చాట్ జీపీటీలో ఈ ఫీచర్లు మీకు తెలుసా?
ప్రాంప్ట్ ల కోసం టైపింగ్ మీద ఆధారపడుతూ వాయిస్ మోడ్ ను మిస్ అవుతుంటే.. ఒక మంచి ఫీచర్ ను మిస్ అవుతున్నట్లే.
By: Garuda Media | 1 Oct 2025 3:00 PM ISTచాట్ జీపీటీని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఇప్పటికే బోలెడంత మంది ఈ అత్యాధునిక సాంకేతికతను వాడేస్తూ.. పెద్ద ఎత్తున సమయాన్ని మాత్రమే కాదు.. అవసరమైన సమాచారాన్ని మరింత వేగంగా.. సులువుగా తెలుసుకునేలా చేస్తోంది. రోజువారీ జీవితంలోనూ.. ఉద్యోగానికి సంబంధించిన పనుల్ని అత్యంత తేలిగ్గా నిర్వర్తించేలా చాట్ జీపీటీ సాయం చేస్తోంది. అయితే.. ఇందులో ఎన్నో ఫీచర్లు ఉన్నప్పటికి కొన్ని ఫీచర్ల మీద వినియోగదారులు ఫోకస్ చేయని పరిస్థితి. ఈ ఫీచర్లను వినియోగించుకోవటం ద్వారా మరెన్నో సౌకర్యాల్ని సొంతం చేసుకునే వీలుంది. మరింత సులువుగా రోజువారీ పనులు చేసుకునే వీలుంది.
పెద్దగా పట్టించుకోని ఫీచర్లను చూస్తే..
- మెమరీ మోడ్
- నోటి మాటతో సమాధానాలు
- కస్టమ్ ఇన్ స్ట్రక్షన్స్
- రికార్డు మోడ్
- కాన్వాస్
- చాట్ హిస్టరీ
మెమరీ మోడ్ ను ఎనేబుల్ చేసుకుంటే అంతకుముందు సెషన్లను గుర్తు పెట్టుకోవటంతో పాటు.. మనం రాసే శైలి, ఇష్టమైన అంశాలు.. చివరకు రియాక్టుఅయ్యే తీరును రీకాల్ చేసుకొని.. మన ఇష్టాలను తెలుసుకుంటుంది. దీంతో.. గతంలో మనం ప్రస్తావించిన అంశాలకు సంబంధించి వివరాల్ని గుర్తు పెట్టుకొని.. మన అభిరుచులకు తగ్గట్లు సూచనలు.. సమాధానాలు ఇవ్వటం ఈఫీచర్ ప్రత్యేకత. ఒకవేళ వ్యక్తిగత అంశాల్ని చర్చించిన పక్షంలో ఈ మోడ్ ను డిసైబుల్ చేయటం ద్వారా.. వాటి వివరాల్ని స్టోర్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
ప్రాంప్ట్ ల కోసం టైపింగ్ మీద ఆధారపడుతూ వాయిస్ మోడ్ ను మిస్ అవుతుంటే.. ఒక మంచి ఫీచర్ ను మిస్ అవుతున్నట్లే. ఎందుకంటే చాట్ జీపీటీతో మాట్లాడుతూ ప్రశ్నల్ని అడగొచ్చు. సమాధానాల్ని తెలుసుకోవచ్చు. అంతేకాదు.. ఇష్టమైన వాయిస్ ను ఎంచుకునే వీలుంది. దీంతో.. చేతులతో సంబంధం లేకుండా, ఎక్కడ ఉన్నా మన మాటతో అవసరమైన అన్ని పనుల్ని పూర్తి చేసుకునే వీలుంటుంది.అంటే.. ఫోన్ తాకకుండానే మన పనుల్ని వాయిస్ కమాండ్ తో పూర్తి చేసుకోవచ్చన్న మాట.
చాట్ జీపీటీ 5లో కస్టమ్ ఇన్ స్ట్రక్షన్స్ ఫీచర్ సాయం తీసుకోవటం ద్వారా మరింత మెరుగైన విధంగా పనుల్ని పూర్తి చేసుకునే వీలుంది. ఇందుకోసం చాట్ జీపీటీ సెటింగ్స్ ప్యానెల్ లోకి వెళ్లి.. కస్టమ్ ఇన్ స్ట్రక్షన్స్ ఆప్షన్ ఎంపిక చేసుకొని.. మీ గురించి చాట్ జీపీటీ ఏం తెలుసుకోవాలో.. అదెలా స్పందించాలన్న వివరాల్ని రెండు బాక్సుల్లో పొందుపరిస్తే.. కొత్త చాట్స్ వాటంతటవే ప్రిఫరెన్సులకు అనుగుణంగా మారుతుంటాయి.
మీటింగులు.. మేధోమథనాలు.. వాయిస్ నోట్స్ రికార్డు చేసి.. వాటిని టెక్ట్స్ రూపంలో సేవ్ చేసుకునే మరో ప్రత్యేక ఫీచర్ ఉంది. చాట్ జీపీటీ ప్రొ.. ఎంటర్ ప్రైజెస.. ఎడ్యుకేషన్ యూజర్లకు ఇది అందుబాటులో ఉంటుంది. ఇది కంటెంట్ ను సారాంశంగా మారుస్తుంది. తరచూ మీటింగుల్లో పాల్గొనే వారికి ఇదో వరంగా చెప్పాలి. అదే పనిగా నోట్స్ తీసుకునే శ్రమ తగ్గుతుంది. కీలకమైన వివరాలు మిస్ అవుతామన్న టెన్షన్ ఉండదు.
మన మదిలో మెదిలో ఆలోచనలు.. ఐడియాలకు డయాగ్రామ్స్. పట్టికలుగా మార్చుకునే కాన్వాస్ ఫీచర్ ఉంది. టెక్ట్స్ ఆధారిత అంశాల్ని గ్రాఫిక్స్ గా మార్చటం వల్ల పనులు మరింత సులువుగా ఉంటాయి.
చాట్ జీపీటీలో మన హిస్టరీ.. డేటా కంట్రోల్స్ సెటింగ్స్ ఎక్కడో చివరన ఉంటుంది. అందుకే చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు దీన్ని వాడుకుంటే ఎంతో సాయం చేస్తుంది. హిస్టరీని ఎక్స్ పోర్టు చేసుకుంటే బ్యాకప్ గా ఉపయోగపడుతుంది. వ్యక్తిగత రికార్డుగా ఉంచుకోవటమే కాదు.. అవసరం లేదనుకుంటే డిలీట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. సో.. ఈ కొత్త ఫీచర్లను వాడటం మొదలు పెట్టండి. ఇంకెందుకు ఆలస్యం.
