అలవోకగా ఆసనాలు.. అలుపెరుగని ఫిట్‌నెస్ : 76 ఏళ్ల వయసులో అదరగొట్టిన చంద్రబాబు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన 'యోగాంధ్ర' వేడుకలు ఘనంగా నిర్వహించారు.
By: Tupaki Political Desk | 21 Jun 2026 2:38 PM ISTఅంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన 'యోగాంధ్ర' వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అలవోకగా ఆసనాలు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 76 ఏళ్ల వయసులో కూడా ఆయన ప్రదర్శించిన ఉత్సాహం ప్రతి ఒక్కరినీ ఆకట్టుంది. వయసులో ఆయన కంటే చాలా చిన్నవారు కూడా కొన్ని యోగసనాలు వేయడంలో ఇబ్బంది పడ్డారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎటువంటి తడబాటు లేకుండా ఆసనాలు వేసి అదరగొట్టారని అంటున్నారు.
వయసు కేవలం అంకె మాత్రమే..
యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు వేదికపై ఎంతో సులభంగా, అలవోకగా కఠినమైన యోగాసనాలను వేశారు. సాధారణంగా ఈ వయసులో చాలామంది శారీరక ఇబ్బందులతో సతమతమవుతుంటారు. కానీ చంద్రబాబు మాత్రం ఎంతో చురుకుగా, యువకుడిలా కనిపించడం విశేషం. ఆయన చేస్తున్న స్ట్రెచెస్, యోగా భంగిమలు చూస్తుంటే ఆయన ఎంతటి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తున్నారో అర్థమవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం
చంద్రబాబు చురుకుదనానికి ఆయన పాటిస్తున్న ఆరోగ్య నియమాలే కారణమని చెప్పవచ్చు. నిత్యం ఎంతో బిజీగా ఉండే రాజకీయ బాధ్యతల మధ్య, ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పనిచేసే ఆయన, తన ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ రాజీ పడరని చెబుతుంటారు. సరైన ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణతో కూడిన వ్యాయామం, యోగా పట్ల ఆయనకున్న అంకితభావమే ఆయనను ఇంత ఫిట్‌గా ఉంచుతున్నాయని చెబుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా నిరంతరం చురుకుగా ఉంటూ, దేశంలోని రాజకీయ నాయకుల్లో ఒక అత్యుత్తమ 'ఫిటెస్ట్' లీడర్‌గా ఆయన నిలుస్తున్నారు.
యోగాంధ్ర వేడుకల విశేషాలు
ఈ భారీ యోగా కార్యక్రమానికి వేలాది మంది ఫిట్‌నెస్ ప్రేమికులు తరలివచ్చారు. దాదాపు 7,000 మందికి పైగా యోగాభ్యాసం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రితో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు కూడా పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ వేడుకల ద్వారా ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలిపై గొప్ప సందేశాన్ని అందించారు. నిజంగా, చంద్రబాబు ఫిట్‌నెస్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అంటూ అభినందిస్తున్నారు. క్రమశిక్షణ ఉంటే 76 ఏళ్ల వయసులో కూడా యవ్వనంతో, ఉత్సాహంతో జీవించవచ్చని ఆయన నిరూపించారని ఆరోగ్యాభిలాషులు వ్యాఖ్యానిస్తున్నారు.
