విశాఖలో ఏడీఆర్ ఎకో సిస్టమ్....బాబు వినూత్న ఆలోచన
విశాఖ ఈ రోజున మెగా సిటీగా ఉంది. అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సులు విశాఖలోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో విశాఖలో మరో కీలక వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది.
By: Satya P | 5 Sept 2025 10:13 PM ISTవిశాఖ ఈ రోజున మెగా సిటీగా ఉంది. అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సులు విశాఖలోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో విశాఖలో మరో కీలక వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో ఏడీఆర్ ఎకో సిస్టమ్ ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.ఏడీఆర్ ఫుల్ ఫార్మ్ లో ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ గా పిలుస్తారు. ఈ తరహా ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా చంద్రబాబు చెబుతున్నారు. దీని వల్ల లాభమేంటి అంటే ఇబ్బడి ముబ్బడిగా పేరిగిపోతున్న అనేక వివాదాలు కేసుల పరిష్కారానికి దోహదపడుతుందని అన్నారు అంతే కాదు ఈజ్ ఆఫ్ జస్టిస్ కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
మధ్యవర్తిత్వంతోనే సత్వర న్యాయం :
గతంలో అన్ని వివాదాలు కూడా పెద్దలు మధ్యవర్తుల ద్వారానే పరిష్కారం అయ్యేవని బాబు గుర్తు చేసారు. ఈ రోజులలో కూడా కోర్టుల మీద ఒత్తిడి తగ్గించేందుకు ఆల్టర్నేషన్ వ్యవస్థలు రావాల్సిన అవసరం ఉందని ఆయన అంటున్నారు అలా చూస్తే కనుక ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతుందని బాబు అంటున్నారు. ఈ వ్యవస్థలో మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలే ముఖ్య భూమిక పోషిస్తాయని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇక విశాఖ వేదికగా ఏర్పాటు చేయనున్న ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ద్వారా న్యాయం అందరికీ అందుబాటులోకి రావటంతో పాటు వేగంగా సమర్థవంతంగా చేరుతుందని ఆయన చెప్పారు.
ఆర్ధిక వ్యవస్థ బాగుండాలంటే :
వివాదాలు ఎపుడూ మేలు చేయవు. అవి ఎంత ఆలస్యంగా పరిష్కారం అయితే అంతలా ఆర్ధికంగా కూడా నష్టం జరుగుతుంది. చివరికి వాటి ద్వారా ఆర్ధిక వ్యవస్థకు కూడా ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో విశాఖ సదస్సులో బాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏడీఆర్ ఎకో సిస్టమ్ ని విశాఖలో ఏర్పాటు చేయడమే కాదు భవిష్యత్తులో మరిన్ని ప్రత్యామ్నాయ వ్యవస్థలను రూపోందించుకోవాల్సి ఉందని సూచించారు. ఇక పెరుగుతున్న సాంకేతికతను న్యాయ వ్యవస్థ కూడా ఉపయోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. దాని ద్వారా ఈజ్ ఆఫ్ జస్టిస్ ప్రక్రియలో భాగంగా వర్చువల్ హియరింగ్స్, ఈ-ఫైలింగ్, మొబైల్ అప్‌డేట్స్ లాంటి సాంకేతికతను అమలు చేయాల్సి ఉంటునని ఆయన ప్రతిపాదిస్తున్నారు.
హైకోర్టుకు న్యాయమూర్తుల కొరత :
ఇక రాష్ట్ర హైకోర్టు విషయం తీసుకుంటే ప్రస్తుతం 650 మంది దాకా న్యాయమూర్తులు ఉన్నారు. ఇక నిత్యం హైకోర్టులు వచ్చే వందలాది కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ న్యాయమూర్తుల సంఖ్య ఏ మాత్రం సరిపోవడం లేదని హైకోర్టు ప్రధాన న్యాయం మూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ చెప్పారు. మరో 800 మంది న్యాయమూర్తులు అవసరం ఉందని ఆయన అంటున్నారు. ఈ నేపధ్యంలో కేసుల సత్వర పరిష్కారానికి మీడియేషన్ ప్రక్రియ చాలా అవసరం ఉందని ఆయన సైతం అభిప్రాయపడ్డారు. ఇక డియేషన్ నిపుణులను తయారు చేసేందుకు నలభై గంటల ట్రైనింగ్ అవసరం అవుతుందని చెప్పారు. అంతే కాదు మీడియేషన్ చేసే వారికి చాలా నైపుణ్యం ఉండాలని అన్నారు. ఇక వారికంటూ ఓ ప్రత్యేకమైన సర్టిఫికేషన్ ఉండాలని చెప్పారు. మరో వైపు చూస్తే మారుతున్న న్యాయ వ్యవస్థలో భాగంగా ఆర్బిట్రేషన్ రంగంలోకి విశ్రాంత న్యాయమూర్తులు బ్యూరోక్రాట్లు వస్తున్నారని ఆయన తెలిపారు. అంతే కాదు అందువల్ల దీనికో ప్రత్యేకమైన యంత్రాంగం ఉండాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు.
