Begin typing your search above and press return to search.

బీహార్ ఎన్నికలపైన బాబు సంచలన జోస్యం

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎంతటి ప్రతిష్టాత్మకమైనవి అన్నది తెలిసిందే.

By:  Satya P   |   25 Oct 2025 3:28 PM IST
బీహార్ ఎన్నికలపైన బాబు సంచలన జోస్యం
X

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎంతటి ప్రతిష్టాత్మకమైనవి అన్నది తెలిసిందే. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం నడుస్తోంది అంటే బీహార్ లోని జేడీయూ ఎంపీల మద్దతు కూడా ఉంది. అలాంటి జేడీయూ పార్టీ అధినేత అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కలసి బీజేపీ ఈ ఎన్నికల్లో తలపడుతోంది. మరోసారి బీహార్ ని గెలవాలి. అదే నితీష్ కి బీజేపీకి ఎంతో క్షేమం. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు. ఆయన సమస్తిపూర్ తో మొదలెట్టి ఎన్డీయే తరఫున ఎన్నికల ప్రచారాన్ని తీవ్ర స్థాయిలోకి తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నారు.

పోటా పోటీగానే :

బీహార్ లో ఎవరు ఏమిటి అంటే ఇప్పుడున్న రాజకీయ వాతావరణం చూస్తే ఢీ అంటే ఢీ కొడుతున్న నేపధ్యం ఉంది. గత ఎన్నికల్లోనే ఎన్డీయే మహా ఘట్ బంధన్ రెండూ హోరా హోరీ తలపడ్డాయి. ఫలితాలు చూసినా అదే కనిపించింది. ఎన్డీయేకు 125 దాకా సీట్లు వస్తే ఘట్ బంధన్ కి 110 దాకా సీట్లు దక్కాయి. రెండింటి మధ్య ఓట్ల సీట్ల తేడా కూడా తక్కువగానే ఉంది. మరి అయిదేళ్ళ పాటు ఎన్డీయే పాలనను జనాలు చూశారు. సహజంగానే యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. దాంతో ఈసారి తమకు అధికారం దక్కుతుందని ఘట్ బంధన్ భావిస్తోంది. ఈసారి చూసినా రెండు కూటముల మధ్య ఓట్ల తేడా తక్కువగానే ఉందని ప్రీ పోల్ సర్వేలు చెబుతున్నాయి.

గెలిచేది ఎవరంటే :

ఇదిలా ఉంటే టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు బీహార్ ఎన్నికల మీద తనదైన శైలిలో జోస్యం చెప్పారు. అది ఆసక్తిగానూ సంచలనంగానూ ఉంది. బీహార్ ఎన్నికల్లో గెలిచేది ఎన్డీయే కూటమి అని బాబు స్పష్టం చేశారు. మరోసారి ఎన్డీయే గెలిచి ప్రజలకు మంచి పాలన అందిస్తుందని బాబు ఆశాభావంగా చెప్పారు. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. భీకర పోరు సాగుతోంది. బాబు మాత్రం ఎన్డీయే గెలుపుకుని అలా ముందే డిక్లేర్ చేశారు అన్న మాట. ఆయన ఎన్డీయేలో కీలకంగా ఉన్న మిత్రుడు అన్నది తెలిసిందే.

రంగంలోకి బాబు :

ఇక బీహార్ లో ఎన్డీయే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. అవసరం అనుకుంటే తాను కూడా బీహార్ కి వెళ్లి ప్రచారం చేస్తాను అని చంద్రబాబు చెప్పారు. బీహార్ లో ఎన్డీయే గెలుపు కోసం తన వంతుగా జనంలోకి వెళ్తాను అని ఆయన అంటున్నారు. రానున్న రోజులలో కేంద్ర మంత్రుల నుంచి కీలక నేతలు అంతా బీహార్ లో ఎన్నికల ప్రచారానికి దిగబోతున్నారు. ఇక ఎన్డీయే మిత్రులలో అతి ముఖుడైన చంద్రబాబు కూడా ప్రచారానికి వెళ్తారు అని అంటున్నారు. మరి బాబు ప్రచారం చేస్తే ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఎన్డీయే పక్షాల తరఫున ఎన్నికల ప్రచారం చేయడం తెలుగు రాజకీయ నేతలకు కొత్త కాదు, గతంలో చంద్రబాబు పవన్ అలా ప్రచారం చేసినవారే. ఇపుడు చంద్రబాబు తానుగానే ప్రతిపాదించారు సో బీజేపీ పెద్దలు కూడా ఆయనను రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నారని అనుకోవాల్సిందే.