Begin typing your search above and press return to search.

టీడీపీ నేత‌ల‌ కు చంద్ర‌బాబు.. `సీక్రెట్` సూచ‌న‌.. ఏంటిది?

టీడీపీ నేత‌ల‌కు చంద్ర‌బాబు కీల‌క సూచ‌న చేశారు. నాయ‌కులుగా ఎద‌గ‌డ‌మే కాదు.. రాణించేందుకు కూడా కొన్ని విధానాల‌ను అవ‌లంభించాల‌ని సూచించారు.

By:  Garuda Media   |   7 Jun 2026 8:15 AM IST
టీడీపీ నేత‌ల‌ కు చంద్ర‌బాబు.. `సీక్రెట్` సూచ‌న‌.. ఏంటిది?
X

టీడీపీ నేత‌ల‌కు చంద్ర‌బాబు కీల‌క సూచ‌న చేశారు. నాయ‌కులుగా ఎద‌గ‌డ‌మే కాదు.. రాణించేందుకు కూడా కొన్ని విధానాల‌ను అవ‌లంభించాల‌ని సూచించారు. దీనికి తానే ఉదాహ‌ర‌ణ‌గా ఆయ‌న పేర్కొన్నా రు. తాను `ది సీక్రెట్‌` అనే పుస్త‌కాన్ని నిరంత‌రం చ‌దువుతున్న‌ట్టు తెలిపారు. ఎప్పుడు చ‌దివినా.. ఒక కొత్త విష‌యం నేర్చుకునే అవ‌కాశం ఉంద‌న్నారు. ప్ర‌స్తుతం ఈ పుస్త‌కం తెలుగులో కూడా అందుబాటులోకి వ‌చ్చింద‌న్న ఆయ‌న‌.. ప్ర‌తి ఒక్క‌రూ `సీక్రెట్‌` పుస్త‌కాన్ని చ‌దవాల‌ని సూచించారు. త‌ద్వారా ప్ర‌జ‌ల‌కు - నాయ‌కుల‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం ఏర్ప‌డుతుంద‌న్నారు.

ఏంటీ పుస్త‌కం.. ?

ఆస్ట్రేలియాకు చెందిన రచయిత రోండా బైర్న్ రాసిన `ది సీక్రెట్‌` పుస్త‌కం ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో ప్ర‌సిద్ధి చెందింది. ప్రతి ఒక్కరిలోనూ అనేక కోరిక‌లు ఉంటాయ‌ని, అభిలాషలు ఉంటాయ‌ని.. వాటిని సాధించేందుకు అనుగుణంగా అనుస‌రించాల్సిన వ్యూహాల‌నే.. `ది సీక్రెట్‌` పుస్త‌కంలో ర‌చ‌యిత వివ‌రించారు. ఈ పుస్త‌కం విడుద‌లైన 2006 నుంచి కేవలం సంవ‌త్స‌ర‌కాలంలో కోటీ 90 ల‌క్ష‌ల మంది కొనుగోలు చేశారు. 46 భాషలలోకి అనువదించిన పుస్త‌కంగా కూడా రికార్డు సృష్టించింది. ఈ పుస్త‌కం ఆధారంగా సినిమాను కూడా రూపొందించారు.

ముఖ్యంగా `ది సీక్రెట్` ఒక స్వీయ-సహాయక పుస్తకం. దీని ద్వారా ఎంచుకున్న రంగంలో విజయం సాధించడానికి అవ‌స‌ర‌మైన స్ఫూర్తిని అందిస్తుంది. ప్రజలు ఏ విషయాలను ఎలా చూస్తారో వివ‌రిస్తుంది. ఇది వారిని విజయం, నిజమైన సంతోషం వంటి మార్గంలో నడిపిస్తుంది. ఈ పుస్తకం 'సూత్రాన్ని సజావుగా, సరైన విధంగా వినియోగించడానికి, సానుకూలంగా ఆలోచించడం వల్ల కలిగే గొప్ప ఆనందం, ఆరోగ్యం, సంపద ల నిధిని ఎలా దారితీస్తుందో వివ‌రిస్తుంది.

ప్రజలు ఆలోచించి అనుభూతి చెందుతున్నప్పుడు, వారు విశ్వానికి సంబంధిత ఫ్రీక్వెన్సీని పంపుతారని, అదే ఫ్రీక్వెన్సీ సంఘటనలు. పరిస్థితులను ఆకర్షిస్తుందని ఈ పుస్త‌కం పేర్కొంటుంది. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ సానుకూలంగా, సరైన పద్ధతిలో ఆలోచించగలిగితే, దానివల్ల సహజంగానే ఎల్లప్పుడూ ఉత్తమ ఫలితాలను పొందుతాడనే విష‌యాన్ని ఈ పుస్త‌కం స్ప‌ష్టం చేస్తుంది. అభిప్రాయాలకు శాస్త్రీయ ఆధారం లేదు. ప్రజ లు తమ కలలను, కోరికలను వ్యక్తీకరించడానికి సహాయపడే రెండు ప్రధాన శక్తివంతమైన ప్రక్రియలుగా దృశ్యరూపకత, కృతజ్ఞతలను ఈ పుస్తకం పేర్కొంది.