Begin typing your search above and press return to search.

ఫేక్ ప్రచారం విషపు విత్తనాలు...బాబు మార్క్ వార్నింగ్

మరో వైపు చూస్తే ఏపీలో ఎరువుల సరఫరా ఎక్కడెక్కడ జరుగుతోంది ఎంతలా జరుగుతోంది అన్న దాని మీద సీఎం స్వయంగా మీడియాకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

By:  Satya P   |   4 Sept 2025 12:49 AM IST
ఫేక్ ప్రచారం  విషపు  విత్తనాలు...బాబు మార్క్ వార్నింగ్
X

ఏపీలో విపక్ష వైసీపీ మీద భారీ స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు చేశారు. వైసీపీని ఫేక్ పార్టీగా ఆయన పేర్కొన్నారు. ఫేక్ ప్రచారాలకు కేరాఫ్ వైసీపీ అని నిందించారు. విషపు విత్తనాలు ప్రజలలో నాటి డ్రామలౌ ఆడుతున్నరని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు రాజకీయాలు చేయాలని చూస్తే జైలుకు పంపిస్తామని స్ట్రాంగ్ గానే డోస్ ఇచ్చేశారు.

అసలు ఎందుకిలా :

రాష్ట్రంలో ఎరువుల కొరత ఉందని వైసీపీ అంటోంది. దాని మీద మాజీ సీఎం జగన్ కూడా ట్వీట్లు వేస్తూ కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. అంతే కాదు ఎరువులు రైతులకు దక్కకుండా బ్లాక్ చేస్తున్నారు అని జగన్ విమర్శిస్తునారు. ఇక వైసీపీ రైతులకు మద్దతుగా ఈ నెల 9న ఆందోళలను నిర్వహించాలని కూడా అనుకుంటోంది. మరో వైపు చూస్తే సోషల్ మీడియాలో వైసీపీ నేతలు యాక్టివిస్టులు పోస్టులు పెడుతున్నారు. అందులో ఎరువులు ఎక్కడా దొరకడం లేదని వారు కూటమిని టార్గెట్ చేస్తున్నారు.

బాబులో ఆగ్రహం :

ఇక ఈ విషయం మీద అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించిన చంద్రబాబు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు అని అన్నారు. అంతే కాదు ఎరువుల రవాణాను అడ్డుకుంటూ వైసీపీ డ్రామాలాడుతోందని బాబు అన్నారు. రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం చేస్తోందని నిందించాఉర్. వైసీపీ దుష్ప్రచారంతో రైతులు ఆందోళన చెందొద్దని, వారి రాజకీయ ఉచ్చులో పడొద్దని ఆయన కోరారు. అంతే కాదు సమృద్ధిగా ఎరువుల నిల్వలున్నాయని, రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఇంకా వస్తున్నాయని ఆయన చెప్పారు.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ :

మరో వైపు చూస్తే ఏపీలో ఎరువుల సరఫరా ఎక్కడెక్కడ జరుగుతోంది ఎంతలా జరుగుతోంది అన్న దాని మీద సీఎం స్వయంగా మీడియాకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఖరీఫ్ సీజనులో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేశామని ఆయన వివరించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరో 53 వేల టన్నుల కేటాయింపులు తెచ్చుకున్నామని చెప్పారు. సెప్టెంబర్ నెకాఖరు నాటికి 2.71 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందని వివరించారు. అంతే కాదువచ్చే రబీ నాటికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 9.38 లక్షల టన్నులు కేటాయింపులు ఇప్పటికే చేసుకున్నామని బాబు చెప్పాఉరు.

వైసీపీ విషవృక్షం :

వైసీపీ ఒక విష వృక్షమని చంద్రబాబు దుయ్యబెట్టారు. ఫేక్ పార్టీ, నేరాలను నమ్ముకున్న పార్టీ, విషపు విత్తనాలను చల్లుతోందని విమర్శించారు. ఫేక్ ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. డ్రామాలు అడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. దుష్ప్రచారం చేసే వారిని జైలుకు పంపుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి ఎవరు అయినా ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మొన్నటి వరకు మహిళల పైనా నిన్న రాజధాని పైనా ఇప్పుడు రైతులను తప్పుదోవ పట్టించేలా చేస్తున్నారు. ఇలాంటి వారిని ఖచ్చితంగా నియంత్రిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

త్వరలో రైతులతో సమావేశం :

మరో వైపు చూస్తే రైతులతో తొందరలో సమావేశం ఏర్పాటు చేస్తామని బాబు ప్రకటించారు. వాస్తవాలు వివరిస్తామని అన్నారు గత ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలు జరిగేవని గుర్తు చేశారు. రైతులకు మంచి చేస్తుంటే వైసీపీ ఓర్వలేకపోతోందని బాబు ఫైర్ అయ్యారు. వైసీపీ చేసే ఇలాంటి చర్యలను సమర్ధంగా ఎదుర్కొని రైతులకు మేలు చేస్తామని ఆయన అన్నారు.