ఫోటోలతో జాగ్రత్త...బాబు హెచ్చరికల వెనక !
ఏపీలో మంత్రులు సీనియర్ నేతలు కీలక నాయకులు అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా మంది ఉంటారు.
By: Satya P | 6 Aug 2025 10:00 PM ISTఏపీలో మంత్రులు సీనియర్ నేతలు కీలక నాయకులు అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా మంది ఉంటారు. వీరంతా సెలిబ్రిటీలుగా కొనసాగుతూ వస్తారు. వారికి అభిమానులు ఉంటారు. అనుచరుల ద్వారా వారు తమ అభిమాన నాయకుడిని కలుసుకుంటారు. ఆ వెంటనే సెల్ఫీలు తీసుకుంటారు, అలాగే ఫోటోలు క్లిక్ మనిపిస్తూంటారు. అయితే ఇలా ఫోటో సెషన్ పెట్టుకుంటే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని పెద్దాయనగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన మంత్రివర్గ సహచారులకు సూచించారు అని అంటున్నారు.
నేతలూ జర భద్రం :
ఎవరో ఒకరు వచ్చి ఫోటోలు తీసుకుంటామని అడగానే వెంటనే ఓకే చెప్పవద్దు అని బాబు మంత్రులకు సూచించారు. ప్రతీ వారితో ఫోటోలు దిగే విధానాన్ని కూడా మానుకోవాలని ఆయన కోరారు. ఎవరు పడితే వారు వచ్చి ఫోటోలు అడిగితే మాత్రం వద్దు అని చెప్పండి అని సూచించారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఈ విషయంలో అంతా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని బాబు దిశ నిర్దేశం చేశారు. అయితే ఈ సందర్భంగా మంత్రి ఫరూఖ్ స్పందిస్తూ తాను అయితే తెలుగుదేశం పార్టీ వారు కాకుండా బయటవారు ఇతరులు ఎవరైనా ఫోటలు అడిగితే అసలు ఇవ్వనని చెప్పారు ఇది తన విధానంగా పెట్టుకున్నాను అన్నారు. వైసీపీకి చెందిన లిక్కర్ స్కాం నిందితుడు వెంకటేష్ నాయుడుది నంద్యాల అని తెలిసినా దూరం పెట్టాను అని ఫరూఖ్ వివరించారు.
ఆ ఫోటోల వల్లనే :
ఏపీలో లిక్కర్ స్కాం విషయంలో ఇపుడు రాజకీయ సంచలనాలు నమోదు అవుతున్నాయి. వరసబెట్టి బిగ్ షాట్స్ అరెస్టు అవుతున్నారు ఈ నేపథ్యంలో నోట్ల కట్టలతో వెంకటేష్ నాయుడు ఫోటోలు బయటకు వచ్చాయి అయితే ఆ వ్యక్తి వైసీపీ వారితోనే కాకుండా టీడీపీ వారితో కూడా ఫోటోలు తీసుకున్నారని చెబుతూ ఆ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దాంతో ఇది వైరల్ అవుతోంది బహుశా ఈ తరహా విషయాలను దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి ఈ విధంగా మంత్రులకు సీనియర్ నేతలకు ఇతర నాయకులకు ఫోటోలు తీసుకున్నపుడు తగిన జాగ్రత్తలు పాటించారని అంటున్నారు.
గట్టిగా తిప్పి కొట్టాలి :
ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా కూడా పనిగట్టుకుని మరీ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చంద్రబాబు అన్నారు. అందువల్ల వైసీపీ వారు తరచూ చేసే తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. మంత్రులు తమ సబ్జెక్ట్ ని అభివృద్ధి చేసుకోవాలని స్టడీ అన్నది ప్రతీ అంశం మీద చాలా ముఖ్యమని చంద్రబాబు చెప్పారు. ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నామని దానిని వారికి చెబుతూనే తప్పుడు ప్రచారం చేసే వాటి మీద ఫుల్ ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు
బీ అలెర్ట్ అంటూనే :
మొత్తం మీద చూస్తే ప్రతీ మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు చంద్రబాబు దిశా నిర్దేశం చేస్తూనే ఉంటారు. ఈసారి కూడా ఆయన చాలా విషయాలు చెప్పారు. అయితే అందులో ఫోటో సెషన్ గురించి గట్టిగా చెప్పారని అంటున్నారు. ఎవరికి పడితే వారితో ఫోటోలు తీసుకోకుండా స్ట్రిక్ట్ గా ఉండాలని బాబు స్పష్టం చేశారు. ఈసారి బాబు ఇచ్చిన సూచనలలో ఇదే హైలెట్ గా అంతా చూస్తున్నారు. మరి అందరూ తప్పకుండా పాటించాల్సి ఉంది అని అంటున్నారు.
