Begin typing your search above and press return to search.

విజయ్ కి బాబు అల్టిమేట్ ప్రశంస

ఇంద్రకీలాద్రికి విచ్చేసిన తమిళనాడు ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు అధికారులు సాంప్రదాయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.

By:  Satya P   |   13 Oct 2026 8:19 PM IST
విజయ్ కి బాబు అల్టిమేట్ ప్రశంస
X

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కి ఏపీ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. చెన్నై నుంచి ఆయన విజయవాడ గన్నవరం విమానాశ్రయంలోకి దిగడంతోనే టీడీపీకి చెందిన ప్రముఖులు ఆయనకు స్వాగతం పలికారు. ఇక విజయ్ విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.

ఇంద్రకీలాద్రికి విచ్చేసిన తమిళనాడు ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు అధికారులు సాంప్రదాయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు.

విజయ్ కి పొగడ్తలు :

ఇదిలా ఉంటే విజయ్ గురించి చంద్రబాబు మాట్లాడుతూ ఆయన రాజకీయ విజయాలను కొనియాడారు. పార్టీ పెట్టిన రెండేళ్లలోనే విజయ్‌ సీఎం అయ్యారని ప్రశంసించారు తమిళనాడు అభివృద్ధికి విజయ్‌ కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాలు వేరైనా మా ఇద్దరి అభిమతం ఒక్కటే అని చంద్రబాబు చెప్పుకొచారు. కరవుకు శాశ్వత పరిష్కారం నదుల అనుసంధానమే అని బాబు అన్నారు. అన్ని రాష్ట్రాలు బాగుపడాలి, అలాగే దేశం అభివృద్ధి చెందాలని బాబు అన్నారు. గోదావరి కావేరి అనుసంధానం జరుగుతుందని గట్టిగా చెప్పిన చంద్రబాబు నదుల అనుసంధానం కేంద్రంలోని ఎన్ డీయే ప్రభుత్వంలో మోదీతోనే సాధ్యమని స్పష్టం చేశారు.

తెలుగు గంగ మీదనే :

ఇదిలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడు సీఎం విజయ్ ల మధ్య ప్రధానంగా చర్చలు తెలుగు గంగ ప్రాజెక్ట్ మీదనే సాగాయి. ఇదే విషయం చంద్రబాబుతో విజయ్ చర్చించారు. తెలుగు గంగ నీటి విడుదల పెంచాలని తమిళనాడు తరఫున విజయ్ చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఈ ఏడాది చెన్నైకి 4.08 టీఎంసీల నీరు అందించామని అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో కృష్ణా జలాలు తగ్గినా చెన్నై దాహార్తి తీర్చేందుకు ఏపీ సానుకూలం అని కూడా గట్టిగా చెప్పారు. అయితే కరువుకు శాశ్వత పరిష్కారం నదుల అనుసంధానమే అని బాబు చెప్పుకొచ్చారు. అందుకే తమ పార్టీ మొదటి నుంచి గోదావరి కావేరి నదుల అనుసంధానం జరగాలని కోరుతోందని అన్నారు.

బాబు పొగడ్తలు మీద :

తమిళనాడుకు నిన్నటిదాకా హీరో ఈ రోజున ముఖ్యమంత్రి అయిన విజయ్ గురించి చంద్రబాబు ప్రశంసించిన తీరు మీద చర్చ సాగుతోంది. పార్టీ పెట్టి కేవలం రెండేళ్ల వ్యవధిలోనే సీఎం అయ్యారు అని కితాబు ఇవ్వడం కూడా విశేషం. ఇక చూస్తే దక్షిణాదిన ఎంతో మంది పార్టీలు పెట్టారు. ఇక ఎంజీఆర్ అయితే పార్టీ పెట్టిన మూడేళ్ళకు కానీ సీఎం కాలేదు, తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలో సీఎం అయి గిన్నీస్ రికార్డు క్రియేట్ చేశారు. ఆ తరువాత రికార్డ్ విజయ్ కే ఆ రికార్డు దక్కింది. అందుకే చంద్రబాబు ప్రత్యేకించి ఈ విధంగా ప్రశంసించారు అని అంటున్నారు. ఇక ఏపీకి విజయవాడకు తొలిసారి వచ్చిన విజయ్ కి స్థానిక అభిమానులు కూడా కేరింతలతో స్వాగతం పలికారు. విజయ్ క్రేజ్ ఏపీలో సైతం ఎంత ఉందో ఆయన పర్యటన నిరూపించింది.