Begin typing your search above and press return to search.

అమెరికా రాజకీయరంగాన్ని కుదిపేసిన చార్లీ కిర్క్ హత్య

చార్లీ కిర్క్ హత్య అమెరికా రాజకీయరంగాన్ని కుదిపేసిన సంఘటనగా నిలిచింది.

By:  A.N.Kumar   |   11 Sept 2025 10:07 AM IST
అమెరికా రాజకీయరంగాన్ని కుదిపేసిన చార్లీ కిర్క్ హత్య
X

చార్లీ కిర్క్ హత్య అమెరికా రాజకీయరంగాన్ని కుదిపేసిన సంఘటనగా నిలిచింది. యుటా వ్యాలీ యూనివర్సిటీ వేదిక వద్ద జరిగిన ఈ కాల్పుల దాడిలో ప్రసంగం చేస్తూ నిలిచిన క్షణంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు.

యుటా వ్యాలీ యూనివర్సిటీలో దురదృష్టకర ఘటన

సెప్టెంబర్ 10, 2025 మధ్యాహ్నం 12:20 గంటల సమయంలో “American Comeback Tour”లో భాగంగా చేసిన “Prove Me Wrong” డిబేట్ కార్యక్రమంలో చార్లీ కిర్క్ యూటా విద్యార్థులతో చర్చిస్తున్నప్పుడు కాల్పులు జరిగాయి. ప్రత్యక్ష దృశ్యాలలో ఆయన మెడలో తుపాకీ తగిలి కుప్పకూలారు. ఈ కాల్పులు అక్కడున్న ప్రజల్లో ఆందోళన కలిగించింది.. వెంటనే భద్రతా సిబ్బంది ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స సమయంలో ఆయన ప్రాణాలు నిలవలేదు.

* విచారణ , భద్రతా చర్యలు

యుటా గవర్నర్ స్పెన్సర్ కోక్స్ ఈ దాడిని “రాజకీయ హత్య”గా పేర్కొంటూ తీవ్రంగా ఖండించారు. FBI , స్థానిక పోలీసులు సంయుక్త దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాథమికంగా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నప్పటికీ, నిర్ధారిత ఆధారాలు లేక విడుదల చేశారు. అనుమానితుల కోసం మాన్హంట్ కొనసాగుతోంది. కాల్పులు సుమారు 200 యార్డుల దూరంలో ఉన్న భవనం నుండి జరగినట్లు భావిస్తున్నారు.

రాజకీయ ప్రతిస్పందనలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఈ చార్లీ సన్నిహితుడు. “చార్లీ కిర్క్ యువతలో ఒక గొప్ప నాయకుడు, ఆయన మరణం అమెరికాకు తీరని నష్టం” అని ట్రంప్ పేర్కొన్నారు. గవర్నర్ కోక్స్ దేశ ప్రజాస్వామ్య జీవితంలో ఇది ఒక చీకటి క్షణమని వ్యాఖ్యానించగా, హింసకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదని ఫెడరల్ నేతలు పునరుద్ఘాటించారు.

దేశవ్యాప్త ప్రభావం

ఈ ఘటనతో అమెరికా వ్యాప్తంగా రాజకీయ హింసపై చర్చ మళ్లీ ఊపందుకుంది. ప్రతిపక్ష భావజాలాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత, క్యాంపస్ వేదికల భద్రత, ప్రజా రాజకీయ సమావేశాల రక్షణ గురించి ఆందోళనలు పెరిగాయి. వీడియోలు, సోషల్ మీడియా షేర్లు ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా మిన్నంటేలా చేశాయి.

చార్లీ కిర్క్ హత్యతో, క్యాంపస్‌లలో రాజకీయ చర్చలు భద్రతతో కూడి ఉండాలని మళ్లీ గుర్తుచేసే అవసరం తలెత్తింది. ఆయన మరణం అమెరికా రాజకీయరంగంలో గాఢమైన గాయం మిగిల్చింది.