Begin typing your search above and press return to search.

కూటమికి 2024 కంటే ఆదరణ పెరిగింది...అంచనా ఇదే !

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళకు దగ్గర పడుతోంది. మరో రెండు నెలలలో సగం పాలన పూర్తి అవుతుంది.

By:  Satya P   |   30 Sept 2026 1:00 AM IST
కూటమికి 2024 కంటే ఆదరణ పెరిగింది...అంచనా ఇదే !
X

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళకు దగ్గర పడుతోంది. మరో రెండు నెలలలో సగం పాలన పూర్తి అవుతుంది. నిజానికి యాంటీ ఇంకెంబెన్సీ మెల్లగా పెరిగే కాలం ఇది. అయితే అనూహ్యంగా ఏపీలో కూటమి పాలనకు జనం మద్దతు మరింతగా పెరిగింది అని కూటమి పెద్దలు చెబుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 95 శాతం పైగా సీటు షేర్ సాధించి దాదాపుగా 60 శాతం ఓటు షేర్ సాధించిన కూటమి ఈసారి సెంట్ పర్సెంట్ ఫలితాలను సాధిస్తామని అంటోంది. అలాగే తమ ఓటు షేర్ ని ఇంతకు ఇంతా పెంచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి హవా సాగడం ఖాయమని ముఖ్యమంత్రి కూటమి పెద్ద అయిన చంద్రబాబు చెబుతున్నారు.

చరిత్ర పునరావృత్తం :

ఏపీలో 2024 ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడి ప్రధాని నరేంద్ర మోదీ, తాను, పవన్‌ కళ్యాణ్‌ ప్రజల ముందుకు వచ్చామని ఉదయగిరి సభలో చంద్రబాబు గుర్తు చేశారు. ఆనాడు రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చామని చెప్పారు. అందుకే చరిత్రలో ప్రజలు ఎన్నడూ ఇవ్వనంత మెజారిటీని 2024 ఎన్నికల్లో కూటమికి అందించారని ఆయన తెలిపారు. ఆనాడు ప్రజలు అద్భుతమైన గెలుపును అందిస్తూ చేసిన విజయ ధ్వానాలు ఇప్పటికీ తమ చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయని బాబు అన్నారు. 2024 ఎన్నికల నాటి కంటే ఇప్పుడు ఎన్డీఏ హవా మరింత పెరిగిందని చంద్రబాబు చెప్పడం విశేషం. స్థానిక ఎన్నికల్లలో కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రధాని మోదీ అందిస్తున్న కేంద్ర సహకారంతో తన అనుభవం, పవన్‌ కళ్యాణ్‌ మద్దతుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

పేదలకు పట్టాభిషేకం

కూటమి ప్రభుత్వం అంటే పేదలకు పట్టాభిషేకం అని చంద్రబాబు అన్నారు. అదే వైసీపీది విధ్వంసంతో రక్తాభిషేకం అని విమర్శించారు. కూటమి సంక్షేమానికి వైసీపీ సంక్షోభానికి వ్యత్యాసం చూడండని బాబు జనాలను కోరారు. ప్రతీ ఒక్కరూ మంచికి అండగా నిలవాలని ఆయన సూచించారు. రాజకీయాలను నేరమయం చేసేవారెవరో రాజకీయాలతో ప్రజల జీవితాలను మార్చేవారెవరో ప్రజలు గమనించాలని బాబు కోరారు. ఎవరైనా సరే అభివృద్ధికి అడ్డొస్తే ఎంత మాత్రం ఉపేక్షించబోమని బాబు ఈ సందర్భంగా హెచ్చరించారు.

వెంటిలేటర్ పై ఏపీ :

గత వైసీపీ ప్రభుత్వం అయిదేళ్లలో 880 కిలోమీటర్ల సీసీ రోడ్లు మాత్రమే వేస్తే కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే ఆరు వేల 500 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించి చరిత్ర సృష్టించిందని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి సుమారు పది లక్షల కోట్ల అప్పుల భారాన్ని వారసత్వంగా స్వీకరించామని ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను ఆపలేదని చంద్రబాబు గుర్తు చేశారు. ర్థిక ఇబ్బందులున్నా సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం వల్ల రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లామని వెంటిలేటర్‌పై ఉన్న ఏపీని ప్రధాని నరేంద్ర మోదీ ఆదుకున్నారని బాబు చెప్పారు. వైసీపీ హయాంలో దెబ్బతీసిన ఏపీ బ్రాండ్‌ను తిరిగి పునరుద్ధరించామని చంద్రబాబు అన్నారు. ఈ సభలో ప్రజల మద్దతు కోరుతూనే కూటమికి జనాదరణ పెరిగింది అని బాబు చెప్పారు. స్థానిక ఎన్నికల్లో కచ్చితంగా మరో చరిత్ర సృష్టిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.