Begin typing your search above and press return to search.

బాబూ...చలో దావోస్

ఏపీకి పెట్టుబడులు పెద్ద ఎత్తున తేవలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారు.

By:  Satya P   |   9 Dec 2025 9:15 AM IST
బాబూ...చలో దావోస్
X

ఏపీకి పెట్టుబడులు పెద్ద ఎత్తున తేవలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారు. ఆయన నాలుగవ సారి సీఎం గా అధికారం చేపట్టిన తరువాత తొలి రోజు నుంచే పెట్టుబడుల మీదనే ఫోకస్ పెంచారు. ఆ రోజు నుంచి గత పద్దెనిమిది నెలలుగా చంద్రబాబు ఇదే విషయం మీద తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన అనేక దేశాలు తిరిగి మరీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ సన్ రైజ్ స్టేట్ అని చెబుతున్నారు. పారిశ్రామిక విధానాలు అన్నీ కూడా పెట్టుబడిదారులకు అనుకూలమని వెల్లడిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా కొత్త పాలసీని మార్చి వేగవంతమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటోంది అని చెబుతున్నారు. సింగిల్ విండో విధానంతో ఎలాంటి జాప్యం లేకుండా చూడడమే కాకుండా భారీ ప్రోత్సాహకాలను కూడా అందిస్తూ ఏపీ వైపు పెట్టుబడులను ఎట్రాక్ట్ చేస్తున్నారు.

పార్టనర్ షిప్ సమ్మిట్ :

ఇక చూస్తే నవంబర్ నెల 14, 15 తేదీల్లో విశాఖలో పార్టనర్ షిప్ సమ్మిట్ ని చంద్రబాబు ఘనంగా నిర్వహించారు. ఈ సమ్మిట్ ద్వారా పదమూడు లక్షల కోట్ల రూపాయల దాకా పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయని కూడా ప్రకటించారు. ఈ సమ్మిట్ కోసం అంతకు మూడు నాలుగు నెలల నుంచి దేశ విదేశాలు పర్యటించిన చంద్రబాబు ఇక ఒక నెల ఆగి మళ్ళీ విదేశీ టూర్ కి భారీ ప్లాన్ చేస్తున్నారు. మరోసారి ఆయన చలో దావోస్ అని అంటున్నారు.

షెడ్యూల్ ఇదే :

ఇక ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ టూర్ కి షెడ్యూల్ అయితే రెడీ అయిపోయింది. ఆయన కొత్త ఏడాది వస్తూనే దావోస్ వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. జనవరి నెల 19 నుంచి బాబు ఏకంగా 23 వరకూ నాలుగు రోజుల పాటు దావోస్ లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా అక్కడ జరిగే ఎకనామిక్ ఫోరం సమ్మిట్ కి ఆయన హాజరవుతారు అని అంటున్నారు. ఈ సమ్మిట్ కి విదేశాల నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు హాజరవుతారు. దాంతో బాబు దావోస్ ని గట్టిగానే టార్గెట్ చేశారని అంటున్నారు.

ఈసారి గురి తప్పదు :

ఇక బాబు 2025లోనూ దావోస్ టూర్ పెట్టుకున్నారు. ఆయనతో పాటు మంత్రి నారా లోకేష్ ఇతర మంత్రులు వెళ్ళారు. ఆనాడు పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో ఏపీ అందరినీ ఆకట్టుకుంది. దావోస్ లో పెట్టుబడులని తీసుకుని వచ్చే ప్రయత్నంలో కొంత మేర సక్సెస్ అయ్యారు. కానీ ఏడాది తిరిగే సరికి ఏపీలో పారిశ్రామిక పాలసీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. దాంతో ఈసారి భారీగానే పెట్టుబడులు వస్తాయన్న ధీమా అయితే బాబు అండ్ కోలో ఉంది. ఈసారి కూడా బాబుతో పాటు మంత్రి నారా లోకేష్ అలాగే పరిశ్రమల మంత్రి టీజీ భరత్ వంటి వారు ఇక ఉన్నతాధికారులు దావోస్ టూర్ లో భాగం కానున్నారు ఈ అయిదు రోజుల పర్యటనలో బాబు ఏపీలో పెట్టుబడులకు సంబంధించి భారీ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు జరుపుతారు అని అంటున్నారు అలాగే కీలక ఒప్పందాలు ఈసారి కుదిరే చాన్స్ ఉందని అంటున్నారు. మొత్తానికి బాబు దావోస్ టూర్ కి రంగం సిద్ధం అయిపోయినట్లే.