లోక్ భవన్ లోకి తొలిసారిగా బాబు
ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఏపీలో కూడా డిసెంబర్ మూడవ వారంలో శీతాకాల సమావేశాలు నిర్వహిస్తారని ప్రచారం అయితే సాగుతోంది.
By: Satya P | 7 Dec 2025 5:00 AM ISTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లోక్ భవన్ లోకి తొలిసారి అడుగుపెట్టారు. తాజాగానే కేంద్ర ప్రభుత్వం రాజ్ భవన్ లను లోక్ భవన్ లుగా పేర్లు మార్చిన సంగతి తెలిసిందే. రాజ్ భవన్ లో అధికార దర్పం కనిపిస్తోంది అని లోక్ భవన్ అయితే ప్రజలకు సంబంధించిన సంకేతం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఈ విధంగా మార్చారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో వెంటనే ఏపీలో కూడా లోక్ భవన్ పేరుతో విజయవాడలోని రాజ్ భవన్ మారిపోయింది. ఈ పేరు మార్పు జరిగాక బాబు ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళారు.
గవర్నర్ తో భేటీ :
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక విషయాలను ఆయన గవర్నర్ కి తెలియచేశారు అని అంటున్నారు. ఇది మర్యాదపూర్వకమైన భేటీ అని అంటున్నారు. ఇక ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు కూడా గవర్నర్ తో ముఖ్యమంత్రి చర్చిచారు అని అంటున్నారు. అలాగే విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సు గురించి కూడా గవర్నర్ కి వివరించారు అని అంటున్నారు. అలాగే ఏపీలో అభివృద్ధి కార్యక్రమామాలు పధకాలు కూడా ఈ ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అమరావతి రాజధాని విషయంలో జరుగుతున్న నిర్మాణాలు కూడా చంద్రబాబు గవర్నర్ కి తెలియచేశారు అని అంటున్నారు.
శీతాకాల సమావేశాలు :
ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఏపీలో కూడా డిసెంబర్ మూడవ వారంలో శీతాకాల సమావేశాలు నిర్వహిస్తారని ప్రచారం అయితే సాగుతోంది. దానికి ముందుగా లాంచనంగా ముఖ్యమంత్రి గవర్నర్ ని కలిసారు అని అంటున్నారు. ఈ విషయం కూడా ఆయనకు తెలియచేయడం ఒక సంప్రదాయంగా ఉంది అని అంటున్నారు. అలాగే రాష్ట్రంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న అనేక అంశాల గురించి కూడా ఇద్దరి మధ్యన చర్చ జరిగి ఉండొచ్చని అంటున్నారు.
రొటీన్ గానే :
అయితే గవర్నర్ తో సీఎం సమావేశం అంటే సాధారణంగా మంత్రి వర్గ విస్తరణ అని అంతా ఆలోచిస్తారు. అలాగే ఊహాగానాలు కూడా చేస్తారు. గతంలో బాబు గవర్నర్ ని కలసినపుడు కూడా అదే విధంగా ప్రచారం జరిగింది. కానీ అలాంటిది ఏదీ లేదని తేలిపోయింది. ఇపుడు కూడా రొటీన్ సమావేశమే అని అంటున్నారు. అయితే ఏపీ క్యాబినెట్ లో ఒక బెర్త్ ఖాళీగా ఉండడం అది జనసేనకు ఇస్తారని నాగబాబు మంత్రి అని ప్రచారం అప్పట్లో జరగడంతో బాబు రాజ్ భవన్ కి వెళ్ళిన ప్రతీసారి ఈ విధంగా ప్రచారం అయితే ఉంది. కానీ అవేమీ నిజం కావని అంటున్నారు. చూడాలి మరి ఈ భేటీ తరువాత ఏమైనా అనూహ్యమైనవి ఉంటాయేమో. ఏది ఏమైనా ఇది ఫక్తు మర్యాదపూర్వకమైన భేటీ అనే అంటున్నారు.
