Begin typing your search above and press return to search.

టీడీపీని నిలబెట్టేది ఆ ఒక్క పధకమేనా ?

ఉన్న పెన్షన్లను ఏకంగా వేయి రూపాయలు చేశారు. ఆ వేయిని రెండు వేలు మూడు వేలు చేశారు.

By:  Satya P   |   2 Aug 2025 8:57 AM IST
టీడీపీని నిలబెట్టేది ఆ ఒక్క పధకమేనా ?
X

చంద్రబాబు పేరు చెబితే ఏ పధకం అయినా గుర్తుకు వస్తుందా అని వైసీపీ తరచూ ఎద్దేవా చేస్తూ ఉంటుంది. అంతే కాదు చంద్రబాబు సంక్షేమానికి వ్యతిరేకం అని ఆయన ఏదీ ఇవ్వరని కూడా అంటుంది. అయితే ఈ రాజకీయ విమర్శలు మాటెలా ఉన్నా ఏపీలో సామాజిక పెన్షన్లను భారీ ఎత్తున ఇవ్వడమే కాకుండా వాటి మొత్తాలని అధికం చేసిన ఘనత మాత్రం చంద్రబాబుదే అని చెప్పక తప్పదు. ఆయన సీఎం గా ఉండగానే 225 రూపాయలుగా

ఉన్న పెన్షన్లను ఏకంగా వేయి రూపాయలు చేశారు. ఆ వేయిని రెండు వేలు మూడు వేలు చేశారు. ప్రస్తుతం నాలుగు వేల రూపాయలు చేశారు. ఎన్నికల వేళకు ఏకంగా అయిదు వేలకు చేసి ఇస్తారని కూడా అంటున్నారు.

బ్రాండ్ అంబాసిడర్ గా :

సామాజిక పెన్షన్లు అన్నవి బాబు కొత్తగా ఇస్తున్నవి కాకపోవచ్చు. కానీ ఆ మొత్తాలను పెంచి మారిన కాలానికి ఆర్ధికంగా వృద్ధులు నిలదొక్కుకునేలా ఎప్పటికప్పుడు సమానంగా పెంచి ఇస్తున్న ఘనత మాత్రం బాబుదే అని చెప్పాలి. దేశంలో ఎక్కడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే లేదు. అది కచ్చితంగా బాబు క్రెడిట్ ఖాతాలోనే పోతుంది. అంతే కాదు ఏకంగా 65 లక్షల మందికి పెన్షన్లు బాబు ఇస్తున్నారు.

ప్రతీ ఏడుగురిలో ఒకరికి :

ఏపీలో ఉన్న జనాభాలో ప్రతీ ఏడుగురిలో ఒకరికి ఈ సామాజిక పెన్షన్లు ఇస్తూ వారికి ప్రతీ నెలా ఒకటవ తేదీన ఠంచనుగా బాబు ఇస్తున్నారు. అలా పండుటాకుల జీవితాలను గౌరవంగా గర్వంగా చేసిన ఖ్యాతి అచ్చంగా బాబుకు మాత్రమే చెందుతుంది అని చెప్పాలి. ఈ సామాజిక పెన్షన్లలో కిడ్నీ రోగులకు పదిహేను వేల దాకా దివ్యాంగులకు ఆరు వేల రూపాయల దాకా ఇస్తున్నారు. ఈ పెన్షన్లు అందుకుంటున్న వారంతా మాత్రం కూటమి పాలన పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. బాబు తమకు పెన్షన్ ఎపుడూ పెంచుతున్నారని అంతే కాకుండా ఠంచనుగా వేళకు ఇస్తున్నారు అన్న కృతజ్ఞతా భావం వారిలో ఉంది.

అర్హులందరికీ పెన్షన్లు :

ఇక సామాజిక పెన్షన్ కూడా ఎవరు అర్హులు అయినా వారికి కచ్చితంగా ఇస్తున్నారు. అర్హత ఉండి రాని వారి ఎపుడైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అదే విధంగా భర్త చనిపోతే వితంతువులకు పెన్షన్ ఇస్తున్నారు. ఇక ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా మరుసటి నెలలో ఆ మొత్తాన్ని కలిపి ఇస్తున్నారు. ఇలా ఎంటీయార్ భరోసా పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు ఏపీలో సరికొత్త విప్లవాన్నే తీసుకుని వచ్చాయని అంటున్నారు.

అతి పెద్ద ధీమా అదే :

ఏపీలో 65 లక్షల మంది సామాజిక పెన్షన్ దారులు ఉన్నారు. వారిలో అత్యధిక శాతం టీడీపీ వైపే ఉంటారు. ఇక వారి కుటుంబ సభ్యులు కూడా సగానికి సగం సానుకూలంగా ఉన్న అతి పెద్ద ఓటు బ్యాంక్ గా ఇది మారుతుందని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది అందుకే చంద్రబాబు గత 15 నెలలుగా ప్రతీ నెలా ఒకటవ తేదీన ఎన్ని పనులు ఉన్నా కూడా అవన్నీ ఆపుకుని మరీ పేదింటికి వెళ్తున్నారు. వారికి పెన్షన్ అందిస్తున్నారు.

వారి కళ్ళలో వెలుగు స్వయంగా చూస్తున్నారు. చుట్టుపక్కన పేదలతో మాట్లాడుతున్నారు. ఆటో నడిపేవారు చర్మకారులు చేతి వృత్తుల వారూ ఇలా అందరితోనూ బాబు కలసిపోతున్నారు. తాను పేదల పక్షం అని ఆయన పదే పదే చెప్పుకుంటున్నారు. పధకం ఇస్తున్నారు కాబట్టి ప్రచారం చేసుకోవడంలో తప్పు లేదు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే టీడీపీ సూపర్ సిక్స్ పధకాలు ఎక్కడ ఏది గురి తప్పినా పెన్షన్ పధకం మాత్రం ఆ పార్టీకి శ్రీరామ రక్షగా నిలుస్తుందని అంటున్నారు.