Begin typing your search above and press return to search.

బాబు ఒకే ఒక్క ప్రకటన...ఎందుకంత రచ్చ ?

దేశంలో ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్లలో చంద్రబాబు ఒకరు. ఆయన అరుదైన నాయకుడు. ఎంతో దార్శనికత ఉన్న వారు.

By:  Satya P   |   19 May 2026 12:00 AM IST
బాబు ఒకే ఒక్క ప్రకటన...ఎందుకంత రచ్చ ?
X

దేశంలో ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్లలో చంద్రబాబు ఒకరు. ఆయన అరుదైన నాయకుడు. ఎంతో దార్శనికత ఉన్న వారు. అన్ని అంశాల మీద ఆయన స్పందిస్తారు. ఒక విధంగా బాబు లాంటి ముందు చూపు ఉన్న నేత ఏపీలో ఉండడం నాయకత్వం వహించడం గొప్ప విషయంగానే చూడాలి. ఆయనలో కేవలం పరిపాలకుడు మాత్రమే లేడు. కుటుంబ పెద్ద కూడా ఉంటారు. ఆయన అనుభవంతో దార్శనికతతో చెప్పే అనేక విషయాలను సమాజం పట్టించుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. పాతికేళ్ల క్రితం బాబు చెప్పిన ఎన్నో విషయాలు ఈ రోజున జరుగుతున్నాయి అంటేనే ఆయన విజనరీని ఊహించుకోవచ్చు.

ఇంతకీ ఏం చెప్పారు :

ఇక చంద్రబాబు ఏం చెప్పారు అంటే ఎక్కువ మంది పిల్లల్ని కనమన్నారు. దేశంలో చూసినా జాతీయస్థాయి జనాభా రేటు చూసినా ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువ స్థాయిలో ఉంది అన్నది వాస్తవం. జనాభా రేటు చాలా దారుణంగా పడిపోయింది అని ఆందోళన సామాజికవేత్తలు లో సైతం ఉంది. అయితే ఈ విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తూ వస్తున్నారు. ఒక ఇంటికి పెద్దగా, సమాజానికి పెద్ద మనిషి లాగా, ఒక పెద్దాయన లాగా బాబు ఇచ్చే ఈ సలహాలు సానుకూల దృక్పథంతో తీసుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉంది. కానీ దానిమీద వ్యంగ్యోక్తులు, ఘాటు విమర్శలు సెటైర్లు ఇవన్నీ అంతా వినిపిస్తున్నారు. రచ్చ రచ్చ చేస్తున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది బాబు చేసిన తప్పేంటి ఇది చర్చగా ఉంది.

వృద్ధ తరం వస్తోంది :

డెబ్బై దశకంలో ఒక బలమైన నినాదంగా జనాభా నియంత్రణ ఉంది. అలా ఒక దశలో దేశమంతా అది బాగా జరిగింది. దక్షిణాది రాష్ట్రాలు అయితే జనాభా నియంత్రణను ఇంకా బాగా చేశాయి. ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో చాలా ఎక్కువగా చేసి దారుణంగా చేయడంతో జనాభా పెరుగుదల రేటు పెద్ద ఎత్తున పడిపోయింది. ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్ జనాభాలో అధిక శాతం వృద్ధులు కనిపిస్తున్నారు. పనిచేసే సామర్థ్యం కలిగిన యువత తగ్గిపోతోంది. మరి ఇదే ట్రెండ్ కొనసాగితే ఆంధ్రప్రదేశ్ వృద్ధ ఆంధ్ర గా మారడం ఖాయం. దాని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగానూ సామాజికపరంగా రాజకీయంగా అన్ని విధాలుగా బాగా నష్టపోతుంది. అందుకే చంద్రబాబు ముగ్గురిని కంటే ముప్పై వేలు, నలుగురిని కంటే నలభై వేలు ప్రోత్సాహకాలను ప్రకటించారు.

పాలకులు ఎలా చెబుతారు :

శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి ఈ విధాన ప్రకటన చేశారు. అయితే దీని మీద వైసీపీ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే చంద్రబాబు కుటుంబంలో ఒకర్ని మాత్రమే కంటున్నారని ఎత్తి చూపారు. సంపన్న వర్గాలు ఎక్కువ మంది జనాభాను పెంచుకున్నా తప్పులేదు కానీ పేదవారు ఏమవుతారని ప్రశ్నిస్తున్నారు. అయితే చంద్రబాబు ఏ ఒక్క వర్గాన్ని ఉద్దేశించి చెప్పలేదు. అందరికీ ఈ సందేశం అందించారు. ఎక్కువ పిల్లలు ఉండాల్సిన అవసరం ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక దీని మీద జాతీయ స్థాయిలో కూడా కామెంట్స్ వస్తున్నారు. దేశంలో తొలి ఐపీఎస్ అధికారిణి అయిన కిరణ్ బేడీ కూడా మహిళల విషయంలో ఎంతమంది పిల్లలు కనాలని కోరే హక్కు ఎవరికీ లేదు అని అంటున్నారు. మహిళల ఆరోగ్యం భద్రత ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయాలని చెప్తున్నారు. ఎక్కువ మంది పిల్లలు కనమని పాలకులు ఎలా చెబుతారు అని ఆమె ప్రశ్నిస్తున్నారు. మహిళలంటే పిల్లలు కనడమేనా పని, వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొంది అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా అని కూడా కిరణ్ బేడీ అంటున్నారు.

పాజిటివ్ గా తీసుకోవాలి :

అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పింది కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయిన విషయం కాదు, భారత దేశానికి ఆ మాటకు వస్తే ప్రపంచానికి సంబంధించిన అంశం. జనాభా బాగా తగ్గిపోతే ఈ ప్రపంచం ఏమవుతుంది అన్నది అంతా ఆలోచించాలి. వృద్ధులతో దేశం ప్రపంచం ఎలా ముందుకు సాగుతుంది అన్నది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంద్. అందుకే చంద్రబాబు చెప్పింది అక్షరాల కరెక్ట్ అని సామాజిక వేత్తలు అంటున్నారు. జనాభా పెరుగుదల అన్నది అతి ముఖ్యమైన అంశమని పాజిటివ్ గా ప్రతీ ఒక్కరూ రియాక్ట్ అయితే అందరికీ మంచిదే అని అంటున్నారు. నిజానికి సామాజిక వేత్తలు, మేధావులు ఈ సమస్యను ఎత్తుకోవాలి కానీ అటువంటి ప్రయత్నాలు పెద్దగా లేవు కాబట్టే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఉన్న నాయకుడిగా భావితరాల గురించి ఆలోచించి చంద్రబాబు ఈ ప్రకటన చేశారని అంటున్నారు ఇప్పటికైనా ఇందులో సానుకూల సందేశాన్ని తీసుకోవాలని సందేహాలను పక్కన పెట్టాలని అంతా కోరుతున్నారు.