Begin typing your search above and press return to search.

వైసీపీ- కుక్క‌ తోక ఒక్క‌టే: చంద్ర‌బాబు చ‌లోక్తులు

వైసీపీ పై చంద్ర‌బాబు తాజాగా చ‌లోక్తులు రువ్వారు. వైసీపీ-కుక్క‌తోక రెండూ ఒక‌టే అని వ్యాఖ్యానించారు.

By:  Garuda Media   |   1 Sept 2026 10:48 PM IST
వైసీపీ- కుక్క‌ తోక ఒక్క‌టే:  చంద్ర‌బాబు చ‌లోక్తులు
X

వైసీపీ పై చంద్ర‌బాబు తాజా గా చ‌లోక్తులు రువ్వారు. వైసీపీ-కుక్క‌ తోక రెండూ ఒక‌టే అని వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌లు భారీ ఎత్తున క‌ర్ర‌ కాల్చి వాత పెట్టిన వైసీపీలో మార్పు రాలేద‌ని.. కుక్క‌ తోక‌ను నిటారుగా నిల‌బెట్టేందుకు ఎంత ప్ర‌య‌త్నించినా అది స‌రికాద‌న్నారు. వైసీపీ నాయ‌కులు ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధిని అడుగ‌డుగునా అడ్డుకుం టున్నార‌ని విమ‌ర్శించారు. దీంతో ప‌లు ప్రాంతాల్లో కూట‌మి ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ధి కార్యక్ర‌మాలు కుంటు ప‌డుతున్నాయ‌ని పేర్కొన్నారు.

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా మొగల్తూరులో `పేదల సేవలో` ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి 31 ఏళ్లు పూర్తి చేసుకు న్న సందర్భంగా ప్రజావేదిక సభలో కరతాళ ధ్వనులతో చంద్రబాబు నాయుడుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...ప్రజల సంక్షేమం కోసం అనేక‌ సంస్కరణలు తీసుకొచ్చినట్లు తెలిపారు. డ్వాక్రా, మెప్మా వంటివి రాష్ట్రంలో ఎదురులేని శక్తిగా నిలిచాయన్నారు. రాష్ట్రంలో డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించామన్నారు.

అయితే.. దీనిని కూడా వైసీపీ రాజ‌కీయం కోసం వాడుకుంద‌న్నారు. వేలాది పిటిష‌న్లు వేసి కోర్టుల్లో అడ్డుకునే ప్ర‌య త్నం చేసింద‌న్నారు. ఇప్పుడు కూడా డీఎస్సీపై ఆరోప‌ణ‌లు చేస్తోంద‌న్నారు. దమ్ముంటే నిరూపించాల‌ని కోరినా.. ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేద‌ని.. వ్యాఖ్యానించారు. కాగా.. తాను పేద‌ల సేవ‌లో కార్య‌క్ర‌మానికి వ‌చ్చింది.. కేవలం పింఛ‌న్లు పంపిణీ చేసేందుకుమాత్ర‌మే కాద‌ని.. స‌మూల మార్పులు తీసుకువ‌చ్చేందున‌ని తెలిపారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే చేరవేస్తున్నామని స్పష్టం చేశారు.

దేశంలోనే ఎక్కడా లేని విధంగా 4 వేలు, 6 వేలు, 10 వేల రూపాయ‌ల చొప్పున పింఛ‌న్లు పంపిణీ చేస్తున్నామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఇప్పటివరకు 75,503 కోట్ల రూపాయ‌ల‌ను పింఛ‌న్ల రూపంలో పంపిణీ చేశామ‌ని.. నిజానికి ఈ నిధుల‌తో 3 పోలవరం ప్రాజెక్టులను నిర్మించవచ్చని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. మ‌హిళ‌ల కోసం.. అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌న్నారు. ''మా అమ్మ‌ పడిన కష్టాన్ని చూసి, రాష్ట్రంలో ఏ తల్లికీ ఆ కష్టం రాకూడదనే ఉద్దేశంతో 'దీపం పథకం' ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం'' అని పేర్కొన్నారు.

తన కు మొగల్తూరు కొత్తేమీ కాదన్నారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం జరిగిందన్నారు. ఆ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకే ప్రజలు కూటమిని 94 శాతం సీట్లతో, 54 శాతం ఓట్లతో భారీ మెజారిటీతో గెలిపించారని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల రుణం తీర్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్నారు. అయితే.. ఈ రుణం తీరేది కాద‌ని వ్యాఖ్యానించారు.