వైసీపీపై బాబుకు ఆ అనుమానం పోలేదా?
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పటినుంచే చర్చ నడుస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
By: Garuda Media | 16 Oct 2025 8:00 PM ISTవచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పటినుంచే చర్చ నడుస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా రాజకీయ వర్గాల కంటే కూడా సీఎం చంద్రబాబులోనే ఈ తరహా చర్చ ఎక్కువగా ఉంది. ఎక్కడ మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మనమే గెలవాలని చెప్తున్నారు. ఇది తప్పు కాదు. కానీ ఆయన ఆలోచన అంతా కూడా వైసిపి చుట్టూ తిరుగుతుండడమే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి ఎన్నికలు జరగడానికి మూడున్నర సంవత్సరాలు సమయం ఉంది.
అయినప్పటికీ ఇప్పటినుంచే ఎందుకు అంత హడావిడి చేస్తున్నారు? అనేది ప్రధాన చేర్చ. వైసీపీకి బిజెపికి ఉన్న అంతర్గత సంబంధాలు అందరికీ తెలిసిందే. వారు నేరుగా పొత్తు పెట్టుకోకపోయినప్పటికీ అంతర్గతంగా చేతులు కలుపుతూనే ఉన్నారు. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా వైసిపి బహిరంగంగానే మద్దతు ప్రకటించింది. అనుకూలంగా ఓటు వేసింది. ఇది చంద్రబాబుకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. నిజానికి చెప్పాలంటే ఈ విషయంలో ఆయన ప్రశ్నించాల్సింది బిజెపిని.
వచ్చే ఎన్నికల నాటికి వైసిపి ఒకవేళ బిజెపితో చేతులు కలిపితే తన పరిస్థితి ఏంటి అన్నది ఆయన బాధపడుతున్నారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. మరి ముఖ్యంగా బీజేపీ వంటి పార్టీలైతే ఎప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటాయో ఊహించటం కష్టం. వారికి అవకాశం ఉన్న మార్గంలో ప్రయాణించటం వారికి అనుకూలంగా ఉన్న నాయకులు ఎంతటి వారైనా పొత్తు పెట్టుకోవడం వంటివి దేశవ్యాప్తంగా జరుగుతున్నదే.
దీనికి ఇటీవల తమిళనాడులో జరిగిన ఘటన కూడా ఉదాహరణ. తమను విమర్శించిన విజయ్‌తో పొత్తుకు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు చింత మొత్తం వైసిపి కోసమే అన్నట్టుగా ఉందని రాజకీయ వర్గాల అభిప్రాయపడుతున్నాయి. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆయన మరింత స్నేహ సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్న మాట. అందుకే వైసీపీ విషయంలో చంద్రబాబు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
