వచ్చే ఎన్నికల్లోనూ 'కూటమి' అదే వ్యూహం..!
తాజాగా సీఎం చంద్రబాబు పార్టీ నాయకులతో భేటీ అయిన నేపథ్యంలో వైసీపీ వ్యవ హారాలు కూడా చర్చకు వచ్చాయి. తరచుగా జగన్.. తామే అధికారంలోకి వచ్చేస్తామని చెబుతున్నారు.
By: Garuda Media | 8 Dec 2025 3:00 AM ISTవచ్చే ఎన్నికల్లోనూ కూటమి బలమైన వ్యూహంతోనే ముందుకు సాగాలని నిర్ణయించుకుందా? గత ఎన్ని కల్లో ఎలా అయితే.. ప్రచార అస్త్రాన్ని ప్రయోగించారో.. వచ్చే ఎన్నికల్లోనూ అదే విధంగా ప్రచారం చేయా లని భావిస్తున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు పార్టీ నాయకులతో భేటీ అయిన నేపథ్యంలో వైసీపీ వ్యవ హారాలు కూడా చర్చకు వచ్చాయి. తరచుగా జగన్.. తామే అధికారంలోకి వచ్చేస్తామని చెబుతున్నారు.
ఇదే విషయాన్ని టీడీపీ నాయకులు సీఎం చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. వైసీపీ ఏదో వ్యూహంతో ఉంద ని.. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని పదే పదే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ``మనం మరింత పక్కా వ్యూహంతో వెళ్తున్నాం. గత ఎన్నికల్లో ఎలా అయితే.. ప్రచారం జరిగిందో ఈ సారి అంతకుమించిన ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేస్తాం. మీరేమీ బెంగ పడాల్సిన అవసరం లేదు`` అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
అదేసమయంలో ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉందని.. దీని గురించి ఆలోచించాల్సిన అవస రం లేదని.. ముందు ప్రజల మధ్యకు వెళ్తే ఫలితం సానుకూలంగానే ఉంటుందని కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లోనే కాదు.. తదుపరి ఎన్నికల్లోనూ మనదే విజయం అనిఆయన తేల్చి చెప్పారు. దీనిపై ఎవరూ ఎక్కువగా ఆలోచించవద్దని.. ముందుగా ప్రజలను కలుసుకుని.. ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని కూడా చెప్పారు.
గత ఎన్నికల సమయంలో..
గత ఎన్నికల సమయంలో వైసీపీని బలంగా ఎదుర్కొనేందుకు బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి కట్టాయి. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే కూటమి కొనసాగుతుంది. ఇక, గత ఎన్నికల్లో ప్రవాసాంధ్రుల ద్వారా ప్రచారం హోరెత్తించారు. దీంతో గ్రామ గ్రామాన ఎన్నికల పోల్ మేనేజ్‌మెంట్ జోరుగా సాగింది. ఫలితంగా.. వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది. ఇదే వ్యూహాన్ని వచ్చే ఎన్నికల్లోనూ.. అనుసరించనున్నట్టు చంద్రబాబు పరోక్షంగా హింటిచ్చారు.
