న వేళ.. చెన్నైలో పెద్ద ఎత్తున ఉన్న టూవీలర్ మార్కెట్ కుసంబంధించి వినియోగదారుల ఆలోచనలు ఎలా ఉన్నాయన్న దానికి వీలుగా తమిళనాడు రాష్ట్ర రాజధానిని అధ్యయనానికి వీలుగా ఎంపిక చేసుకున్నారు. వివిధ షోరూముల్లో బైకులు కొన్న 500 మందిని కలిసి వారి అభిప్రాయాల్ని సేకరించారు. పలు ప్రశ్నలు సంధించారు.

వారిచ్చిన జవాబుల్ని విశ్లేషించారు. ఆశ్చర్యకరంగా బైక్ మోడల్.. దాని లుక్.. మైలేజీ కంటే కూడా రీసేల్ ఎక్కువగా ఉన్న బైకుల్నే కొనేందుకు తాము మొగ్గు చూపుతామని 50.5 శాతం మంది చెప్పినట్లుగా గుర్తించారు. ఈ అభిప్రాయం చెప్పిన ఎక్కువ మంది 30 ఏళ్లు దాటిన పురుషులు. 40.3 శాతం మంది ఈ అభిప్రాయాన్ని మధ్యస్తంగా సమర్థించగా.. 9.2 శాతం మంది వ్యతిరేకంగా స్పందించారు. రీసేల్ అంశం కంటే తమకు నచ్చిన బైకుల్ని కొనేందుకు ఆసక్తి చూపే వారిలో అత్యధికులు 30 ఏళ్లలోపు వారే ఉండటం గమనార్హం.

బైకుల్ని కొనే ముందు వాటి ధరలకు ప్రాధాన్యత ఇచ్చే వారు ఎక్కువే. తమ ఆదాయ వనరులకు లోబడి ఉంటేనే ముందుకు వెళుతున్నట్లుగా అధ్యయనంలో తేలింది. టూవీలర్ ధరలు వాటి మార్కెట్ పై కచ్ఛితంగా ప్రభావాన్ని చూపుతాయని 62.1 శాతం మంది చెప్పారు. లీటరుకు 60కి.మీ. మైలేజీ ఇచ్చే బైకుల వైపు ఎక్కువమంది ఇష్టపడుతున్నట్లుగా వెల్లడైంది.

బైకులు కొన్న తర్వాత వాటి పని తీరుపై 61.2 సంతోషాన్ని వ్యక్తం చేయగా.. 36.8 శాతం మంది మాత్రం అంత సంతోషంగా లేరని తెలుస్తోంది. 2 శాతం మంది తాము సంతోషంగా లేమని వెల్లడించారు. బైకులు కొనే ముందు తమకు పరిచయం ఉన్న షాపులకే వినియోగదారులు వెళుతున్నట్లుగా గుర్తించారు. పేద.. మధ్యతరగతి.. ఉన్నత తరగతుల వారిని పరిగణలోకి తీసుకొని వేర్వేరు రకాల్లో.. వేర్వేరు ధరల్లో బైకుల్ని మార్కెట్లోకి విడుదల చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని అధ్యయనకర్తలు అభిప్రాయపడ్డారు.