Begin typing your search above and press return to search.

బెంగుళూరు ప్యాలెస్ లో, ఇడుపులపాయలో కూర్చొంటే రాజధానా...?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

By:  Satya P   |   10 Jan 2026 9:00 AM IST
బెంగుళూరు ప్యాలెస్ లో, ఇడుపులపాయలో కూర్చొంటే రాజధానా...?
X

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంచి చేయాలని మేము చూస్తూంటే ముంచేసే కుట్రలు చేస్తారా అని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి వాదం ఓవైపు ఉంటే అరాచక వాదం మరోవైపు ఉందని బాబు అన్నారు. వైసీపీ హయాంలో ఏపీకి ఐదేళ్లు రాజధాని లేకుండా చేశారని ఇపుడు అసలు రాజధాని పదమే రాజ్యాంగంలో లేదంటున్నారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదేమి వాదన :

బెంగుళూరు ప్యాలెస్ లోనూ, ఇడుపులపాయలోనే కూర్చొంటే అదే రాజధానా అని చంద్రబాబు ప్రశ్నించారు. అసలు అది ఒక విధానమేనా అని ఆయన నిలదీశారు. మొన్నటి వరకూ వారి అధికారంలో ఉన్నపుడు రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడారని, మూడు రాజధానులని అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. అయితే ప్రజలు గత ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పినా అర్థం కావటం లేదని అన్నారు. ఆఖరికి ఎంతదాకా వెళ్ళారూ అంటే రాజ్యాంగంలో రాజధాని అని ఎక్కడా పేరు లేదని చెబుతున్నారని బాబు ఫైర్ అయ్యారు. తాను ఎక్కడ ఉంటే అదే రాజధాని అని జగన్ చెప్పడం మీద ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏమిటీ చాదస్తం ఎవరికీ అసలు అర్ధం కావటం లేదని సెటైర్లు వేశారు. అమరావతి రాజధానిని నది పక్కన రాజధాని కడుతున్నారని జగన్ మాట్లాడుతున్నారని, నిజానికి చూస్తే విజయవాడ, రాజమండ్రి, విశాఖ, లండన్, చెన్నై, ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు ఎక్కడున్నాయని ఆయన ప్రశ్నించారు. ఏ మాత్రం ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి ఇపుడు రాజకీయాలు చేస్తున్నారని జగన్ మీద విరుచుకుపడ్డారు.

భోగాపురం పీపీపీ నచ్చిందా :

మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం మీద నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతూంటే విమర్సిస్తున్న వారు భోగాపురం పీపీపీ విధానంలో నిర్మాణం అయితే తన ఖాతాలో ఆ క్రెడిట్ ని వేసుకుంటున్నారని బాబు ఎద్దేవా చేశారు. పీపీపీ మెడికల్ కాలేజీలఓఇన మాత్రం అందరినీ బెదిరిస్తున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోని రహదారులు కూడా పీపీపీల ద్వారానే వస్తున్నాయని ఆయన చెప్పారు భోగాపురం ఎయిర్ పోర్టును మేం పూర్తి చేస్తే ఆ గొప్పదనం తనదే అని జగన్ అంటున్నారని బాబు మండిపడ్డారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి జనాలలో పేరు వస్తుంటే ఏ మాత్రం భరించలేకనే ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని జగన్ మీద విమర్శలు గుప్పించారు. వీరికి ఎలా ఉంది అంటే భోగాపురం పీపీపీ అయితే అది ముద్దు కానీ పీపీపీ కింద మెడికల్ కాలేజీలు కడితే వద్దంటున్నారని ఇదేమి తత్వమని ముఖ్యమంత్రి విమర్శించారు.