Begin typing your search above and press return to search.

జోగయ్యను ఇంచార్జి సీఎం గా చేసిన ఎన్టీఆర్

ఈ పుస్తకంతో చేగొండి తాను చూసిన ముఖ్యమంత్రుల గురించి వివరించారు. అందులో అత్యంత నీతి మంతుడు నిజాయతీపరుడు అన్న ఎన్టీఆర్ ని పేర్కొనడం విశేషం.

By:  Satya P   |   7 Jan 2026 6:58 AM IST
జోగయ్యను  ఇంచార్జి   సీఎం గా చేసిన ఎన్టీఆర్
X

చేగొండి హరి రామ జోగయ్య అంటే రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి తెలియదు అన్నది లేదు. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. అనాటి నుంచి ఈనాటి వరకూ మొత్తం రాజకీయాన్ని చూసిన లివింగ్ లెజెండ్ గా చెప్పాలి. ఆయన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలలో ఒక వెలుగు వెలిగారు. ఎన్నో కీలక మంత్రిత్వ శాఖలు చేపట్టారు. అలాగే నరసాపురం నుంచి ఎంపీగా కూడా గెలిచి పార్లమెంట్ లో గళం వినిపించారు. సినీ నిర్మాతగా కూడా ఆయన ఎన్నో సినిమాలు నిర్మించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఫిల్మ్ అభివృద్ధి మండలి ఛైర్మన్ గా పనిచేశారు.





అన్న గారితో కలిసి :

చేగొండి హరి రామ జోగయ్య తెలుగుదేశం పార్టీలో 1983లో చేరి అన్న ఎన్టీఆర్ వెన్నంటి ఉన్నారు. ఆయన అభిమాన పాత్రుడిగా మెలిగారు. ఆయనకు ఎన్టీఆర్ సముచితమైన స్థానం కల్పించారు. హోంమంత్రి ఎన్టీఆర్ హయాంలో చేగొండి పనిచేయడం విశేషం. కేవలం 23 ఏళ్ళ ప్రాయంలోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి పంచాయతీ సమితి ప్రెసిడెంట్ గా అయిదేళ్ళ పాటు చేగొండి చేశారు. ఆ రోజులలో అది అతి పెద్ద నియోజకవర్గంతో సమానమైన హోదా. ఇలా చూస్తే చేగొండి రాజకీయ జీవితం ఇప్పటికి ఆరున్నర దశాబ్దాలు దాటింది. దీంతో ఆయన రాజకీయ చరిత్రను ఒక పుస్తక రూపంలో రాశారు. అందులో అనేక అంశాలు ప్రస్తావించారు. ఇవన్నీ ఆసక్తిని పెంచేవిగానే ఉన్నాయి. ఈ పుస్తకం చదివితే ఉమ్మడి ఏపీ రాష్ట్ర రాజకీయాలు కళ్ళకు కట్టినట్లుగానే కనిపిస్తాయి.

సీఎం గా చేశారు అంటూ :

ఈ పుస్తకంతో చేగొండి తాను చూసిన ముఖ్యమంత్రుల గురించి వివరించారు. అందులో అత్యంత నీతి మంతుడు నిజాయతీపరుడు అన్న ఎన్టీఆర్ ని పేర్కొనడం విశేషం. ఎన్ టీఆర్ ని ప్రాత స్మరణీయులు అని కూడా కొనియాడారు. తనకు టీడీపీలో ఎంతో సముచితమైన స్థానం కల్పించారని అన్న గారిని తలచుకున్నారు. ఇక మరో ఆసక్తిని కలిగించే సంఘటనను ఆయన చెప్పారు. ఒకసారి ఎన్టీఆర్ అమెరికా పర్యటన చేస్తూ నెల రూజుల పాటు రాష్ట్రానికి దూరంగా ఉన్నారు. ఆ సమయంలో చేగొండిని ఇంచార్జి సీఎంగా చేసి బాధ్యతలు అప్పగించారుట. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అప్పటి రాజకీయ వర్గాలకు తెలిస్తే తెలియవచ్చు. మరి ఎన్టీఆర్ ఆనాడే ఒక బలమైన సామాజిక వర్గం ఆకాంక్షలను ఆ విధంగా తీర్చే ప్రయత్నం చేశారు అన్న మాట. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తన పట్ల ఎన్టీఆర్ కి ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం అన్నారు చేగొండి.

అంకితం ఆయనకే :

ఇక చేగొండి అరవై వసంతాల రాజకీయ జీవితం మీద రాసిన పుస్తకాన్ని ఎన్టీఆర్ కి అంకితం చేశారు. ఇది తనకు ఆయన పట్ల ఉన్న గౌరవానికి అభిమానానికి నిదర్శనం అని చేగొండి చెప్పుకున్నారు. మరి ఈ పుస్తకం ఎపుడు రాసారో తెలియదు కానీ ఫేస్ బుక్ లో సోషల్ మీడియాలో చేగొండి అన్న గారి మీద చాటుకున్న అభిమానం ఈ పుస్తకం మొదటి పేజీలో ఎన్టీఆర్ గురించి రాసిన అద్భుత వాక్యాలు అయితే తెగ వైరల్ అవుతున్నాయి.