బాబు క్యాజువల్ గా అన్నా అతి పెద్ద వైరల్ అయిందే ?
అసలు విషయం ఏంటి అంటే బాబు పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి రాజకీయ ప్రత్యర్ధులు ఎపుడూ విమర్శలు చేస్తూ ఉంటారు.
By: Satya P | 6 Feb 2026 6:00 AM ISTచంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి లడ్డూల కల్తీ విషయం మీద మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఆయన ఒక్కసారిగా హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ అనేక అంశాలను ప్రస్తావించారు. మన పూర్వీకుల వారసత్వం ఏమిటి మనకు ఏమి నేర్పించారు అని బాబు మాట్లాడుతూ పెళ్ళిళ్లు అన్నవి స్వర్గంలో జరుగుతాయని భావిస్తామని అది హిందువుల నమ్మకం అన్నారు. హిందూ మతంలో విడాకులు అన్నది లేదని కూడా చెప్పారు. భార్యాభర్తలు పిల్లలు ఒక కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఉండాలన్నది హిందూ మతం చెబుతోంది అన్నారు. తాను అంతర్జాతీయ వేదిక మీద కూడా భారతీయ హిందూ ధర్మం గురించి గొప్పగా చెబుతాను అని బాబు చెప్పారు. ఇంకా చాలా అంశాలు ఆయన హిందూత్వం మీద చెప్పారు కానీ పెళ్ళిళ్ళూ విడాకులు అంటూ బాబు చెప్పిన ఈ మాటలతో షార్ట్ కట్ చేసి ఆ వీడియో బైట్ ని సోషల్ మీడియాలోకి కొందరు వదిలారు. దాంతో అది పెద్ద వైరల్ అవుతోంది.
మ్యాటర్ ఏంటో :
అసలు విషయం ఏంటి అంటే బాబు పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి రాజకీయ ప్రత్యర్ధులు ఎపుడూ విమర్శలు చేస్తూ ఉంటారు. ఇపుడు అనుకోకుండా బాబు మాట్లాడినా హిందూ మతంలో విడాకులు అన్నవి లేవని ఆయన చెప్పారు. దాంతో ఈ మాటలను పవన్ కి అన్వయించి మరీ వైరల్ చేస్తున్నారు. పవన్ సనాతని కాదని అంటూ వైరల్ చేస్తున్నారు.
గతంలో సీపీఐ నారాయణ :
ఇక సీపీఐ నారాయణ కూడా గతంలో పవన్ మీద ఈ తరహా ఆరోపణలే చేశారు ఆయన మాట్లాడుతూ హిందూ మతంలో విడాకులే లేవని పవన్ సనాతన ధర్మం గురించి చెబుతున్నారు, ఆయన సనాతనీ ఎలా అవుతారు అని ప్రశ్నించారు. చంద్రబాబు మాదిరిగా సుదీర్ఘంగా అయితే నారాయణ మాట్లాడలేదు కానీ హిందూ మతం అని అంటున్న పవన్ అందులో విషయాలు ఏమి చెబుతున్నాయో చూడాలని అన్నారు.
బాబు చెప్పినది వేరు :
అయితే చంద్రబాబు హిందూ మతం గొప్పదనం ఇదని చెప్పారు కానీ ఎవరినీ ఆయన అనలేదని అంటున్నారు. కానీ ఇది చాలు కదా అన్నట్లుగా వైరల్ చేస్తున్నారు. బాబు మాటలను పవన్ తో ముడిపెట్టి హిందూ మతం గురించి చెప్పే వారు ఎలా ఉండాలో చూసుకోమని సెటైర్లు పేలుస్తున్నారు. మొత్తం మీద చూస్తే రామాయణంలో పిడకల వేట అన్నట్లుగా అసలు విషయం లడ్డూ అయితే చంద్రబాబు హిందూమతం గురించి మాటలను ట్రోల్ చేస్తూ విడాకులు పవన్ అంటూ వైరల్ చేస్తున్నారు. మరి దీని మీద కూటమి నేతలు ఎలా రియాక్టు అవుతారో చూడాల్సి ఉంది.
