Begin typing your search above and press return to search.

పీఎం కోసం.. సీఎం.. మ‌న‌సు పెట్టేస్తున్నారుగా.. !

ఈ క్రమంలో ప్రధాన మంత్రి పర్యటనల కోసం సీఎం చంద్రబాబు దాదాపు 4 -5 రోజుల నుంచి కసరత్తు చేస్తున్నారని ఆయన చాలా సమయం వెచ్చిస్తున్నారని కూడా అంటున్నారు.

By:  Garuda Media   |   17 Oct 2025 9:43 AM IST
పీఎం కోసం.. సీఎం.. మ‌న‌సు పెట్టేస్తున్నారుగా.. !
X

`పీఎం కోసం సీఎం` ఈ మాట టిడిపి నాయకుల్లో బలంగా వినిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఏపీకి తీసుకురావడంతో పాటు ఆయన కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారు. అంతేకాదు పూర్తిస్థాయి షెడ్యూల్ కూడా ఆయన ప్రకటిస్తున్నారు. ఒకప్పుడు ప్రధాన మంత్రులు వస్తే ఆ రోజుతో ఆ కార్యక్రమం అనంతరం వేరే కార్యక్రమాలకు వెళ్లేవారు. కానీ, ఇటీవల కాలంలో ప్రధానమంత్రి వెంటే ఉంటూ ప్రధానమంత్రి కార్యక్రమం అయిన తర్వాత అదే కార్యక్రమం పై సమీక్షలు చేయటం అధికారులతో చర్చించటం వంటివి చేస్తున్నారు.

గతంలో యోగాంధ్రకు ఒకసారి, అదేవిధంగా అమరావతి రాజధాని పనుల పునర్నిర్మాణం కోసం మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు. ఇప్పుడు నాలుగోసారి కర్నూలుకు వచ్చారు. అయితే ఈ పర్యటనలు అన్నీ కూడా ప్రధానమంత్రి ప్రతిష్టను కాపాడేందుకు, అదే విధంగా ఆయన స్థాయిని మరింత పెంచేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నార‌న్న‌ది టిడిపి నాయకులు చెబుతున్న మాట. ఈ క్రమంలో ప్రధాన మంత్రి పర్యటనల కోసం సీఎం చంద్రబాబు దాదాపు 4 -5 రోజుల నుంచి కసరత్తు చేస్తున్నారని ఆయన చాలా సమయం వెచ్చిస్తున్నారని కూడా అంటున్నారు.

తాజాగా కర్నూలు పర్యటనకు సంబంధించి టిడిపి నాయకులతో సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఇది గతంలో ఎప్పుడూ చేయలేదు. పైగా అందరినీ అలర్ట్ చేయడంతో పాటు మంత్రులందరూ కర్నూలు పర్యటనకు హాజరు కావాల్సిందేనని చెప్పారు. అదే విధంగా కర్నూలు జిల్లా రాజకీయ నాయకులు అందరూ కూడా రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అంటే గతానికి భిన్నంగా సీఎం చంద్రబాబు ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పెద్దపీట వేస్తున్నారు.

ఒకరకంగా చెప్పాలంటే బిజెపి నాయకులకన్నా కూడా ఎక్కువగానే ప్రధానమంత్రికి ప్రాధాన్య ఇస్తున్నారు అన్నది వాస్తవం. దీని వెనక రాజకీయాలు ఉన్నాయా వ్యక్తిగతంగా రాష్ట్రానికి ఏమైనా మేలు జరుగుతుంద ని చంద్రబాబు భావిస్తున్నారా అనేది పక్కన పెడితే ఎన్నడూ లేని విధంగా పీఎం కోసం సీఎం మనసు పెడుతున్నారు అన్నది మాత్రం స్పష్టమవుతోంది. ఇదే విష‌యం ఇప్పుడు పార్టీ నాయ‌కుల్లో చ‌ర్చగా మారింది. అయితే.. ప్ర‌ధాని ఆమేర‌కు స‌హ‌క‌రిస్తారా? అనేది చూడాలి.