Begin typing your search above and press return to search.

తేల్చుకుందాం రండి ... జగన్ కి బాబు పవర్ ఫుల్ సవాల్

సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎల్ల కాలం ఎవరూ ప్రజలను మోసం చేయలేరని ఆయన అన్నారు.

By:  Satya P   |   2 Sept 2025 3:45 AM IST
తేల్చుకుందాం రండి  ...  జగన్ కి బాబు పవర్ ఫుల్  సవాల్
X

వైసీపీకి ముఖ్యమంత్రి ఒక పవర్ ఫుల్ సవాల్ విసిరారు. ఆయన ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజంపేటలో జరిగిన ప్రజా వేదిక నుంచి మాట్లాడుతూ వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగానే అసెంబ్లీకి వస్తే అన్నీ చర్చిద్దామని ముఖ్యమంత్రి వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. అసెంబ్లీకి రాకుండా సోషల్ మీడియాలో విమర్శలు చేయడం కాని ప్రభుత్వం మీద బురద జల్లడం అంతకంటే కాదని చంద్రబాబు అన్నారు. ఇది పద్ధతి కాదని ఆయన మండిపడ్డారు.

అన్నీ అక్కడే అంటూ :

అసెంబ్లీ వేదికగా అన్ని విషయాలు అక్కడే చెబుతాను అని చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెడుతూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతూ కూటమిని అభాసు పాలు చేస్తున్నారు అన్నారు. ఎవరు అభివృద్ధి చేశారో ఎవరి హయాంలో ఏమి జరిగింది అన్నది అసెంబ్లీ సాక్షిగానే తేల్చుకుందామని ఆయన అన్నారు. అన్నింటికీ సిద్ధం అంటారు కదా మొన్నటి వరకూ సిద్ధం అని ఎగిరిపడిన వైసీపీ నాయకులు అసెంబ్లీకి వస్తే సంక్షేమం అభివృద్ధి ఎవరు చేశారో అన్ని లెక్కలు చెబుతాను అని చంద్రబాబు స్పష్టం చేసారు.

ఫేక్ ప్రచారాలేంటి :

సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎల్ల కాలం ఎవరూ ప్రజలను మోసం చేయలేరని ఆయన అన్నారు. తనకు ఉన్న 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి జగన్ రావాలని బాబు కోరారు. అక్కడే సూపర్ సిక్స్ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులు మొదలు పెట్టి బాబాయ్ హత్య, డోర్ డెలివరీ రాజకీయాలు, కోడి కత్తి డ్రామాలు, గులకరాయి ఎపిసోడ్లు, పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలు ఇలా దేనిపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని బాబు అంటున్నారు.

ఈ నెలలోనే అసెంబ్లీ :

ఇదిలా ఉంటే చంద్రబాబు ఎపుడూ అసెంబ్లీకి రమ్మని వైసీపీని ఈ తరహాలో పిలవలేదు. సవాల్ కూడా చేయలేదు. ఇపుడు ఆయన బయట కాదు సభలోకి రండి అన్ని విషయాలూ అక్కడే చర్చిద్దామని అంటున్నారు. పైగా సెప్టెంబర్ నెల మూడవ వారంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వర్షాకాల సమావేశాలు పది రోజుల పాటు సాగనున్నాయి. అందువల్ల అక్కడే బిగ్ డిబేట్ పెడదామని బాబు అంటున్నారు. జగన్ నే నేరుగా పిలుస్తున్నారు. మరి జగన్ దానికి ఓకే చెబుతారా అన్నదే ఇపుడు ఆసక్తికరంగా మారింది.

అసెంబ్లీకి వస్తారా :

జగన్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు అని ప్రచారం అయితే ఒక వైపు సాగుతోంది. దాని కంటే ముందు చంద్రబాబు ఇపుడు ఒక గట్టి సవాల్ నే విసిరారు. అందులో ఆయన చాలా అంశాలు ఉన్నాయి చర్చించడానికి అని అంటున్నారు. మరి బాబు చెప్పినట్లుగా అభివృద్ధి సంక్షేమం తో పాటు బాబాయ్ హత్య కోడి కత్తి వంటి వాటి మీద కూడా చర్చించేందుకు వైసీపీ సిద్ధంగా ఉందా అన్నదే అంతా ఆలోచించే విషయంగా ఉంది. మొత్తం మీద రయాలసీమలోనే జగన్ ఉన్నారు ఆయన పులివెందులలో ఉంటే రాజం పేట నుంచి ముఖ్యమంత్రి భారీ సవ్వాల్ విసిరారు. మరి ఈ సవాల్ కి వైసీపీ నుంచి ఏ విధమైన రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.