బాబు పక్కా లెక్క.. నేతలు, అధికారులదే బాధ్యత
ఏపీ సీఎం చంద్రబాబు... అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రుల ముందు కొన్ని పక్కా లెక్కలు ఉంచారు. మనకు ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయి? మనం ఎన్ని పరిష్కరిస్తున్నాం..? అని ఆయన ప్రశ్నించారు.
By: Garuda Media | 7 Nov 2025 2:00 PM ISTఏపీ సీఎం చంద్రబాబు... అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రుల ముందు కొన్ని పక్కా లెక్కలు ఉంచారు. మనకు ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయి? మనం ఎన్ని పరిష్కరిస్తున్నాం..? అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల మంత్రి నారా లోకేష్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ప్రజాదర్బార్‌లు.. ప్రజా స్పందన కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులపై ఇటీవల మంత్రి నారా లోకేష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు సరిగా స్పందించి ఉంటే.. ఇన్ని వేల దరఖాస్తులు ఒకేసారి ఎలా వస్తాయని కూడా లోకేష్ ప్రశ్నించారు.
తాజాగా సీఎం చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. అధికారుల తీరును కూడా ఆయన ప్రశ్నిం చారు. జిల్లాల వారీగా అందుతున్న దరఖాస్తులు.. పరిష్కారం అవుతున్నవి.. తూతూ మంత్రంగా పక్కన పెడుతున్నవీ.. ఇలా మూడు విభాగాలుగా ప్రజల నుంచి అందిన దరఖాస్తులను చంద్రబాబు ప్రస్తావిం చారు. ఇలా అయితే.. ఎలా అని ప్రశ్నించారు. కనీసంలో కనీసం 50 శాతం కూడా సమస్యలు పరిష్కరిం చక పోతే.. ఎలా అన్నది సీఎం చంద్రబాబు ఆవేదన.
''ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. వారి సమస్యలు పరిష్కారం అవుతాయని.. ఎంతో వ్యయ ప్రయాసల కు ఓర్చుకుని వస్తున్నారు. కానీ.. మనం ఏం చేస్తున్నాం.. అనేది ప్రశ్నగా మారకూడదు'' అని హితవు పలికారు. ఈ క్రమంలో ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే స్పందనకు 4 వేల పైచిలుకు దరఖాస్తులు వస్తే.. కేవలం 1200 దరఖాస్తులకు మాత్రమే పరిష్కారం చూపించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన దరఖాస్తు దారుల మాటేంటని ప్రశ్నించారు.
ఈ విషయంలో ఒక్క జిల్లాలోనే ఇన్ని లోపాలు ఉంటే.. మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటని కలెక్టర్లను, మంత్రులను కూడా నిలదీశారు. ఎట్టి పరిస్థితిలోనూ ప్రజల సంతృప్తి మేరకు పనిచేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. రెవెన్యూ సమస్యలపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్ననేపథ్యంలో వాటిపై దృష్టి పెట్టాలని.. ముఖ్యంగా 22ఏ(అసైన్డ్ భూములు) సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రజల సంతృప్తి ఉంటేనే ఎంత చేసినా.. ఫలితం వస్తుందన్నారు. దీంతో అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు చంద్రబాబు ప్రథమ ప్రాధాన్యం ఏంటనేది స్పష్టం చేసినట్టు అయింది.
