Begin typing your search above and press return to search.

జిల్లా టూర్లు...అక్కడే బస...బాబు రెడీ !

ఇదిలా ఉంటే జూలై 1 నుంచి 5వ తేదీ వరకూ వరుస కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధపడుతున్నారు.

By:  Satya P   |   29 Jun 2026 10:00 AM IST
జిల్లా టూర్లు...అక్కడే బస...బాబు రెడీ !
X

ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ మాత్రం చాన్స్ విపక్షానికి ఇవ్వదలుచుకోలేదు అన్నది అర్ధం అవుతోంది. ఆయన 2024 జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన దగ్గర నుంచి జనంతోనే ఉంటున్నారు. జనంతోనే మమేకం అవుతున్నారు. గడచిన 24 నెలలుగా బాబు ఏపీలోని అన్ని జిల్లాలను ప్రాంతాలను ఒకటి కంటే ఎక్కువ సార్లే తిరిగారు. ఆయన అలుపూ సొలుపూ లేకుండా ప్రతీ రోజూ ఎక్కడో ఒక చోటకు వెళ్తూనే ఉన్నారు. సభలు సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇపుడు సరిగ్గా రెండేళ్ళ పాలన కూటమికి పూర్తి అయింది దాంతో బాబు గేర్ మార్చారు, స్పీడ్ కూడా పెంచేశారు.

బిజీ షెడ్యూల్ తో :

ఇదిలా ఉంటే జూలై 1 నుంచి 5వ తేదీ వరకూ వరుస కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధపడుతున్నారు. ఆయన జిల్లల పర్యటనలు అన్నీ అభివృద్ధి కార్యక్రమాల్తో పాటుగా సంక్షేమ కార్యక్రమాలతో ముడిపడి ఉన్నవి కావడం విశేషం. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాలలో ముఖ్యమంత్రి పర్యటనలు ఉన్నాయి. ఇక ఈ జిల్లాల పర్యటనల సమయంలో అక్కడే చంద్రబాబు బస చేయనుండడమే విశేషం.

నెల్లూరుతో మొదలెట్టి :

ఇక చంద్రబాబు జిల్లాల పర్యటనలు నెల్లూరు జిల్లాతో మొదలవుతున్నాయి. జూలై ఒకటవ తేదీన పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో బాబు పర్యటించనున్నారు. ఇక అదే రోజు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీలో ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటో కార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ దాదాపు 750 కోట్ల రూపాయల పెట్టుబడులతో హీరో సంస్థ ఈ పార్ట్స్ సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది. దీనికి శంకుస్థాపన చేయనున్నారు. ఇక రాత్రికి చంద్రబాబు అక్కడే బస చేస్తారని అధికారులు చెబుతున్నారు.

సీమ జిల్లాలలోనే :

ఇక జూలై 2వ తేదీన తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ ఆజీవికా మిషన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం తిరుపతి పట్టణంలో ప్రైవేటు హోటల్ లో జరిగే కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ నకు హాజరవుతారు. ఈ వర్క్ షాప్ నకు నీతి ఆయోగ్ సభ్యులతో పాటు, పీఎం ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు హాజరవుతారు. రెండో తేదీ రాత్రి తిరుపతిలోనే చంద్రబాబు బస చేస్తారు. మూడవ తేదీన కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించనున్నారు. అనంతరం మూడు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు కుప్పం వెళతారు. 3 తేదీ నుంచి 5 వతేదీ వరకు కుప్పంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇలా జిల్లా పర్యటనలు చేస్తూ అక్కడే బస చేస్తూ బాబు పూర్తి బిజీ కానున్నారు. తిరిగి ఆయన 5వ తేదీన అమరావతికి తిరిగి చేరుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి.