Begin typing your search above and press return to search.

బాబు వాక్ ఆన్ స్ట్రీట్స్...వాటే సీన్ !

బాబు విజయవాడ వీధులలో పర్యటించారు. ఆయన ఏకంగా దీపావళి బాణసంచా అమ్మకాలు చేసే వ్యాపారుల వద్దకు వెళ్ళారు.

By:  Satya P   |   20 Oct 2025 9:06 AM IST
బాబు వాక్ ఆన్ స్ట్రీట్స్...వాటే సీన్ !
X

ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదురుగా కనిపిస్తే ఏమవుతారు. ఏంటయ్యా బాగున్నావా అంటూ పలకరిస్తే ఎలా ఫీల్ అవుతారు, అసలు ఊహకైనా అందుతున్నా. మెదడు మొద్దుబారి పోదా. కళ్ళెదురుగా సీఎం, ఒక సామాన్యుడిగా కనిపిస్తే ఒక సాటి మనిషిగా యోగక్షేమాలు అడుగుతూంటే అంతకు మించిన అద్భుతం ఏమి ఉంటుంది. నిజంగా అంతకు మించిన దీపావళి కూడా ఏమి ఉంటుంది. చంద్రబాబు అచ్చంగా అదే చేశారు. చిన్న జీవితాలలో చిరు వ్యాపారుల కళ్ళలో దీపావళి కాంతులు నింపారు.

బీసెంట్ రోడ్ లో :

బాబు విజయవాడ వీధులలో పర్యటించారు. ఆయన ఏకంగా దీపావళి బాణసంచా అమ్మకాలు చేసే వ్యాపారుల వద్దకు వెళ్ళారు. వారి వ్యాపారం ఎలా సాగుతోందో తెలుసుకున్నారు. జీఎస్టీ గురించి వారికి వివరించారు. బీసెంట్ రోడ్ లో బాబు పర్యటించి వీధి వ్యాపారులు చెప్పుల షాపు నిర్వాహకులతో ముచ్చటించారు. జీఎస్టీ తగ్గింపు వారి జీవితాలలో ఎలాంటి మార్పు తీసుకుని వచ్చిందో స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

వ్యాపారం ఎలా నడుస్తోంది :

ఇక దీపావళి పండుగ వేళ వ్యాపారం ఎలా నడుస్తోంది అన్నది బాబు వారి నుంచి వివరాలు రాబట్టారు. ప్రమిదలు, జ్యూట్ బ్యాగులు విక్రయించే వ్యాపారితో మాట్లాడి కష్టం తెలుసుకున్నారు. ఆయనకున్న సమస్యలను గురించి సీఎం ఆరా తీసారు. అలాగే . మరో వీధి వ్యాపారి తో పాటు చెప్పుల షాపు యజమానితో మాట్లాడారు. వ్యాపారం నడుస్తున్న తీరు, చెప్పులపై జీఎస్టీ ఏ మేరకు తగ్గింది, విక్రయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. బట్టల షాపునకు వెళ్లి అందులో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తోన్న మహిళతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. అనంతరం కిరాణా షాపు వద్దకు వెళ్లి నిర్వాహకుడుతో చంద్రబాబు మాట్లాడారు.

ఫోటోలు దిగిన వైనం :

నిత్యావసర వస్తువుల జీఎస్టీ తగ్గింపు ఎంత వరకు ఉందని, గతానికి ఇప్పటికీ ధరల వ్యత్యాసం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీసెంట్ రోడ్‌కు వచ్చిన కొందరు కొనుగోలు దారులతోనూ సీఎం మాట్లాడారు. ముఖ్యమంత్రి వీధులలోకి రావడంతో విజయవాడ జనాలు అంతా ఆసక్తిని కనబరచారు. బీసెంట్ రోడ్డు మీద ఆ సమయంలో వెళ్తున్న్న వారు అంతా బాబుతో మాట్లాడేందుకు ఆసక్తిని చూపించారు. ఆయనతో కలసి ఫోటోలు దిగారు. ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం మీద ఏ సీఎం చేయని విధంగా బాబు డీసెంట్ గా బీసెంట్ రోడ్డులో నడచుకుంటూ జనాలతో కలసిపోయిన వైనం చూసిన వారు అంతా వాటే సీఎన్ అనుకున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు రూటే సెపరేట్. ఆయన ఏది చేసినా దటీజ్ చంద్రబాబు అనిపిస్తారు. తాజాగా అదే జరిగింది మరి.