Begin typing your search above and press return to search.

ఫార్వార్డ్ లుకింగ్ బడ్జెట్: చంద్ర‌బాబు

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జట్‌పై ఏపీ సీఎం చంద్ర‌బాబు రియాక్ట్ అయ్యారు.

By:  Garuda Media   |   2 Feb 2026 10:12 AM IST
ఫార్వార్డ్ లుకింగ్ బడ్జెట్: చంద్ర‌బాబు
X

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జట్‌పై ఏపీ సీఎం చంద్ర‌బాబు రియాక్ట్ అయ్యారు. ఈ బ‌డ్జెట్‌ను ఆయ‌న `ఫార్వార్డ్ లుకింగ్ బడ్జెట్`గా అభివ‌ర్ణించారు. ఈ కేంద్ర బడ్జెట్టును స్వాగతిస్తున్నాన‌ని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను అభినందిస్తున్నానని తెలిపారు. గ‌త రెండు రోజులుగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌టిస్తు న్న చంద్ర‌బాబు.. తాజాగా బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని వీక్షించారు. అనంత‌రం.. ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న చేశారు. విజ‌న్‌-2047 సాకారానికి ప్ర‌స్తుత కేంద్ర బ‌డ్జెట్ మ‌రింత ఊతం ఇస్తుంద‌ని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన అంశాల్లో మరింతగా దూకుడుగా వెళ్లేందుకు ఈ బడ్జెట్టు సహకరించేలా ఉందని సీఎం పేర్కొన్నా రు. ముఖ్యంగా రాష్ట్రం అమలు చేస్తున్న `ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్` విధానానికి ఈ బడ్జెట్ మరింత సహకరించేలా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చిన్న‌, సూక్ష్మ‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌(ఎంఎస్ఎంఈ) అభివృద్దిపై ఎక్కుడా దృష్టి పెట్టింద‌ని.. తాజా బ‌డ్జెట్‌లో ఈ రంగానికి నిధులు కేటాయించ‌డం ద్వారా మేలు జ‌ర‌గుతుంద‌ని పేర్కొన్నారు. వీటిని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉందన్నారు.

మహిళలు, రైతులు, యువత సాధికారిత సాధించేలా ప్రస్తుత బడ్జెట్ ఉందని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ``2047 వికసిత్ భారత్ డెవలప్‌డ్ ఎకానమీగా మారేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా బడ్జెట్ ప్రవేశపెట్టారు.`` అని చంద్ర‌బాబు కొనియాడారు. ``దిశ అండ్ గతి ఉపకరిచేలా బడ్జెట్ ఉంది.`` అని పేర్కొన్నారు. ఏఐ సహా వివిధ టెక్నాలజీలు, నెక్స్ట్ లెవల్ ఆఫ్ రిఫార్మ్స్ కు వెళ్తాయ‌ని తెలిపారు. పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రులు, `వన్ గ్రిడ్ - వ‌న్‌ నేషన్` దిశగా బడ్జెట్ ఉందన్నారు.

స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించార‌ని.. ఇది మెరుగైన జీవన ప్రమాణాలు, ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం దోహదం చేస్తుంద‌ని సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. హైదరాబాద్-బెంగుళూరు, హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ ద్వారా రాష్ట్రానికి ఉపయోగ ప‌డుతుంద‌ని తెలిపారు. తిరుపతి, అమరావతి వంటి ప్రాంతాలు ఈ హైస్పీడ్ కారిడార్లలో కవర్ అవుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా బెంగుళూరు- చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ వల్ల పలమనేరు, చిత్తూరు, తదితర ప్రాంతాలు కవర్ అవుతాయని.. ఇక్క‌డి వారికి మెరుగైన ర‌వాణా వ్య‌వ‌స్థ అందుబాటులోకి వ‌స్తుంద‌ని వివ‌రించారు.

ఈ మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏపీలోని వివిధ ప్రాంతాలను కవర్ చేస్తాయని తెలిపారు. హైదరాబాద్, అమరావతి, బెంగుళూ రు, చెన్నై లాంటి నగరాలు అన్ని అనుసంధానం అవుతాయ‌ని సీఎం చంద్ర‌బాబు వివ‌రించారు. ఇక‌, డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్ లో ఏపీ ఉండ‌డం శుభ‌సూచ‌క‌మ‌ని పేర్కొన్నారు. అత్యంత విలువైన భార ఖనిజాలు వెలికి తీసి క్రిటికల్ ఎలక్ట్రానిక్స్ తయారీకి ఉపకరించే అవకాశం ఉందన్నారు. ఐఎస్ఎం 2.0 ద్వారా సెమీ కండక్టర్ రంగానికి రూ.40 వేల కోట్లు కేటాయించార‌ని.. త‌ద్వారా ఈ ప‌రిశ్ర‌మ అభివృద్ధి చెందుతుంద‌న్నారు. టెక్స్ టైల్ సెక్టార్ కు కూడా ఊతమిచ్చారని, ఏపీకి ఈ అంశం చాలా ఉపకరిస్తుందని చంద్ర‌బాబు తెలిపారు.