మోడీ లాంటి నాయకుడిని నేనెప్పుడూ చూడలేదు: చంద్రబాబు
జీఎస్టీ సంస్కరణలతో దేశ ప్రజల ఆర్థిక విధానాలను కూడా ప్రధాని కాపాడారని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజల తరఫున ఆయనకు అభినందనలు, కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.
By: Garuda Media | 16 Oct 2025 6:15 PM ISTప్రధాని నరేంద్ర మోడీ లాంటి నాయకుడిని నేనెప్పుడూ చూడలేదు.. అని సీఎం చంద్రబాబు అన్నారు. దేశాన్ని అత్యంత నిష్ఠతో ఆయన ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. అనేక రూపాల్లో ఆయన ఏపీకి సాయం చేస్తున్నారని తెలిపారు. జీఎస్టీ -2.0 అనేది ఒక అద్భుతమన్న సీఎం చంద్రబాబు.. దీనివల్ల పేదల జీవితాలు సమూలంగా మారుతాయన్నారు. జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చిన ప్రధాని.. ఒక ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని ప్రశంసించారు.
జీఎస్టీ సంస్కరణలతో దేశ ప్రజల ఆర్థిక విధానాలను కూడా ప్రధాని కాపాడారని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజల తరఫున ఆయనకు అభినందనలు, కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలుస్తుందన్నారు. అనక సంస్కరణలు తీసుకువస్తున్న ప్రధాని పేదల పాలిట దేవుడిగా నిలుస్తున్నారని తెలిపారు. దేశానికి మోడీ వంటి నాయకుడు లభించడం గొప్ప వరమని పేర్కొన్నారు. ఆయన దార్శనిక నేతృత్వంలో దేశంతోపాటు రాష్ట్రం కూడా అభివృద్ది చెందుతున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో జీఎస్టీ తగ్గింపు ఫలాలను ప్రజలకు అందిస్తున్నామని సీఎంచంద్రబాబు చెప్పారు. పహల్గాంలో రెచ్చిపోయిన పాకిస్థాన్‌కు అంతేదీటుగా ప్రధాని సమాధానం చెప్పారని.. నోరెత్తకుండా చేశారని అన్నారు. 25 ఏళ్లుగా.. మోడీ ప్రజాసేవలో ఉన్నారని తెలిపారు. గత 11 సంవత్సరాలుగా ప్రధానిగా దేశాన్ని ముందు కు తీసుకువెళ్తున్నారని తెలిపారు. త్వరలోనే భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా కూడా అవతరిస్తుందని చెప్పా రు. ``నేను ఎంతో మంది ప్రధానులతో కలిసి పనిచేశాను. కానీ, మోడీ వంటి నాయకుడిని మాత్రం ఎప్పుడూ చూడలేదు`` అని చంద్రబాబు అన్నారు.
విశాఖపట్నానికి గూగుల్ డేటా కేంద్రం వచ్చిందని.. దీనికి ప్రధాన మంత్రి ఎంతో సహకారం అందించారని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదేనని తెలిపారు. దీని వల్ల రా ష్ట్రంలో రెండు లక్షల మందికి ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అదేవిధంగా ప్రపంచ స్థాయి సంస్థలు కూడా రాష్ట్రానికి వస్తాయని తెలిపారు. తద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయని పేర్కొన్నారు. వీటి వెనుక ప్రధాని పాత్ర ఉందన్నారు.
