పాలన చూడండి.. పెట్టుబడులు పెట్టండి: రోడ్ షోలో చంద్రబాబు
ఇక, విశాఖ సమీపంలో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు కాబోతోందని, సెమీకండెక్టర్ రంగంలో పెట్టుబడులకు అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు.
By: Garuda Media | 17 Jun 2026 2:53 PM ISTసింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు.. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రెండో రోజు పర్యటనను పూర్తి చేశారు. సింగ పూర్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన.. పూర్తిగా రెండో రోజు పెట్టుబడులపైనే దృష్టి పెట్టారు. ఈ క్రమంలో మంగళవా రం ఉదయం నుంచి పెట్టుబడుల వేట కొనసాగించారు. పలువురు పెట్టుబడి దారులు, పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు. అనంతరం.. మంగళవారం సాయంత్రం.. సింగపూర్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ పారిశ్రామిక వేత్తలు, ఆవిష్కర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ బిజినెస్ రోడ్‌షోలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ప్రస్తుతం అనుమతులు వాయు వేగంతో ఇస్తున్నామన్నారు. ప్రత్యేకంగా డెస్కులు ఏర్పాటు చేశామని తెలిపారు. మరీ ముఖ్యంగా రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను చంద్రబాబు వివరించారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులను అమరావతికి ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ ఏడాదిలోనే క్వాంటం కంప్యూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అవుతున్నాయన్నారు. దీనిలో పెట్టుబడులు పెట్టేందుకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు.
ఇక, విశాఖ సమీపంలో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు కాబోతోందని, సెమీకండెక్టర్ రంగంలో పెట్టుబడులకు అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. అమరావతిలో ఆర్థిక నగరాన్ని అభివృద్ది చేస్తున్నట్టు పేర్కొన్నారు. అదేసమయంలో ఆక్వా, వ్యవసా యం, నేచర్ ఫార్మింగ్, పర్యాటకం.. సహా అన్ని రంగాల్లోనూ అపారమైన పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు . ముందు పారిశ్రామిక వేత్తలు ఏపీకి రావాలని.. ఇక్కడి పరిస్థితులను ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతికి వచ్చి.. పాలన తీరును, అనుమతులు ఇస్తున్న విధానాలను కూడా పరిశీలించాలని సూచించారు. అనంతరం.. పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ముగిసిన పర్యటన..
సీఎం చంద్రబాబు రెండు రోజుల పర్యటన మంగళవారంతో ముగిసింది. పెట్టుబడుల ఆకర్షణతో పాటు సింగపూర్ ప్రభుత్వంతో చర్చల నిమిత్తం అక్కడకు వెళ్లిన చంద్రబాబు.. సింగపూర్ ప్రతినిధులతోపాటు.. ప్రధానితోనూ భేటీ అయ్యారు. అమరావతి రాజధాని నిర్మాణంలో సహకారాన్ని కోరారు. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణం, ఫార్మాల, ప్రకృతి సేద్యం, రషహదారుల విస్తరణ, భవనాల నిర్మాణంలో సింగపూర్ ప్రణాళికలపై ఆయన చర్చించారు. చివరి రోజు.. మాత్రం పూర్తిగా పెట్టుబడులను ఆహ్వానించేందుకు శ్రమించారు.
